భారతదేశం రెండవ అతి పెద్ద వ్యవసాయ ఆధారిత దేశం, ఏడాది పొడవునా పంట సాగు ఉండటం వల్ల పెద్ద మొత్తములో వ్యవసాయ వ్యర్ధ పదార్దాలు ఉత్పత్తి అవుతున్నాయి. గణాంకాల ప్రకారం భారత దేశంలో సంవత్సరానికి 500 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్ధ పదార్దాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ పంట అవశేషాలను ఎక్కువ భాగం పశువుల మేతగా , ఇతర గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు ఇంధనంగా వాడుతున్నారు.అయినప్పటికి ఈ పంట అవశేషాలను ఎక్కువ భాగం సరిగా వినియోగించటం లేదు. దీనికి గల ముఖ్య కారణాలు , ఒకటి శ్రామికుల కొరత మరియు ఈ పంట అవశేషాలను సాంప్రదాయ పద్దతుల్లో కానీ కోత యంత్రాల సహాయంతో తొలగించటం అధిక ఖర్చుతో కూడుకున్న పని. ఈ కారణాల వల్ల రైతులు ఈ పంట అవశేషాలను పొలాల్లోనే కాల్చివేయటం జరుగుతుంది. దీని వలన పాడి పరిశ్రమ విలువైన మేత వనరులను కోల్పోవడమే కాకుండా ఇది పర్యావరణ కాలుష్యానికి దారి తీస్తుంది.
పారిశ్రామీకరణ మరియు పట్టణీకరణ వలన పశువులను మేపడానికి భూముల కొరత ఏర్పడుతుంది. దీని వలన మేత కొరత తీవ్రతం అవుతుంది. కావున ఈ మేత కొరతన పంట అవశేషాలను వాడుకొని కొంత వరకు తగ్గించవచ్చు. కానీ ఈ వ్యవసాయ వ్యర్ధ పదార్ధాలు తక్కువ పోషకాలు కల్గి పీచు పదార్ధం మరియు లిగ్నిన్ ఎక్కువ శాతం ఉండి తక్కువ పోషకాలు కల్గి పీచు పదార్ధం మరియు లిగ్నిన్ ఎక్కువ శాతం ఉంది తక్కువ అరుగుదల ఉంటుంది. కావున వీటిలో పోషక విలువలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వీటి యొక్క పోషక విలువలను అనేక మార్గాల ( ముక్కలుగా కత్తిరించడం మరియు యూరియా తో సుపోషకం చేసుకోవడం) ద్వారా పెంపొందించవచ్చు. అందులో ఒకటి సంపూర్ణ సమీకృత దాణా తయారీ.
సంపూర్ణ సమీకృత దాణా ఇటుకలను పశువుల అవసరాలకు అనుగుణంగా ఎండుగడ్డి మరియు దాణాను కావాల్సిన మోతాదులో లేదా నిష్పత్తిలో కలిపి తయారు చేస్తారు. మన రాష్ట్రంలో ఎక్కువగా మొక్కజొన్న మరియు జొన్న చొప్ప లభిస్తుంది. సంపూర్ణ సమీకృత దాణాలో ఉండే ముఖ్య పదార్దాలు ఎండుగడ్డి మరియు దాణా , వరి గడ్డి , మొక్క జొన్న , జొన్న , చొప్ప మరియు గోధుమ చొప్ప మొదలినవి లభ్యతను బట్టి కలుపుకోవచ్చు. పశువు యొక్క ఉత్పాదక దశను బట్టి ఎండుగడ్డి మరియు దాణాను 70 :30 లేదా 50 :50 నిష్పత్తిలో కలిపి సంపూర్ణ సమీకృత దాణాను తయారు చేసుకోవాలి.
