Bamboo Cultivation: వెదురును పేదవాడి కలప , పచ్చ బంగారం , ప్రజల స్నేహితుడు అంటారు. బారతదేశంలో 23 జాతులకు చెందిన 136 రకాలైన దేశీయ, విదేశి వెదురు రకాలు అందుబాటులో ఉన్నాయి.ఇది ఆకు రాల్చు ,సతత హరిత మొక్కగా ప్రసిద్ది. ఇది ఒక లిటరు నీటిని తీసుకోని 6.6 గ్రాముల కలపను యిస్తుంది.
వ్యాప్తి : మన దేశంలో 13.7 మిలియన్ హెక్టార్లలో పెరుగుతూ 12.5 మిలియన్ మెట్రిక్ టన్నుల దిగుబడి కలిగి ఉన్నది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం , వరంగల్, నిజామాబాదు లో విరివిగా సాగు చేస్తున్నారు. తేమ గల వాగుల వెంబడి , పర్వత కొండ వాలు వెంబడి తేమ వాతావరణం గల లోయలలో , కొండ ప్రాంతాలలో, పల్లపు ప్రాంతాలల్లో, ఉష్ణ సమ శీతోష్ణస్థితి , శీతల ప్రదేశాలలో పెరుగుతుంది. సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాలలో కూడా పెంచవచ్చు. వెదురుకు 8-36 డిగ్రీ సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత, సగటు వర్షపాతం 1000 మీ.మీ అవసరం. గాలిలో తేమ ఎక్కువగా ఉంటె బాగా పెరుగుతుంది.
నేలలు : ఇసుకతో కూడిన బంకమన్ను , ఎర్ర నేలలు , నల్ల రేగడి నేలలు అనుకూలం . నేలలో ఉదజని సూచిక 6.5-7.5 వరకు ఉండాలి.
Also Read: వెదురు పిలకల కూర అద్భుతం
రకాలు :
డేన్ద్రోకేలమస్ స్త్రిక్టాస్ : ఇది సాదారణంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది . ఇది గట్టి బొంగు జాతి కానీ మద్యలో చిన్న రంద్రం ఉంటుంది . గరుకుగా ఉన్నా మంచి నీటి వసతి గల పొడి నేలలో పెరుగుతుంది. ఇది ముళ్లు లేని రకం.
బాంబుస అరుండినేరియ : ఇది సాదారణంగా ఇసుకతో కూడిన బంకమన్ను నేలలో , రాళ్ళు కలిగిన బంకమన్ను నేలలో పెరుగుతుంది ,దిని బొంగు వాలుగా ఉండి లోపల బోలుగా ఉంటుంది.కణుపులు దగ్గరగా ఉంటాయి , ఇది ముళ్లు కలిగిన రకం.
నాటే ప్రదేశాలు :పంట పొలాల్లో గట్ల చుట్టూ 4 మీటర్ల ఎడంతో పెంచవచ్చు . అదే తోటగానైతే 5*5 మీటర్ల ఎడంతో నాటుకోవచ్చు
వెదురులో దిగుబడి నాలుగు సంవత్సారల తర్వాత నుండి తీసుకోవాలి.
Also Read: వెదురు సాగుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50% సబ్సిడీ