Tulip Garden: భారతదేశం భూతాల స్వర్గం అందాల సుందర లోయ కాశ్మీర్ లో తులిప్ పువ్వులు విరబూశాయి. అక్కడ అందాలను చూడడానికి రమ్మనమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ఆహ్వానం పలికారు. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం వీక్షకుల కోసం ప్రారంభం కానుంది.ఈ గార్డెన్‌లో 64 రకాల్లో మొత్తం 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి
తులిప్ గార్డెన్ ను 2008లో అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం గులాంనబీ ఆజాద్ పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించారు. తులిప్ గార్డెన్.. నాలుగు దిక్కులా ఎటు చూసినా తులిప్ పువ్వులే మనకు దర్శనమిస్తాయి. తెలుపు, పసుపు, పింక్.. ఇలా రక రకాల రంగుల్లో.. ఆకాశం నుంచి చూస్తే.. ఇంద్ర ధనుస్సు నేల మీద విరిసిందా.. అన్నట్లుగా ఆ తులిప్స్ తమ అందాలతో మనకు కనువిందు చేస్తాయి. సృష్టిలోని అందమంతా తమలోనే దాగుందన్నట్లు.. పర్యాటకుల చూపును తమవైపు తిప్పుకుంటాయి. వాటిని చూసేందుకు నిజంగా మన రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. శ్రీనగర్ లోని దాల్ లేక్ సమీపంలో జబర్వాన్ రేంజ్‌లోని పర్వతసానువుల్లో ఈ గార్డెన్ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌లలో ఒకటి కావడం విశేషం
జమ్మూ మరియు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సుకు అభిముఖంగా ఉన్న ఆసియాలోనే అతిపెద్దది తులిప్ గార్డెన్. మంచుతో కప్పబడిన జబర్వాన్ పర్వత శ్రేణుల దిగువ ప్రాంతంలో 30 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం లోయలో పర్యాటక సీజన్‌ను రెండు నెలల పాటు పొడిగించేందుకు ఉద్దేశించబడింది.జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ మెహతా ఈ గార్డెన్‌ను ప్రజల కోసం ప్రారంభించారు. గత ఆరు నెలల్లో లోయలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చినట్లు తెలిపారు. టూరిజం పుంజుకుందని, లోయలోని హోటళ్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రజలకు గదులు లభించడం లేదన్నారు. 75 కొత్త పర్యాటక ప్రాంతాలను ప్రారంభించి ప్రచారం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.ఈ సంవత్సరం తోటలో తులిప్స్, డాఫోడిల్స్, హైసింత్‌లు మరియు మస్కారి యొక్క 1.5 మిలియన్ పువ్వులు ఉన్నాయి. తులిప్ గార్డెన్ ఇన్ ఛార్జి ఇనామ్ రెహ్మాన్ సోఫీ మాట్లాడుతూ 68 రకాల తులిప్స్ పూలలో కలిపేశామన్నారు. ఆరు కొత్త రకాల తులిప్‌లను సందర్శకులు చూసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గత ఏడాది 2.25 లక్షల మంది ఈ గార్డెన్‌ను సందర్శించారని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ మంది వస్తున్నారని సోఫీ చెప్పారు.
సందర్శకుల్లో ఎక్కువ మంది లోయ వెలుపలి నుంచి వస్తున్నారని, ఇది శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ ఉద్యానవనం ఇప్పటికే మన పర్యాటక సీజన్‌కు సిద్ధంగా ఉంది మరియు ఈ సంవత్సరం పర్యాటక సీజన్‌కు ఇది మంచి శకునమని నేను భావిస్తున్నాను. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి, శాఖ ఈ సంవత్సరం ఆన్‌లైన్ టిక్కెట్ల అమ్మకాలను కూడా ఏర్పాటు చేసింది. తులిప్ పువ్వుల సగటు జీవిత కాలం మూడు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది, కానీ భారీ వర్షాలు లేదా తీవ్రమైన వేడి వాటిని త్వరగా నాశనం చేస్తుంది.
తులిప్ పువ్వులను కేవలం గృహ అలంకరణకు మాత్రమే ఉపయోగిస్తారు. వివిధ రంగులతో విరభూసే తులిప్ పువ్వుల అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. వసంతం ప్రారంభంలో దర్శనమిచ్చే ఈ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. హంగేరి, కజకిస్థాన్, నెదర్లాండ్, టర్కీ వంటి దేశాలు తులిప్ ను తమ జాతీయ పుష్పంగా ప్రకటించాయి.