Atmosphere Layers of Earth: భూమి దీర్ఘ వృత్తాకారం లో ఉంటుంది. భూమి చుట్టూ గాలి వాతావరణం ఉంటుంది.భూమి చుట్టూ ఉన్న గాలికి రంగు, రుచి, వాసన లేని భౌతిక మిశ్రమము ( అంటే రసాయనిక చర్యలు ఉండవు)భూమి చుట్టూ గల గాలికి కదలిక, సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. నేల నుండి ఎత్తు పెరుగుచున్న కొలది వాతావరణం లో వాయు సాంద్రత తగ్గును (భూమి నుండి 6.5 కి.మీ లలో సగం వాతావరణ సాంద్రత ఇమిడియున్నది.వాతావరణం చాలా వాయువుల మిశ్రమం. వాయువులతో బాటు గాలిలో ఘన, ద్రవ పదార్ధాలు (ఏరోసాల్స్) ఉంటాయి. వాతావరణ క్రింది భాగం లో అసంఖ్యాకం గా ధూళి కణాలు, పొగ రేణువులు, సముద్రపు ఉప్పు, పుప్పొడి (పోలెస్) మొదలైనవి ఉంటాయి.ఇవి సూర్య కాంతి ని శోషించి, వెదజల్లుటలో ముఖ్య పాత్ర వహిస్తాయి.
వాతావరణ నిర్మాణ స్వరూపము:
ట్రోపో ఆవరణo: భూమి కి దగ్గరలో ఉన్న ఆవరణము.అక్షాంశము ను బట్టి భూమి నుండి 8 – 18 కి మీ ఎత్తు ఉంటుంది. (భూమధ్య రేఖ వద్ద 14 కిమీ, ధ్రువాల వద్ద 7 – 8 కిమీ మందం ఉంటుంది).ప్రదేశాన్ని బట్టి, సీజన్ బట్టి ఈ ఆవరణము ఎత్తు మారుచుండును.వివిధ రకాల మేఘాలు, తుఫానులు, ఉరుములతో కూడిన వర్షాలు, వ్యతిరేక తుఫానులు ఈ ఆవరణం లో నే సంభవిస్తుంది. నీరు ఆవిరి రూపం లో ఉంటుంది.గాలి తీవ్రత ఎత్తు పెరిగే కొలది పెరుగు తుంది.ఉష్ణోగ్రత ఎత్తు పెరిగే కొలది తగ్గు తుంది (6.5 °C/కి.మీ లేదా 3.6 /1000′)75% వాయువులు, తేమ, ధూళి కణములు 13 కి.మీ ఎత్తు లోనే ఉంటుంది.వాతావరణం లో గాలి సూర్య కిరణాలను కోపించడం వల్ల ఈ ఆవరణం క్రింది నుండి వేడెక్కు తుంది (terrestrial radiation)ట్రోపా పాజ్ – ట్రోపో మరియు స్ట్రాటో ఆవరణములకు వేరుచేయు సన్నని పొర గాలిలో కదలిక లేక పోవడం ముఖ్యాంశం.
Also Read: Damage Symptoms of Pests: చీడపురుగులు గాయపరచు లక్షణాలు.!
స్ట్రాటో ఆవరణము: ఇది భూమి నుండి (20-55 కి.మీ) వరకూ ఉంటుంది. కాంతి, రసాయన చర్యలకు ముఖ్య కేంద్రముఎత్తు పెరిగే కొలది ఉష్ణోగ్రత పెరుగు తుంది. ఈ ఆవరణ పై భాగం లో గల ఉష్ణోగ్రత భూమి దగ్గరలో గల ఉష్ణోగ్రతకు దగ్గర లో ఉంటుంది.ఉష్ణోగ్రత సంవాహకము తక్కువ. గాలి కదలికలు అధికము.ఈ ఆవరణం లో “ఓజోన్” పౌర సూర్య కాంతి లో నున్న అతి నీల లోహిత కిరణాలను శోషింప జేస్తుంది.
మీసో ఆవరణము: భూమి నుండి 30-60 కి మీ మధ్య ఓజోన్ పరిమాణము గరిష్టము గా ఉంటుంది. ఈ ఓజోన్ సూర్య కిరణము లలోనిఅతి నీల లోహిత కిరణాలను శోషించి ప్రాణి కోటిని రక్షిస్తుంది.ప్రతి కిలోమీటరుకు 50 ° C చొప్పున ఉష్ణోగ్రత పెరిగి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. రసాయన చర్యలు అధికం గా జరగడం వల్ల దీనిని “కిమో ఆవరణము” అంటారు.
ఐనో ఆవరణము / ధర్మో ఆవరణము: భూమి నుండి 80 కి మీ ఎత్తులో ఉండి 400 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది.ఈ ఆవరణము లోని వాతావరణము పాక్షికం గా అయాస్ శక్తి కలిగి ఉండడం వల్ల ” ఐనో ఆవరణము” అంటారు.స్పష్టమైన అయాన్ పొరలు ఉంటాయి.80 – 140 కి మీ మధ్య “ధర్మో ఆవరణము” గా పిలుస్తారుఓజోన్ పై భాగం లో ఉష్ణోగ్రత తగ్గును. రేడియో తరంగాలను పరావర్తనం చేసే స్వభావం వలన దూర ప్రాంతాలకు సమాచారం అందజేయ బడుతుంది. కాని తక్కువ తరంగ దైర్ఘ్యం గల టెలివిజన్ తరంగాలను మాత్రం పరావర్తనం చెందించ లేదు.
ఎకో వరణము: భూ వాతావరణపు అత్యున్నత పై పొరను ” ఎకో ఆవరణము” అంటారు.వాతావరణం లో అణువుల సాంద్రత తక్కువ గాబట్టి అణువుల మధ్య సంఘటన తక్కువ.ఉదజని, హీలియం వాయువులు ఎక్కువ. భూమి నుండి 400-1000 కిమీ మధ్య విస్తరించి ఉంటుంది.
Also Read: Sowing the Seeds: విత్తనాలు విత్తుట.!