మన వ్యవసాయం

నల్ల బియ్యం ఆరోగ్యానికి అమృతం

0
black rice
black rice

ఆరోగ్యంపై జనాల్లో శ్రద్ధ పెరుగుతుండటంతో కొత్తరకం పంటలు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది రైతులు పాతకాలం నాటి విత్తనాలు, సాగు పద్ధతులపై దృష్టి సారించారు. పోషకాలు ఎక్కువగా అందించే దేశీరకం విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. పురుగుల మందులను మోతాదుకు మించి వేసి పండిస్తున్న బియ్యాన్ని కాకుండా… పాతకాలంలోలాగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే బియ్యానికి డిమాండ్ పెరిగింది.ఇక బియ్యం అనగానే మనకు తెలుపురంగులో మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో నాలుగైదు రకాల పాలిష్‌ బియ్యానికే ప్రజలు అలవాటు పడ్డారు. ఫలానా బియ్యంతో వండితేనే ముద్ద దిగుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే వరిసాగులో పదుల రకాల విత్తనాలు ఉంటాయట. అందులో నల్ల బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్తున్నారు నిపుణులు.

బ్లాక్‌రైస్‌కి శతాబ్దాల చరిత్ర ఉంది. ఒకప్పుడు చైనాలోని ఈ బియ్య‌న్ని విరివిగా ఉప‌యోగించేవారు. అక్క‌డ రాజ వంశీయులు మాత్రమే వీటిని తినేవారు. అది క్ర‌మంగా ఈశాన్య భారతదేశం లోకి కూడా ప్ర‌వేశించింది. ముఖ్యంగా మ‌న దేశంలో మ‌ణిపూర్‌లో ఈ బియ్యాన్ని పండిస్తోంటారు. ఇక్క‌డ నుంచే ఇత‌ర‌ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ బియ్యంలో బోలెడు పోషకాలున్నాయి మరి! నల్లబియ్యంలో అధిక మొత్తంలో ఆంకోసైనిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులు వంటి రోగాలను నియంత్రిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నల్లబియ్యం ఎంతగానో దోహదపడతాయి. విటమిన్‌–బి, ఇ, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం ఐరన్ 24 ఇందులో పుష్కలంగా లభిస్తాయి. నల్లబియ్యం లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది కణాలను కూడా శుభ్రపరుస్తుంది.

ధాన్యంలో ఇతర రకాలకంటే బ్లాక్‌ రైస్‌ దిగుబడి తక్కువగా ఉంటుంది. అందుకే నల్ల బియ్యానికి డిమాండ్ చాలా ఎక్కువ . సాధారణ రకం ధాన్యం ఎకరానికి 25–30 బస్తాల దిగుబడి వస్తే బ్లాక్‌ రైస్‌ 10–15 మాత్రమే వస్తుంది. సాధారణ రకం ధాన్యం కిలో రూ.18 ఉంటే బ్లాక్‌ రైస్‌ రకం ధాన్యం రూ.100 వరకు ఉంది. వీటిని పండించిన రైతులు నల్ల బియ్యం కిలో రూ.170–180కి విక్రయిస్తుండగా.. మార్కెట్లో రూ.300–350 వరకు ధర పలుకుతోంది.

#Blackrice ##Benefitsblackrice #Eruvaaka #Farmers #AgricultureNews

Leave Your Comments

అంతర పంటల వైపు రైతు చూపు ? ప్రయోజనాలేంటి ?

Previous article

వరల్డ్‌ వేగన్ డే… వేగన్ డైట్ అంటే ?

Next article

You may also like