చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Pesticide Application: పురుగు మందుల సమర్థ వినియోగంలో మెళకువలు.!

0
Pesticide
Pesticide

Pesticide Application: పైరు తొలిదశలో మొక్కల పెరుగుదల, విస్తరణ తక్కువగా ఉండడం వల్ల పిచికారి చేస్తే పురుగు మందు వృధా కాకుండా చేతి పంపు ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారి చేయాలి. ఫైరు పెరిగి విస్తరించిన దశలలో వవర్ స్పేయర్లో పిచికారి చేయాలి. మిరప, ప్రత్తి, కూరగాయలు మొదలగు ఫైర్లలో తామర పురుగులు, ఎర్రనల్లి వంటి రసం పీల్చు పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చుతాయి. వీటి నివారణకు తాకిడి చర్య గల మందులను ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా స్ప్రే నాజిల్ను పక్కకు తిప్పి పిచికారి చేయాలి.

మందు నీరు, ఆకుల కింద, పైభాగాన మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా, గుబురుగా వున్న మొక్కలలోకి, పూత, పిందెలపై ఉన్న పురుగులపై పడేటట్లు జాగ్రత్తగా స్త్రీ చేయాలి. స్త్రీకు మంచి నాజిల్ ఎంపిక ఎంతో ముఖ్యం.మందు నీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం, వెడల్పు ఎక్కువగా మొక్కల మీద పడటం అవసరం. ఇది మనం ఎన్నుకున్న నాజిల్ పైనే ఆధారపడి ఉంటుంది.కొన్ని పైర్ల ఆకులు సన్నగా వుంటాయి. వాటి మీద మందు చల్లితే నిలవదు, జారిపోతుంది. కావున మందు నీళ్ళలశాండోవిట్ లేక టీపాల్ వంటి పదార్థాలు కలపాలి.

Pesticide Application

Pesticide Application

Also Read: 12th Grand Nursery Mela: 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.!

కొన్ని పురుగులు మొక్కలు మొదళ్ళలో కోశస్థ దశలో వుంటాయి. వీటి నివారణకు మొక్కలమొదళ్ళ వద్ద మట్టిలో కార్బరిల్ వంటి పొడి మందులను పాదులలో వేసి కలియబెట్టాలి.సాధ్యమైనంత వరకు రెండు రకాల పురుగు మందులను కలిపి పిచికారి చేయకూడదు. కొన్ని మందులను కలిపినపుడు మిశ్రమంలో రసాయన చర్యలు జరిగి మందు ద్రావణం శక్తిహీనమై నిరూపయోగ మవుతుంది. ఈ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహాలను పాటించి మందులను పిచికారి చేయాలి.

పురుగు మందుల వినియోగ సామర్థ్యం పెరగాలంటే సాధ్యమైనంత వరకు మందులను ఎండ వేడి తగ్గాక సాయంత్రం సమయంలో గాలి వీచే దిశగా పిచికారి చేయాలి. ఆ సమయంలో పత్ర రంధ్రాలు తెరుచుకోవటం వల్ల పురుగు మందు ఆకుల లోపలి భాగాలకు చొచ్చుకుని పోయి ఆకు మొత్తం మందుతో విషపూరితం అవుతుంది.అంతే కాకుండా అనేక రకాల లద్దె పురుగులు (లార్వాలు) రాత్రి పూట పంట నాశించి నష్టాన్ని కలుగచేస్తాయి. కావున సాయంత్రం సమయంలో మధ్యాహ్నం వేళ పిచికారి చేస్తే పురుగు మందులు పురుగుపై సమర్థవంతంగా పని చేయును మధ్యాహ్నం వేళ పిచికారి చేస్తే మందు ఆవిరి రూపంలోకి మారి త్వరగా దాని ప్రభావాన్ని కోల్పోయే అవకాశం వుంది.

మందు ద్రావణం శరీరానికి తగలకుండా నిండుగా దుస్తులు, ముక్కుకు పలుచని గుడ్డ, చేతులకు తొడుగులను, కళ్ళజోడు తప్పనిసరిగా ధరించాలి.పిచికారి చేయడానికి ముందు, మందుకి కలిపి నీటి ఎంపిక కూడ ఎంతో ముఖ్యం. పిచికారికి మురుగు, మట్టి కలిసిన, కుళ్ళిన ఆకులు , ఉప్పు నీరు వాడకూడదు. తేటగా వున్న మంచి నీటిని వాడితే మంచి ఫలితాలు వస్థాయి.

Also Read: High Yield Chilli Varieties: మిరపలో అధిక దిగుబడికి అనువైన రకాలు మరియు వాటి లక్షణాలు.!

Leave Your Comments

12th Grand Nursery Mela: 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.!

Previous article

Soil Moisture Uses: నేలలో నీటి ఆవశ్యకత.!

Next article

You may also like