Bud Rot Symptoms in Coconut: కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి.
Also Read: MANGO CULTIVATION: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు
ఎంచుకున్న గింజల నుండి పెరిగిన మొలకల ద్వారా కొబ్బరిని ప్రచారం చేస్తారు. సాధారణంగా 9 నుండి 12 నెలల వయస్సు గల మొక్కలను నాటడానికి ఉపయోగిస్తారు. 9-12 నెలల వయస్సులో 6-8 ఆకులు మరియు 10-12 సెం.మీ కాలర్ చుట్టుకొలత కలిగిన మొలకలను ఎంచుకోండి. కొబ్బరి మొలక ఎంపికలో ఆకులను ముందుగా చీల్చడం మరొక ప్రమాణం. శాస్త్రీయమైన ఆధునిక సేధ్యపు పద్దతులు పాటించటం ద్వారా రైతులు కొబ్బరిలో మంచి దిగుబడి సాధించవచ్చు.
మొవ్వు కుళ్ళు తెగులు:
కారకం: ఈ తెగులు ఫైటోఫరా సామివోరా అనే బూజు జాతి శిలీంధ్రం వలన వస్తుంది.
- ఈ తెగులు వర్షాకాలంలో కొబ్బరిని ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి.
- వర్షాల ఆరంభంలోనే ఈ తెగులు లక్షణాలు కనిపించడానికి అవకాశం ఉంది.
- మొవ్వు కుళ్ళు, కాయ కుళ్ళు తెగులు సోకిన చెట్లు నివారణ చర్యలు తీసుకోకపోతే చనిపోతాయి.
- ఈ తగులు నారు మడిలోని చిన్న మొక్కల నుండి 25 సంవత్సరముల లోపు చెట్లను ఆశించవచ్చు.
- నీటి ముంపుకు గురి అయిన భూములు, లంక భూముల్లోని తోటల్లో ఎక్కువ నష్టం చేస్తుంది.
లక్షణాలు:
- తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు ఆకు దాని ప్రక్కనున్న రెండు లేదా మూడు ఆకులు వడలిపోతాయి. మొవ్వు నుండి బయటకు వచ్చే భాగంలో ఎండు కుళ్ళు ఏర్పడుతుంది.
- మొవ్వు ఆకు పసుపు రంగుకి మారి ఎండిపోతుంది. ఇలాంటి ఆకులను లాగితే ఊడి వస్తాయి.
- ఈ కుళ్ళు మొవ్వు ఆకు క్రిందకు వ్యాపించి కొబ్బరి చెట్టులోని ఏకైక అంకురాన్ని ఆశించి అంకురం చనిపోయి చెట్టు చనిపోతుంది.
- కొన్నిసార్లు మొవ్వు కుల్లినప్పటికి అంకురం బ్రతికి ఉండుట చేత కొన్ని నెలల తర్వాత కొత్త ఆకులు జనిస్తాయి. కానీ ఈ ఆకులు అంచులు మాడి కురచగా ఉండి మొవ్వులోని పీచుతో అణచివేయబడి గుబురుగా ఉంటాయి.
Also Read: Nursery Management in Jatropha: జట్రోఫా లో నర్సరీ యాజమాన్యం.!