Bacillary Haemoglobinurea in Cows: కోట్లాది మంది ప్రజలు ప్రధానంగా రైతు కుటుంబాలు తమ పోషణ, ఆహార భద్రత మరియు జీవనోపాధి కోసం పశువులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. పశువుల పెంపకాన్ని ప్రారంభించాలనుకుంటే పెద్ద ఎత్తున వ్యవసాయం ప్రారంభించాల్సిన అవసరం లేదు. చిన్న తరహా పశువుల పెంపకంతో భారీగా సంపాదించవచ్చు
Also Read: Gir Cow Milk: గిర్ ఆవు పాలకు ప్రజాదరణ పెరుగుతోంది
భాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా Bacillary Haemoglobinurea:
ఇది క్లాస్ట్రీడియం హిమోలైటికమ్ (CI Haemolyticumn) అను Gmove బ్యాక్టీరియా ద్వారా ఆవులు, గొర్రెలలో కలుగు అతి తీవ్రమైన ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో తీవ్రమైన జ్వరం, హిమోగ్లో బిన్యూరియా, పచ్చ కామెర్లు వంటి లక్షణాలు వుండి కాలేయం పూర్తిగా దెబ్బతిని పశువులు చనిపోతూ వుంటాయి.
లక్షణాలు :- వ్యాధి బారిన పడిన పశువులు ఉన్నట్టుండి ఎర్రగా మూత్రం పోయడం. జ్వరం తీవ్రంగా వుండటం, ఆకలి వుండదు, నెమరు వేయడు, పచ్చకామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తూ, రక్తహీనతతో చనిపోవడం అనేది జరుగుతూ వుంటుంది.
వ్యాధి కారక చిహ్నములు:- కాలేయంలో Infractions వుండును. కాలేయంలో ‘కార్జపు జలగలు తిరిగిన జాడలను గుర్తించవచ్చు. గుండె, ఊపిరితిత్తులలో రక్తపు చారలు గమనించవచ్చు. శరీరంలోని అవ యవాలన్నింటిలో హిమోగ్లోబిన్ వర్ణకం పేరుకుపోవటం వలన అవి పసుపు రంగులో కనిపిస్తూంటాయి.
వ్యాధి నిర్ధారణ:- వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నములు మరియు ప్రయోగశాల పరీక్షల ఆధారంగా కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు. వ్యాధికారక క్రిమిని కాలేయపు స్మియర్లో గ్రామ్ స్టెయినింగ్ చేసి చూడవచ్చు.
చికిత్స:-
- వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స : (1) కార్డపు జలగలకు డీవార్మింగ్ చేయాలి.(2) క్లాస్ట్రీడియం హిమోలైటికమ్ కాక్టీరియాలను చంపడానికి పెన్సిలిన్స్, సెఫలో స్పోరిన్స్, టెట్రాసైక్లిన్ వంటి గ్రామ్ పాజిటివ్ అంటిబయోటిక్స్, బెటా లాక్టమ్ అంటీ బయోటిక్స్ లను వాడి నివారించాలి.
- వ్యాధి లక్షణములకు చేయు చికిత్స :- జ్వరం తగ్గించడానికి అంటి పైరెటిక్స్ ఔషదములను ఇవ్వాలి. రక్తహీనతను తగ్గించడానికి ఇనుపు ధాతువులు కలిగిన ఔషదములను ఇవ్వవలెను. కాలేయం మీద పనిచేసే లివర్ ఎక్స్ట్రా ట్రాక్ట్ ఔషదాలను ఇచ్చినట్లైతే కామెర్ల లక్షణాలను తగ్గించవచును.
(1) పశువు యెక్క స్థితిని బట్టి అవసరమైతే విటమిన్స్, మినరల్స్, లివర్ ఎక్స్ట్రాక్ట్ మరియు సెలైన్ వంటి ద్రావణాలను ఇచ్చిన తొందరగా పశువులు కోలుకుంటాయి.
నివారణ: వర్షకాలంలో నత్తలు, జలగలు వుండే ప్రదేశంలో పశువులను మేతకు తీసుకుపోకుండా జాగ్రత్త పడాలి. వర్షకాలం రావడానికి ముందు కార్జపు జలగలు నివారణకు డీ – వార్మింగ్ చేయాలి. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.
Also Read: Cow Dung: ఆవు విరేచనాలకు పరిష్కార మార్గాలు