పశుపోషణమన వ్యవసాయం

Calf Management: దూడను తల్లి నుండి వేరు చెయ్యడం వలన కలిగే లాభాలు.!

1
Calf Management Uses
Calf Management Uses

Calf Management: దూడలను తల్లి నుండి వేరు చేసి పెంచుటను ” Weaning” అని అంటారు. దూడలను పుట్టిన వెంటనే వీనింగ్ చేయవచ్చు లేదా 2-3 రోజుల తర్వాత వీనింగ్ వేయవచ్చు. పేరు వేసి పెంచటం వలన ఆవుల పాల దిగుబడిలో ఎలాంటి మార్పులు ఉండవు మరియు దీని వలన క్రింది లాభాలుకలవు.

(1) దూడలకు మంచి పౌష్టికాహారాన్ని అందించవచ్చు.

(2) దూడలకు తల్లి పాలు ఎక్కువ అవడం వలన కొన్ని సందర్భాలలో డయేరియా కలుగుతుంటుంది. వీనింగ్ ద్వారా ఈ ఇబ్బందులను నివారంచవచ్చు.

(3) తల్లి ఆవుకు ఎదైనా జబ్బు వచ్చినప్పుడు చికిత్సకు ఉపయోగించే ఔషధం వలన దూడలలో ఎలాంటి పరిమాణాలు కలగకుండ వుండుటకు

(4) దూడలు పుట్టిన వెంటనే తల్లి నుండి వేరు చేయుట వలన తల్లి ఆవులు దూడ లేకుండానే పాలు ఇచ్చుటకు అలవాటు పడుతుంది. ఫలితంగా ఒక వేళ దూడలు చనిపోయిన తల్లి ఆవులు పాలు యధావిధిగానే ఇస్తుంది.

Also Read: Artificial Insemination in Cows: ఆవులలో కృత్రిమ గర్భధారణకు సరియైన సమయం తెలుసుకోండి.!

దూడల పోషణ:- మొదటి 4 -5 రోజుల వరకు దూడకు వాటి శరీర బరువులో 1/10 వ వంతు చొప్పున పాలు అందేటట్లు తల్లి పాలు ఇవ్వాలి. ఆ తర్వాత రెండు వారాల వరకు 1/15వ వంతు చొప్పున పాలు త్రాగించాలి. తదుపరి రెండు వారాలు 1/20 వ వంతు చొప్పున దూడలకు పాలను ఇవ్వాలి. తల్లి ఆవు చనిపోయిన యెడల లేదా తల్లి నుండి పాలు సరిగ్గా రాని యెడల దూడకు ” Bottle Feeding ” లేదా ” Pail Feeding” చెయ్యాలి. కృత్రిమంగా తయారు చేసిన జున్ను పాలను కొద్దిగా వెచ్చగా వేసి లేక ఆవు పాలను వేడి చేసి Bottle Feeding లో ఇస్తారు.

Calf Management

Calf Management

కృత్రిమంగా పాలమిల్క్ రిప్లేసర్ (Milk Replacers): దూడలకు రెండు వారాల వయస్సులో పాలకు బదులుగా మిల్క్ రీప్లేస్స్ను ఇస్తారు. ఇందులో గోధుమలు, పాలు, చేపల పొడి, బల్టటరిక్ ఆసిడ్ మరియు ఖనిజ లవణాలు సమ్మేళనం ఉంటుంది. దీనితో పాటు కొబ్బరి నూనె లేదా Lineseed Oil వంటివి కలుప వచ్చు. రెండు నెలల వయస్సు నుండి 16-18 శాతం ప్రోటీన్లు, 17 శాతం టి.డి.ఎస్ కలిగిన కాప్ స్టార్టర్ ను 1.8 కిలో గ్రాముల నుండి 2.2 కిలో గ్రాముల చొప్పున ఇవ్వవచ్చు. దూడలు పుట్టిన 2 రోజుల లోపల మెకోనియంను విసర్జించేటట్లు చేయవలెను. ఒక వేళ మలబద్దకం ఉన్నదో సబ్బు ద్రావణం కాని లేదా గ్లిజరిన్ కాని లేదా ఆముదం నూనెను కానీ ఇచ్చి ఎనిమా చేయవలెను.

దూడల దాణాలో మినరల్ మిక్షర్స్ మిశ్రమము (ఖనిజ లవణాల మిశ్రమం):

దూడలకు ఇచ్చే దాణాలో 2 శాతం ఖనిజ లవణ మిశ్రమాన్ని కలుపుట వలన దూడలు బాగా బరువు పెరుగుతాయి మరియు రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ ఖనిజ లవణ మిశ్రమంలో కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం ఉండుట వలన దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మరియు సకాలంలో ఎదకు వస్తాయి. దూడలు చర్మం మృదువుగా నిగ నిగ లాడుతూ ఉంటుంది. దూడలకు 10-20 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇటుకల పాకలో వ్రేలాడ తీసినట్లైతే దూడలు వాటిని నాకుతుంటాయి. వీటి వలన దూడలకు మట్టి తినడం, బట్టలు కొరకడం, కాగితాలు తినడం వంటి దురలవాట్లు కలగవు.

Also Read: Lung Plague Disease in Cows: ఆవులలో కంటేజియస్ బొవైన్ ఫ్లూరో న్యూమోనియా ఎలా వ్యాపిస్తుంది.!

Leave Your Comments

Wanaparthy Tirumalayya Gutta: వనపర్తికి తలమానికం తిరుమలయ్య గుట్ట.!

Previous article

Ideal Tillage: మంచి విత్తన మడి కి నేలను ఎలా దున్నాలి.!

Next article

You may also like