మన వ్యవసాయంవ్యవసాయ పంటలు

Benefits of Inter Cropping: అంతర పంటల సాగుతో ప్రయోజనాలు

0

Benefits of Inter Cropping: ఒక పంట నష్టపోతే రెండవ పంట నుండి రాబడి సంపాదించి, నష్టాన్ని భర్తీ చేయవచ్చు. రైతు పొలం నుండి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. పోషక పదార్ధాల వినియోగ సామర్ధ్యం పెంచవచ్చు. కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చు. సహజ వనరులైన నేల, నీరు, సూర్యరశ్మిని పంటల మధ్యనున్న ప్రదేశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేల కోతను అరికట్టవచ్చు. పంటల నాణ్యతను పెంచవచ్చు. పుష్పజాతి మొక్కలను, గడ్డిజాతి ధాన్యపు మొక్కలతో పెంచడం వల్ల భుసారాన్ని పెంచవచ్చు. సరైన పద్ధతిలో సరైన పంటల్ని ఎన్నుకొని అంతర పంటలుగా పండించడం ద్వారా ప్రధాన పంటపై ఆశించే చీడపీడలను అరికట్టవచ్చు.

Benefits of Intercropping

Benefits of Intercropping

Also Read: అంతర పంటల వైపు రైతు చూపు ? ప్రయోజనాలేంటి ?

అనువైన అంతర పంటలు

నేల నుంచి పోషక పదార్ధాలు, నీరు గ్రహించే లోతులో వ్యత్యాసం ఉండే వెళ్ళ నిర్మాణం కలిగిన పంటలను ఎన్నుకోవాలి. ఒక పంట మరో పంట దిగుబడిని పెంపొందించే విధంగా ఉండాలి. పోషక పదర్ధాలు, నీరు, వెలుతురు విషయంలో పంటల మధ్య పోటి ఉండకూడదు. వేర్వేరూ కాలపరిమితులలో ఉన్న పంటలను, కలపడం వల్ల పోషక పదార్ధాల అవశ్యకతలో తేడాలవల్ల, కీలక దశల్లో పోటి ఉండకుండా ఆరోగ్యంగా పెంచవచ్చు. బహువార్షిక పంటలైన ఉద్యాన పంటల తొలుత నాలుగైదు ఏళ్ళ వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో పంటలు పండించవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి రెండు కంటే ఎక్కువ పంటలను వివిధ అంతస్తుల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటపై ఆకర్షించి చీడపీడలబారి నుండి ప్రధాన పంటను రక్షించవచ్చు.

 Inter Cropping

Inter Cropping

అంతర పంటగా పప్పుధాన్యాల పంటలతో ఎన్నో లాభాలు

పప్పుధాన్యాల పంటలు రాల్చిన ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పప్పుధాన్యాల పంటలు వాతావరణంలోని నత్రజనిని రైజోబియం వేరుబుడిపెల ద్వారా స్ధిరీకరించి భుసారాన్ని పెంచుతాయి. అంతేకాక అన్ని పప్పుధాన్యాల ఉత్పత్తికి దోహదపడి లభ్యత పెరిగి కొరతను తగ్గిస్తాయి. తోడుగా రైతుకు ఆర్ధిక వెసులు బాటు కలుగుతుంది

Also Read: పంట మార్పిడి తో రైతులకు అధిక దిగుబడి

Leave Your Comments

Sorghum Harvest: జొన్న పంట కోత సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

Types of Compost: కంపోష్టు రకాలు మరియు తయారీలో మెళుకువలు

Next article

You may also like