Ashwagandha Cultivation Techniques: దీనిని తెలుగులో పెన్నేరు గడ్డలు అని కూడ పిలుస్తారు. దీని పేర్ల నుండి విథాఫెరస్ ‘ఎ’ మరియు’బి’ ను ఆల్కలాయిడ్స్ లభిస్తాయి. దీని వేర్లు మరియు ఆకులు ఆయుర్వేద మరియు యునాని ఔషధ తయారీకి ఉపయోగిస్తారు.
Also Read: Ashwagandha Cultivation: ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న పంట అశ్వగంధ
నేలలు: ఇసుక లేదా తేలికపాటి ఎర్రనేలలు అనుకూలం. ఉదజని సూచిక 7.5 – 8.0 ఉండాలి.
వాతావరణం: ఖరీఫ్ లో ఆలస్యంగా సాగుచేస్తారు. కనీసం 65-70 సెం.మీ. వర్ష పాతం అవసరం. వర్ష పాతం సరిపోనియెడల 2-3 సార్లు నీటి తడులివ్వాలి. పొడి వాతావరణము సాగుకు అనుకూలం.
రకాలు: జవహార్ అశ్వగంధ -20, పోషిత, రక్షిత మరియు నాగోర్.
విత్తే సమయం: ఖరీప్ జులై-అగస్టులో విత్తుకోవాలి. (జులై- డిసెంబర్/జనవరి), అక్టోబర్-నవంబర్లో నీటిపారుదల క్రింద రెండవ పంటగా వేసుకోవచ్చు.
విత్తన మోతాదు: ఎకరాకు 6-8 కిలోలు (నేరుగా విత్తేందుకు) కనీసం 5 రెట్లు ఇసుకతో కలిపి విత్తుకోవాలి.
నాటే దూరం: వరుసలలో నాటుకోవడం అంత లాభసాటి కాదు. వెదజల్లడం వలన మొక్కల సాంద్రత ఎక్కువ ఉంటుంది. తద్వారా దిగుబడి కూడ ఎక్కువ వస్తుంది.
ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నులు పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ వేసుకోవాలి.
నీటి యాజమాన్యం: వర్షాధారంగా సాగుచేస్తే పంటకాలంలో 2-3 సార్లు నీటి తడులువ్వాలి.
అంతర కృషి: నేరుగా విత్తినప్పుడు 20-25 రోజుల తర్వాత మొక్కలు పలుచున చేయాలి. కలుపు తీయాలి.
సస్యరక్షణ: విత్తనపు కుళ్ళు, మొక్క మరియు ఆకు ఎండుతెగుళ్ళు రాకుండా ఉండేందుకు 3గ్రా. మాంకోజెబ్తో విత్తనశుద్ది చేయాలి. తెగులు ముఫ్పైరోజుల వయస్సులో లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్ కలిపి పిచికారి చేయాలి. తెగులు నివారణ కాకపోతే 7 నుండి 10 రోజుల తరువాత మరొకసారి పిచికారి చేయాలి.
కోత: జనవరి నుండి మార్చిలో కోతకు వస్తుంది. పంటకాలం 150-170 రోజులు, దిగుబడి ఎకరాకు 200-300 కిలోల ఎండు పేర్లు మరియు 30 కిలోల విత్తనం వస్తుంది.
ఆదాయ వ్యయాలు: ఎకరాకు 10,000 ఖర్చు, రూ.30,000–45,000 మొత్తం ఆదాయం, తద్వారా రూ. 20,000-35,000 నికరాదాయం వస్తుంది.
ఉపయోగాలు:
- ఆశ్వగంధను అన్ని వయస్సుల వారికి బలము కలిగించు మూలికగా వాడతారు. దీనిని ఇండియన్ జినింగ్ అని కూడా పిలుస్తారు.
- సైనికులలో శారీరక, మానసిక శక్తిని పెంపోందించడానికి వాడతారు.
- ఆటలు ఆడి అలసి పోయేవారికి స్పోర్ట్సు మెడిసిన్ గా వాడతారు. సముద్రమట్టానికి అనేక మీటర్లు ఎత్తులో ఉండే ప్రదేశాలలోను మంచుతో కూడుకున్న ప్రదేశాలలోను ప్రాణవాయువు తక్కువగా నుండి, అగ్నిమాంద్యం, ఆలోచనాశక్తి మందగిస్తాయి. ఈ సందర్భాలలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది.
Also Read: Benefits of Safflower Farming: కుసుమ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో