Cattle కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు
బ్రూసెల్లోసిస్:
ఇది బ్రూసెల్లా అబార్టస్ అనే Gm-ve బ్యాక్టీరియా వలన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కలుగు ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఈ బ్యాక్టీరియా ఎక్కువగా గర్భాశయంలో జీవిస్తూ పశువులు ఈసుకుపోయేటట్లు చేస్తూ, మాయ పడకుండా చేస్తుంటుంది. ఇది పశువుల నుండి మనుషులకు కూడా సోకే ఒక జునోటిక్ వ్యాధి.
వ్యాధి కారకం :- (1) ఇది బ్రూసెల్లా అబార్టస్, బ్రూ. మిలిటేన్సిస్ అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన పశువులలో, బ్రూ. సుయిస్ వలన పందులలో, బ్రూ. కానిస్ వలన కుక్కలలో ఈ వ్యాధి కలుగుతుంటుంది. (2) ఈ బ్యాక్టీరియాలు కర్ర ఆకారంలో వుంటాయి. (3) వీటి పెరుగుదలకు గాలి అవసరమైనప్పటికీ కొద్దిపాటి కార్బన్ డై ఆక్సైడ్ కూడా అవసరం. (4) ఇవి లింఫో పాలి శాకరైడ్ విషపదార్థాలను విడుదల చేయును.
వ్యాధి బారిన పడు పశువులు :- ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు మరియు మనుషులు.
వయస్సు :- లైంగిక పరిపక్వత చెందిన పశువులు, చూడి పశువులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి. గేదెలతో పోలిస్తే ఆవులలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ.
వ్యాధి వచ్చు మార్గం :- వ్యాధి కారక క్రిమి ఈసుకుపోయిన పిండం, పిండత్వచాలు, పాలు, వీర్యం, గర్భస్రావాలలో అధికంగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిమితో కలుషితమైన ఆహారం, నీరు వంటివి తీసుకోవడం ద్వారా లేదా చర్మ గాయాల ద్వారా లేదా కంటిపొరల ద్వారా లేదా సహజ గర్భోత్పత్తి కాని క్రుత్రిమ గర్భోత్పత్తి పద్ధతుల ద్వారా కాని లేదా వ్యాధి బారిన పడిన పశువుల పాలు త్రాగుట ద్వారా కాని ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.
వ్యాప్తి చెందు విధానం :- వ్యాధికారక క్రిమితో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన, ఈ క్రిముల పొట్టలోనికి పోయి, అక్కడి నుండి ప్రేగులలోనికి తద్వారా రక్తంలో కలియును. శరీర గాయాల ద్వారా క్రిములు శోషరస గ్రంథులలో చేరి, అక్కడి నుండి రక్తంలో కలిసి, సెప్టిసిమియాగా ఏర్పడును. రక్తం ద్వారా ఈ క్రిములు స్త్రీ లేదా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ భాగాలకు, కాలేయం, ఎముకలు, కీళ్ళలోనికి పోయి వాటిని నాశనం చేయుట ద్వారా ఈ క్రింది దుష్ఫలితాలు కలుగును.