పశుపోషణమన వ్యవసాయం

Broiler Farming: మాంసవు కోళ్ళ పెంపకంలో గృహవసతి, పోషణ యాజమాన్యం.!

3
Broiler Farming
Broiler Farming

Broiler Farming: బ్రాయిలర్ షెడ్డులోనికి స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించేలా ఉండాలి. ప్రతి కోడికి 1.0 చ. ఆ నేల కావలసి ఉంటుంది. గృహవసతి, ఆర్థిక పరిస్థితిని బట్టి వారానికి ఒక పర్యాయం లేదా రెండు వారాలకొకసారి లేదా నెలకొకసారి కోడి పిల్లలు సరఫరా అయ్యేట్లు. హేచరీస్ ఏర్పాట్లు చేసుకోవాలి.

  • ఈ విధంగా కోళ్ళ ఫారంలో ఎన్ని జట్లు కోళ్ళు ఉంటాయో అన్ని మరియు ఒకటి అదనంగా షెడ్లు నిర్మించుకోవాలి. అంటే ఎప్పుడూ ఒక షెడ్ ఖాళీగా ఉంటుందన్నమాట.
  • ఖాళీగా ఉండే షెడ్ను తరువాత వచ్చే కోడి పిల్లల జట్టు కొరకు శుభ్రపరచి, బ్రూడరు ఇతర పరికరాలు అమర్చి సిద్ధంగా ఉంచాలి.
  • తగినంత సూర్యరశ్మి కోళ్ళ గృహములో పడేలా చూడాలి. కోళ్ళ గృహములను ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి. మురికి నీళ్ళు పోవుటకు తగిన క్రమములు చేపట్టాలి.
Broiler Farming

Broiler Farming

Also Read: Broilers Importance: మాంసపు కోళ్ళ యొక్క ఆవశ్యకత.!

  • ఈ కోళ్ళ గృహమునకు విధ్యుత్ శక్తి త్రాగు నీటి సరఫరా. రవాణా వ్యవస్థ అనుభవమున్న పని వారు. కోళ్ళ దాణా తయారు చేయుటకు అందుబాటులో వుండేలా నిర్మించాలి.
  • ముఖ్య గమనిక ఏమనగా నిర్మించిన కోళ్ళ గృహములు మరియు వాటి ఉపకరణములు కోళ్ళ పెరుగుదలకు అనుకూలంగా వుండాలి. ఆవిధంగా అనుకూలించినచో మన ఆశయాల మేరకు కోళ్ళ పెరుగుదల, అభివృద్ధి చెంది మంచి లాభాలు పొందుటకు వీలగును.
  • ఈ కోళ్ళ గృహాములు కోళ్ళను అధిక వేడి చలి ఈదురు గాలులు మరియు అనానుకూలమైన వాతావరణముల నుండి కోళ్ళను రక్షించుటకు వీలుగా వుండాలి.
  • బ్రాయిలర్ పెంపకంలో మంచి ఫలితాలు కలగాలంటే కోళ్ళకు తగినంత మేత, నీటి స్థలాలను కేటాయించాలి

బ్రాయిలర్ కోళ్ళ పోషణ:

ఈ బ్రాయిలర్ పెంపకంలో 70% ఖరు దాణాపై పడును. బ్రాయిలర్ దాణాను 2 రకాలుగా తయారు చేస్తారు. ఈ కోళ్ళ పెరుగుదల కూడా ఈ దాణా యెక్క పోషక విలువల మీద ఆధారపడి ఉంటుంది. కనుక దాణా పైన శ్ర చాలా అవసరం. బ్రాయిలరుల పెంపకంలో లాభాలు గడించాలంటే. మేత ఖర్చు తక్కువయేట్లు చూసుకోవాలి.బ్రాయిలర్ కోళ్ళకు కావలసిన పోషక పదార్థాలన్నింటిని తగు పాళ్ళలో సమకూర్చే కొన్ని దాణా మిశ్రమాల నమూనాలు పట్టికలో ఇవ్వబడినవి. దినుసులు ఉత్తమమైన నాణ్యత కలిగి ఉండాలి.

బ్రాయిలర్ కోళ్ళకు ప్రత్యేకంగా తయారు చేయబడిన స్టార్టరు, ఫినిషర్ దాణాలనే వాడాలి. మెదటి 3 వారాల వరకు స్టార్టర్ దాణా. ఆ తరువాత ఫినిషరు దాణాలను ఇవ్వాలి. స్టార్టరు దాణాలో ప్రొటీన్స్ 22 శాత ౦ శక్తి కిలో దాణాకు 2900 కిలో కాలరీలు ఉండాలి. ఫినిషర్ దాణాలో ప్రొటీన్స్ 20 శాతం, శక్తి 3000 కి లోకాలరీలు దాణాకి ఉండేలా దాణాను తయారు చేసుకోవాలి. అప్పుడే బ్రాయిలర్ కోళ్ళ పెరుగుదల సరిగా ఉంటు ౦దిలేనిచో మాంసపు దిగుబడి తగ్గిపోయే ప్రమాదముంటుంది. బ్రాయిలర్ కోళ్ళ దాణాలో 1 లేదా 3 శాతం వ రకునూనె లేదా కొవ్వును వాడి దాణ వినియోగ సామర్ధ్యతను పెంచవచ్చు.

Also Read: Broiler Chicken: బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో తీస్కోవాల్సిన యజమాన్య చర్యలు

Leave Your Comments

Organic Farming Techniques: సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు.!

Previous article

Energy Plantation Importance: ఎనర్జీ ప్లాంటేషన్స్ యొక్క ప్రాముఖ్యత.!

Next article

You may also like