మనకు తెలిసిన పంటలు పదుల సంఖ్య మించదు. కానీ పంటలపై పూర్తి అవగాన పెంచుకుంటే మాత్రం ఎన్నో రకాల పంటలతో ఆదాయం సమకూర్చుకోవచ్చు. పల్లె నుంచి ప్రపంచం అంత తీపి పదార్ధాలను ఇష్టపడతారు. చాకోలెట్స్, బిస్కెట్స్ వీటిని పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటుంటారు. మరి అందులో కలిపే మిశ్రమానికి ఇంకెంత డిమాండ్ ఉండాలి. అవును చాక్లెట్స్, బిస్కెట్స్, ఇతర తినుబండారాలతో పాటు పానీయాలు, ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ‘కోకో’కు మంచి డిమాండ్ ఉంది. కోకో పంట నాటిన మూడవ ఏడాది నుండే దిగుబడి ఉంటుంది. దీన్ని దాదాపుగా 40 ఏళ్లకు పైగా వాడుకోవచ్చు. అంటే 40 ఏళ్ళ వరకు వినియోగించుకోవచ్చు. కోకోని ఒక్క చాక్లెట్లే కాదు.. కాఫీ, కేకుల తయారీలోనూ దీన్ని వాడతారు. ఫలితంగా మంచి గిరాకీ కలిగిన ఎగుమతి పంటగా కోకో గుర్తింపు పొందింది. దీంతో రాష్ట్రంలో ఈ పంటకు ఆదరణ పెరుగుతోంది.
ఈ పంటకు ఎర్ర నేలలు , గరప నేలలు ప్రధానమైనవి. తొలకరి నుంచి డిసెంబర్ వరకు ఈ మొక్కల్ని నాటవచ్చు. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలోనూ, ఉష్ణ మండల తడి వాతావరణంలోనూ ఈ పంటకు డోకా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కోకో సుమారు 57 వేల ఎకరాల్లో సాగవుతోంది. గతేడాది 10 వేల టన్నుల కోకో గింజలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా ఈ పంటకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఉద్యాన శాఖ హెక్టారుకు రూ.11 వేల సబ్సిడీ అందిస్తోంది. కోకో కాయలు సేకరించేందుకు ప్లాస్టిక్ ట్రేలను సరఫరా చేస్తోంది. పాలిషెడ్స్ ప్లాట్‌ఫారాలూ ఏర్పాటు చేస్తోంది. కమీషన్ ఏజెంట్లు కోకో గింజలను కొనుగోలు చేసి చాక్లెట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటారు.
ఇక పెట్టుబడి విశయానికి వస్తే కోకో పంటకు ఎకరాకు దాదాపుగా 6 వేలు అవుతుంది. అయితే ఒక్క ఎకరంలో దాదాపుగా 200 మొక్కల వరకు సాగు చేయవచ్చు. నాటిన మూడో ఏడాది నుంచి కాపుకు వస్తుంది. పిందె వచ్చినప్పటి నుంచి కాయలు కోతకు రావడానికి ఐదు నెలల సమయం పడుతుంది. అప్పటి నుంచి ఏడాది పొడవునా పంట చేతికి వస్తుంది. ప్రతి కాయలో 25 నుంచి 45 వరకు విత్తనాలు ఉంటాయి. మరో విశేషం ఏంటంటే.. దాని నుండి రాలిన ఆకులే ఎరువుగా మారుతాయి. కోకో పంటకు అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉంది.
#cocoafarming #andhrapradeshcocoa #cocoa #chocolates #agriculture #eruvaaka