మన వ్యవసాయం

మెంతి సాగుతో అధిక ఆదాయం…

0
Menthi Kura Sagu

Benefits Of Menthi Kura Sagu సాగులో ఏటేటా గణనీయమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రొటీన్ పంటల్ని వేసే రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. సాంకేతికను జోడించి అధిక ఆదాయం సమకూరే పంటల్ని ఎంచుకుంటున్నారు. ఆకుకూరల్ని పండిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందుతున్నారు కొందరు రైతులు. నిజానికి మార్కెట్లో ఆకు కూరలకి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మెంతికూరలో ఔషధగుణాలు ఎక్కువగా ఉండటంతో అన్ని కాలాల్లోనూ ఆ పంటకు మంచి డిమాండ్ ఉంటుంది. అది తెలుసుకున్న రైతులు మెంతికూర సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మెంతికూరను అంతరపంటగా వేసి అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.

Fenugreek Farming

Menthi Kura Sagu మెంతిని పొడిబారిన నెలలో సేద్యం చేస్తారు. పొడి నేలలో 6.5 నుండి 8.2 వరకు ఆల్కలిన్ తటస్థంగా ఉంటుంది. దీని కారణంగా ఆ మొక్కలు త్వరగా పెరుగుతాయి. అందువల్ల విత్తనాలు నాటిన 20 నుండి 30 కోతకు సిద్ధంగా ఉన్న ఆకులు ఉత్పత్తి అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మెంతి రకాల విషయానికి వస్తే కో-1, రాజేంద్ర కాంతి, ఆర్‌ ఎం టి-1, లాం సెలెక్షన్‌-1, కసూరి, ఆర్‌ ఎం టి-143, మేథి నెం-47, మేథి నెం-14, ఇ సి-4911, హెచ్‌-103 మరియు హిస్సార్‌ సొనాలి మొదలైనవి ముఖ్యమైన రకాలు. వీటిలో మేథి నెం-47 మరియు మేథి నెం-14 రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు.

Fenugreek

మెంతి కూర FenuGreekను ఎలా సేద్యం చేయాలంటే… ఒక హెక్టర్ గల పొలంలో 15 టన్నుల వ్యవసాయ యార్డ్ ఎరువు, 25 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 50 కిలోల పోటాష్ ని వినియోగించాలి. అయితే మెంతి ఆకు త్వరగా పెరిగేందుకు ప్రతి కటింగ్ తర్వాత నత్రజని ఉపయోగించాలి. Benefits Of Menthi Kura ఈ పంటలో అధిక ఔషధ గుణాలున్నాయి. మలబద్దకాన్నీ నివారించగలదు. ఇక కడుపులో అజీర్తిని తగ్గిస్తుంది. అదేవిధంగా ఆకలిని పెంచడంలో మెంతి పాత్ర ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్ ని తగ్గించడం, మధుమేహం, క్యాన్సర్ లాంటి రోగాలకు మెంతి చెక్ పెడుతుంది. అయితే మెంతి ప్రతి ఇంట్లో రోజువారీ ఆహారంగా మారడంతో కొందరు మహిళలు ఇంట్లోనే పెంచనుకుంటున్నారు. కుండీలోనూ, ఖాళీ ప్రదేశంలో సేంద్రియ పద్ధతిలో మెంతిని సాగు చేస్తున్నారు.

Fenugreek

ఈ పంటను ముఖ్యంగా మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్‌, శ్రీలంక, కొరియా మరియు ఇంగ్లాండ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌, మహరాష్ట్ర, పంజాబ్‌ మరియు తమిళనాడు రాష్ట్రాలు మన దేశంలో ఈ పంటను పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. Methi Cultivation

Leave Your Comments

రైతులపై కోవిడ్ ప్రభావం ఎంత?

Previous article

ఏపీలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు …

Next article

You may also like