మన వ్యవసాయం

Benefits of Pulses Farming: పప్పుధాన్యాల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు

3

Benefits of Pulses Farming: మన దేశం అపరాలు (పప్పుధాన్యాలు) ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, అంత కన్నా ఎక్కువ స్థాయిలో పప్పుధాన్యాల వినియోగం ఉండడం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో డిమాండ్ – సరఫరా మధ్య వ్యత్యాసం పెరుగుతూ వచ్చింది. కానీ దేశీయ అవసరాలు తీర్చడానికి విదేశీ దిగుమతులపై ఆధారపడడం తప్పకపోవడం వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు నష్టపోవడం జరుగుతూ ఉంది.

Also Read: ఇంటి పట్టునే పప్పుల మిల్లు

ప్రయోజనాలు:

  • వరి లాంటి ప్రధాన పంటల మాదిరిగా అధికంగా నీటి అవసరం లేకుండానే అపరాలను సాగు చేయవచ్చు. ముఖ్యంగా రెండవ, మూడవ పంటగా ఈ అపరాలు సాగు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరం.
  • అపరాల సాగు వల్ల నత్రజని స్థిరీకరణ జరిగి, నేల సారాన్ని పెంచడానికి దోహదపడుతుంది.
  • ఇతర పంటల మాదిరిగా కాకుండా, మార్కెట్లో సరైన ధర రాని పక్షంలో ఎంత కాలం అయినా ఇ పప్పుధాన్యాలను నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుంది.
  • ప్రధాన పంటల్లో క్రమం తప్పకుండా వచ్చే చీడపీడల సమస్యల నుండి బయటపడటానికి కూడా పంట మార్పిడిలో భాగంగా అపరాలను సాగుచేయవచ్చు.
  • రైతు భాగస్వామ్యం కలిగిన సంస్థలే (ఉదా : రైతు సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలు) విత్తన ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు చర్యలు చేవట్టడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి, అందులో భాగస్వాములైన రైతులు కూడా అధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.
  • రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే నేరుగా పప్పుధాన్యాలను సేకరించడానికి, సేకరించిన ధాన్యాన్ని సంచార వాహనాల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే పథకాన్ని ప్రారంభించే ఆలోచనను కూడా ప్రభుత్వం పరిగణిసున్నందు వలన అంతిమంగా పప్పుధాన్యాలు పండించే రైతులకు అధిక నికర ఆదాయాలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కాబట్టి ఈ ప్రత్యేక ప్రయోజనాలే కాకుండా, సాధారణ రైతుల కోసం ప్రభుత్వం అందించే రుణ సదుపాయం, సబ్సిడీ ఎరువులు లాంటి ఇతర సౌకర్యాలను ఉపయోగించుకొని అపరాలు సాగుచేసి దేశ ఆహార బద్రతను కాపాడటంలో భాగస్వాములు కాగలరు.

Also Read: అంతర పంటల సాగుతో ప్రయోజనాలు

Leave Your Comments

Emu Bird Farming: ఈమూ పక్షి పిల్లల పెంపకం

Previous article

Aloe Vera Cultivation: కలబంద సాగులో మెళుకువలు

Next article

You may also like