సంపూర్ణ సమీకృత దాణా ఇటుకల (బ్లాక్స్ ) వినియోగం వలన కలిగే ప్రయోజనాలు :
- పశువులకు కావాల్సిన అన్ని పోషక పదార్ధాలు సరైన పాళ్ళలో లభిస్తాయి
- మేత వృధా కాదు
- మేతను తేలికగా జీర్ణం చేసుకోగల్గుతాయి
- సంప్రదాయేతర, వ్యవసాయ వ్యర్ధ పదార్ధాల వినియోగం పెంచడానికి వీలవుతుంది
- పశువు తీసుకునే ఆహారం 10 నుండి 20 శాతం పెరుగుతుంది
- రవాణా చేయడం మరియు నిల్వ చేయడం చాలా తేలిక
- పశువుల తామంతట తాముగా ఆహారాన్ని వెతికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు
- వేసవి కాలం ,వరదలు ,అనావృష్టి పరిస్థితుల్లో ఇది సరైన ప్రత్యామ్నయ ఆహారం
- దాణా ఖర్చు 15 – 20 శాతం తగ్గుతుంది
Also Read : టెర్రస్ గార్డెన్ పై 28న శిక్షణ తరగతులు…
సంపూర్ణ సమీకృత దాణా తయారీ:-
మొదట లభ్యతని బట్టి ఎండు గడ్డి మరియు దాణా దినుసులను ఎంపిక చేసుకోవాలి. మొదటిగా ఎండుమేతతో సహా అన్ని దాణా దినుసులను గ్రైండర్ లో పొడి చేసి తర్వాత మిశ్రమం చేసే యంత్రం లోకి పంపుతారు. ఖనిజ లవణ మిశ్రమం మరియు ఇతర ఫీడ్ అడిటివ్ లను ప్రీ మిక్సింగ్ చేసి కలుపుకోవాలి. ఏ మొత్తము మిశ్రమము ను 20 నిమిషాల పాటు మిక్సర్ లో ఉంచి సంపూర్ణ సమీకృత దాణాను తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని మాష్ లేదా పొడి రూపంలో అందించవచ్చు. కానీ దీని వలన పశువుల దాణాను మరియు గడ్డిని వేరు చేయడం మరియు దాణా మేత తొట్టిలో అడుగున చేరుకోవటం జరిగి పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. కావున పోషకాల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ దాణా ను పెల్లేట్ (గుళిక ) లేదా బ్లాక్ ల రూపం లో గాని పశువులకు అందించాలి.
సంపూర్ణ సమీకృత దాణా బ్లాక్ ల తయారీ :- పైన చెప్పిన విధంగా తయారు చేసుకొన్న మిశ్రమాన్ని హైడ్ రాలిక్ మెషిన్ సహాయంతో ఒత్తి 5 లేదా 10 కేజీల బ్లాక్ లుగా తయారు చేసి పశువులకు మేపుతారు.

Bricks ( బ్లాక్స్ )
ఆహార పదార్ధాలు సంపూర్ణ సమీకృత దాణా
కేజీ 1 2 3 4
మొక్కజొన్న/ జొన్న చొప్ప 60 50 – 50
పత్తి కట్టే – – 40 –
మొక్కజొన్న 12.4 15.5 23 10
పల్లి చెక్క 6.8 8.25 10 4
పొద్దు తిరుగుడు చెక్క 8 10 – –
పత్తి చెక్క – – 5 8
నూనే తీసిన తవుడు 9 11.5 9 16
కందిపొట్టు – – – 5
బెల్లం మడ్డి 2 2.5 10 5
యూరియా 0.6 0.75 1.0 0.5
ఖనిజ లవణ మిశ్రమం 0.8 1.0 1.0 1.0
ఉప్పు 0.4 0.5 1.0 0.5
ఈ విధంగా తయారుచేసిన సంపూర్ణ సమీకృత దాణా ఇటుకను పశువు యొక్క ఉత్పాదకత శక్తిని బట్టి అందించాలి. సంపూర్ణ సమీకృత దాణా ను బ్లాక్ లేదా ఇటుక రూపం లో పశువుకి అందిచితే పోషకాల సమపాళ్లలో అంది పశువు యొక్క ఉత్పాదకత మరియు పునరుత్పత్తి శక్తి పెరుగుతుంది.
డా . బి. విద్య మరియు డా . ఆర్.ఎం .వి .ప్రసాద్
పశు గణ క్షేత్ర సముదాయం , పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్ ,హైదరాబాద్
Also Read : మిద్దె తోటల పెంపకంపై ఆదరణ…