Calf Diptheria Disease in Cattle: ఇది ఫ్యూజో బ్యాక్టీరియం నెక్రోఫోరస్ అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన కలుగు అతి తీవ్రమైన వ్యాధి. ఈ బ్యాక్టీరియాలు సహజంగా నోటి కుహరంలోని మ్యూకోజాలో వుంటాయి.
వ్యాధి కారకం:
(1) ఇది ఫ్యూజో బ్యాక్టీరియం నెక్రోఫోరస్ (Fusobacterium Necrophorus) అనే Gm -ve బ్యాక్టీరియ వలన సంభవిస్తుంది.
(2) ఈ బ్యాక్టీరియాలు కర్ర ఆకారంలో ఉంటాయి.
(3) ఈ బ్యాక్టీరియాలు 3 రకాల విషపదార్థాల ను విడుదల చేస్తాయి.
(1) EndoToxin (2) ExoToxin (3) Hemolysin
వ్యాధి బారినపడు పశువులు: అన్ని రకాల వయస్సు గల ఆవులు, గేదెలలో ఈ వ్యాధి కలిగినప్పటికిను, 2 సంవత్సరాల వయస్సు గల ఆవులు, గేదెలలో ఎక్కువ ప్రమాదకరం.
Also Read: Age Determination in Cows: పాడి పశువుల వయస్సు నిర్ధారించుట.!
వ్యాధి వచ్చు మార్గం:
(1) ఈ వ్యాధి సోకిన పశువు యొక్క పాల ద్వారా
(2) వ్యాధి సోకిన పశువు నుండి వెలువడిన గాలి ద్వారా
(3) నోటిలోని శ్లేష్మ పొర చీలిపోవడం ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానము: బ్యాక్టీరియాతో కలుషితం అయిన ఆహారాన్ని, నీటిని నోటి ద్వారా తీసుకోవడం వలన లేదా బ్యాక్టీరియాలతో కలుషితం అయిన గాలిని ముక్కు ద్వారా పీల్చుట ద్వారా లేదా నోటిలో గాయాలు ఏర్పడినపుడు ఈ బ్యాక్టీరియాలు గ్రసని, స్వరపేటిక, శ్వాసనారంలోకి వెళ్ళి నివాసం ఏర్పర్చుకుంటాయి. ఈ అవయవాలు ఏదేని ప్రైమరీ ఇన్ఫెక్షన్ కి గురి అయినపుడు ఈ బ్యాక్టీరియాలు సమ విభజన చెంది సెకండరీ ఇన్ఫెక్షన్గా వ్యాధిని కలుగ చేసి, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిని మరియు న్యూమోనియాను కలుగజేస్తుంటాయి.
లక్షణములు: జ్వరం ఉంటుంది. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందులుంటాయి. ఆకలి ఉండదు. ఆహారం మింగలేక, నీరు త్రాగలేక పోవడం వంటి లక్షణాలుంటాయి. గ్రసని, స్వరపేటికను చేతితో తాకి చూసినప్పుడు వేడి, నొప్పి ఉంటుంది. ఊపిరితిత్తులలో న్యూమోనియా ఉంటుంది. పశువులు పై ఇబ్బందులతో చివరకు చనిపోతుంటాయి.
వ్యాధి కారక చిహ్నములు: గ్రసని, స్వరపేటిక, శ్వాసనాళంలో చిన్న చిన్న గడ్డలుంటాయి. ఊపిరితిత్తులలో న్యూమోనియా ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ: వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన లక్షణముల ఆధారంగా, పైన వివరించిన వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా, ప్రయోగశాల పరీక్షల ఆధారంగా వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స: వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స: సోడియం సల్ఫాడిమిడిన్ కి. లో శరీర బరువుకు 100-200 మి.గ్రా లేదా అంపీసిలిన్ కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా లేదా పెన్సిలిన్స్ కి. లో శరీర బరువుకు 10,000-20,000 యునిట్లు లేదా టెట్రాసైక్లిన్ కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా చొప్పున ఏదీని ఒక అంటీబయోటిక్ ఔషదములను ఇవ్వవచ్చు.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స: జ్వరం తగ్గడానికి అంటి పైరెటిక్ ఔషధములను, నొప్పిని తగ్గించుటకు అంటి అనాల్జెసిక్ ఔషదములను, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులను తొలగించుటకు రెస్పిరేటరీ స్టిమూలెంట్స్ను ఇవ్వవలెను.
ఆధారమును కల్పించు చికిత్స: పశువులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని స్థితిలో వున్నట్లైతే వాటికి
(1) సెలైన్స్ ద్రావణములను పెట్టవలెను.
(2) విటమిన్స్, మినరల్స్ కలిగిన ఇంజక్షన్లు ఇవ్వవలెను.
(3) పశువులకు సులువుగా జీర్ణం అయ్యేటువంటి మంచి పోషక పదార్థాలు కలిగిన గంజి వంటి ఆహారాన్ని ఇవ్వాలి. విశ్రాంతి ఇవ్వవలెను.
నివారణ: ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. పశువులు క్షేత్రంలో రోజు క్రిమి సంహారక మందులను చల్లి, క్షేత్రాన్ని శుభ్రంగా వుంచాలి. పశువులకు కలుషితమైనటువంటి ఆహారం మరియు నీరు ఇవ్వకూడదు.
Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!