నేలల పరిరక్షణమన వ్యవసాయం

Benefits of Vermi Compost: వర్మికంపోస్టింగ్ వల్ల లాభాలు

2
Close up Farmer hand giving plant organic humus fertilizer to plant

Benefits of Vermi Compost: ప్రపంచంలో దాదాపు 2500 వానపాముల రకాలను గుర్తించారు. వీటిలో 500 పైగా ఇండియాలో ఉన్నాయి.  ఈ వానపాము రకం భూమిని బట్టి ఉంటుంది. అందువల్ల స్థానికంగా ఎలాంటి వానపాములు న్నాయనేది గుర్తించి తదనుగుణంగా వర్మికంపోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. ఈ వానపాములను మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోపెరియోనైక్స్ ఎక్స్కావటస్, మరియు లంపిటో మౌరిట్టి అనే రెండు రకాలు సాధారణంగా లభ్యమవుతున్నాయి. వీటి పెంపకం చేయవచ్చు లేదా కంపోస్టింగ్ లో  పద్ధతుల్లో గోతులలో, క్రేట్లలో,  చెరువుల్లో, కాంక్రీటు రింగుల్లో లేదా ఇతర పాత్రల్లో వాడవచ్చు.

Benefits of Vermi Composting

Benefits of Vermi Composting

లాభాలు:

  • జీవ రసాయన వ్యర్థాలను వానపాములు సులభంగా, వేగంగా ముక్కలు ముక్కలుగా చేయగలవు.  దీనివల్ల నిరపాయకరమైన, సలక్షణమైన కంపోస్టు ఎరువు  అతి తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అలాగే ఇవి భూమిని సారవంతంచేసి చెట్లు బాగా ఏపుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
  • వర్మి కంపోస్ట్ సరైన మోతాదుల్లో ఖనిజాలు లభ్యమయ్యేలాచూడటమేకాక, చెట్లకు అవసరమయ్యే పోషక పదార్థాలను అందిస్తుంది. సంక్లిష్టమైన ఎరువుకణాలుగా పనిచేస్తుంది.

Also Read: భూసార పరీక్షల ఆవశ్యకత మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యం

 Vermi Compost

Vermi Compost

  • వర్మి కంపోస్టింగ్ వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవకణాలను పెరగనీయకుండా చూస్తుంది. అదే సమయంలో  ఎరువు తయారీలో సారాన్ని కోల్పోకుండా చూస్తుంది.
  • వర్మి కంపోస్టింగ్   చెత్తను నిర్మూలించకుండానే పర్యావరణ సంబంధమైన సమస్యలనూ తగ్గిస్తుంది.
  • వర్మి కంపోస్టింగ్ ను కుటీర పరిశ్రమగా అందరూ గుర్తించాలి. ముఖ్యంగా ఇది అల్పాదాయ వర్గాలవారు అదనపు ఆదాయాన్నిచ్చే ఒక ప్రత్యామ్నాయమార్గంగా ఎంచుకోవచ్చు.
  • ప్రతి గ్రామంలోనూ నిరుద్యోగ యువత, మహిళలూ  ఒక సహకార సంస్థగా ఏర్పడితే ఈ వర్మికంపోస్టింగ్   ఒక చక్కని పరిశ్రమగా ఏర్పడుతుంది. తద్వారా తయారయ్యే ఎరువును తగిన ధరలకు ఆ గ్రామంలోనే సరసమైనధరలకు అమ్మవచ్చు.   దీనివల్ల యువత ఆదాయాన్ని పొందడమేకాక సమాజానికి చక్కని నాణ్యమైన సేంద్రీయ ఎరువును అందించి  వ్యవసాయ ప్రక్రియను కొనసాగించగలదు.

Also Read: వ్యవసాయంలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత.!

Leave Your Comments

Health Benefits of Roselle: గోంగూరలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Previous article

Mushroom Cultivation: పుట్టగొడుగుల షెడ్ ల విషయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like