మన వ్యవసాయం

కాప్సికం పంట సాగు చేసే పద్ధతులు…

0
Capsicum Cultivation Guide For Beginners
Capsicum Cultivation Guide For Beginners

సాంప్రదాయ పంటలతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను కూడా సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవసాయ రంగంలో మార్పులు చూడొచ్చు. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీనిలో కారం తక్కువగా ఉండడం వల్ల వీటిని పచ్చికూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని సిమ్లా మిర్చి, బెల్‌పెప్పర్‌, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్‌ ఎ,సి అధికంగా ఉంటుంది. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులో ఉంటాయి.పాలీహౌస్‌లో పండించడం వల్ల పంటకు కావాల్సిన టెంపరేచర్‌ మాత్రమే అందుతుంది కనుక కాయలు ఒకే సైజులోనూ ఒకే కలర్‌లోనూ ఉంటాయి. పంట కాలం ఎక్కువగా ఉంటుంది. బయట నాలుగు నెలల వచ్చే పంట ఇందులో ఆరు నెలల వరకు వస్తుంది.చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది.

కాప్సికం మన తెలంగాణా రాష్ట్రంలో మెదక్, రంగారెడ్డి జిల్లాలలో మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రబీకాలంలో పండిస్తున్నారు. సాధారణంగా విత్తనాలను సెప్టెంబరు మూడవ వారంలో విత్తి, విత్తన 5-6 వారముల వయస్సు గల మొక్కలను నాటేందుకు ఉపయోగిస్తారు. నీరు బాగా యింకు బరువైన సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనది. చవుడు నేలలు ఈ పంట సాగుకు పనికి రావు. . 1 మీటరు వెడల్పు 5 మీటర్లు పొడవు గల ఆరునారుమళ్ళని నారు, ఒక ఎకరంలో నాటటానికి సరిపోతుంది. సుమారు 500-600 గ్రా. విత్తనాలను 30 చ.మీ. నారుమళ్ళలో సమపాళ్ళలో చల్లాలి. విత్తడానికి ముందు కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున ధైరమ్ లేక డైథేన్ ఎం-45తో విత్తనశుద్ధి చేయాలి. తరువాత 100 గ్రా. థియేట్ లేక ప్యూరాడాన్ 3జి. గుళికలు 30 చ.మీ. నారుమడిలో వేసి అవసరం మేరకు సేంద్రియపు ఎరువులను వేయాలి. విత్తిన 12వ రోజున మరియు 19వ రోజున కాపర్ ఫంగిసైడు నేల తడిచేటట్లు పిచికారి చేయుట ద్వారా నారు కుళ్ళు తెగులును నివారించవచ్చును.

జింకు లోపం వున్న నేలల్లో హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ గాని లేక 2 గ్రా. జింక్ సల్ఫేట్ (స్లేను) లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయటం ద్వారా జింక్ లోపాన్ని నివారించవచ్చును. తేలిక పాటి నాగలితో 3-4 సార్లు అంతరకృషి చేసి కలుపు మొక్కలను తీసివెయ్యాలి

#CapsicumCultivation #Capsicum #AgricultureLatestNews #Eruvaaka

Leave Your Comments

కౌలు రైతును ఆదుకునేవారే లేరా !

Previous article

పట్టు పెంపకంతో లక్షల్లో ఆదాయం…!

Next article

You may also like