పశుపోషణమన వ్యవసాయం

Botulism Disease in Cattle: పశువులలో వచ్చే బోటులిజమ్ లక్షణాలు మరియు దాని నివారణ చర్యలు.!

0
Botulism Disease in Cattle
Botulism Disease in Cattle

Botulism Disease in Cattle: కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు.

Botulism Disease in Cattle

Botulism Disease in Cattle

Also Read: Bud Rot Symptoms in Coconut: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు లక్షణాలను ఇలా గుర్తించండి.!

Botulism ఇది క్లాస్ట్రీడియం బోటులిజమ్ అను Gm +ve బ్యాక్టీరియా వలన పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, మనుషులు మరియు గుర్రాలలో కలుగు అతి ప్రాణాంతకమైన వ్యాధి.

లక్షణాలు :- 1) కండరాలు కొట్టుకొనుట (2) కండరాలు బిగుసుకుపోయి వెనుక కాళ్ళు వెనుకకు, ముందు కాళ్ళు ముందుకు బిగుసుకుపోయి వెన్ను వంచి ధనస్సు ఆకారంలో ఉండును.

(3) ఈ వ్యాధి బారిన పడిన పశువులు చిన్న చర్యకు కూడా అధికమయిన ప్రతిచర్య చూపిస్తాయి.

(4) పశువులు నెమరు వేయవు.

(5) చివరి దశలో పశువు ఊపిరి ఆడక చనిపోతుంది.

(6) కొన్ని సార్లు నాలుక బయటికి వ్రేలాడుతూ వుండి నోరు మూయలేకపోతాయి.

(7) శరీర ఉష్ణోగ్రత సాధారణంగా కంటే తక్కువ వుంటుంది.

వ్యాధి కారక చిహ్నములు :- ఎటువంటి వ్యాధి కారక చిహ్నములను కంటితోగాని, సూక్ష్మదర్శినితో గాని చూడలేము.

వ్యాధి నిర్ధారణ :- (1) రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా(2) పైన వివరించిన వ్యాధి లక్షణముల ఆధారంగా(3) ప్రయోగశాలలో నిల్వ చేయబడిన గడ్డి, ఎముకలలో ఉన్న విష పదార్థాలను గుర్తించుట ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స :-వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స : :- ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేదు కాని పెన్సిలిన్ గ్రూప్, సెఫలోస్పోరిన్స్ గ్రూప్ అంటిబయోటిక్ ఔషధములను కండరాలలోకి రోజుకు 2 సార్లు ఇచ్చి ప్రయత్నం చేయవచ్చు. టెటనస్ ఆంటి టాక్సిన్ (Tetanus Anti toxins) ను కూడా ఇవ్వవచ్చు. ఒకసారి వ్యాధి. కలిగితే చికిత్సతో ఫలితం ఉండదు.

వ్యాధి లక్షణములు చేయు చికిత్స :- (1) శోధమును తగ్గించుటకు అంటి ఇన్ఫ్లమేటరీ ఔషదములను ఇవ్వాలి. (2) ఉద్రేకాన్ని తగ్గించుటకు మత్తును కలిగించే ఔషధములు వంటివి ఇవ్వాలి.

ఆధారము కల్పించు చికిత్స :- పశువు యొక్క స్థితిని బట్టి పశువుకు సెలైన్ ద్రావణములు, విటమిన్స్ ఇంజక్షన్లు మరియు మినరల్ మిక్షర్లు వంటివి ఇవ్వాలి.

నివారణ:- పశువులకు ఇచ్చే దాణా లేదా మేతలో పాస్ఫరస్ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని పరీక్షించి ఇవ్వాలి. చనిపోయిన పశువుల కళేబరాలను తినకుండా చూడవలెను.

Also Read: Nursery Management in Jatropha: జట్రోఫా లో నర్సరీ యాజమాన్యం.!

Leave Your Comments

Housing System of Poultry: కేజ్ సిస్టమ్ కోళ్ళ గృహవ్యవస్థ తో లాభాలు.!

Previous article

Red Palm Weevil Management in Coconut: కొబ్బరిలో ఎర్రముక్కు పురుగుని ఇలా నివారించండి.!

Next article

You may also like