పశుపోషణమన వ్యవసాయం

Anthrax disease in cattle: పశువుల లో వచ్చే దొమ్మరోగం మరియు దాని నివారణ చర్యలు

0

Anthrax disease ఈ వ్యాధి పశువులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, మనుషులలో బాసిల్లస్ ఆంథ్రాక్స్” అను బ్యాక్టీరియా ద్వారా కలుగు అతి తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధిలో పశువులు ఉన్నట్టుండి చనిపోయి, ముక్కు నుండి, పాయువు నుండి గడ్డకట్టని తారు (నల్లని) లాంటి రక్తం కారుతూ వుంటుంది. ఇది ఒక జునోటిక్ వ్యాధి. కావున మనుషులలో కూడా వస్తుంది.

వ్యాధి కారకం:- ఇది “బాసిల్లస్ ఆంథ్రాక్స్” అను గ్రామ్ .ve బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఇవి “రాడ్”(బాసిల్లస్) ఆకారంలో వుండి చిన్న చిన్న  గొలుసు వలె వుంటాయి. వీటి కణకవచం చుట్టు క్యాప్సూల్ వుంటుంది. వీటికి సిద్ధబీజాలను ఉత్పత్తి చేసే శక్తి వుండును. వీటి పెరుగుదలకు ఆక్సిజన్ మరియు గాలి చాలా అవసరం. వీటిని గ్రామ్ స్టెయిన్, స్పోర్ స్టెయిన్ను చేసి చూడవచ్చు. ఈ బ్యాక్టీరియాలు శరీరంలో వెజిటెటివ్ రూపంలో ఉండి శరీరం బయట సిద్ధబీజ రూపంలో చాలా సంవత్సరముల వరకు జీవించి ఉంటాయి.

లక్షణాలు:- లక్షణాలు 2 రకాలు కలవు. అవి

Close-up of a pair of Cows looking at the camera, the background is grass.

అతి తీవ్రమైన :- పశువులు ఎటువంటి వ్యాధి సంబంధిత లక్షణాలు చూపించకుండానే మరణిస్తాయి.

తీవ్రమైన :- ఆకలి మందగిస్తుంది. పశువు నీరసంగా వుంటుంది. శరీర కండరాలు వణుకుతూ వుంటాయి. ఛాతి, మెడ, ఉదరము ప్రక్క భాగాలలో చర్మం క్రింద నీరుచేరి వుంటుంది. చూడి పశువులలో గర్భస్రావము జరుగుతుంది. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు వుంటాయి.

వ్యాధి కారక చిహ్నములు:- శరీర అవయవాల అన్నింటిలోను రక్తస్రావము మరియు ఎడిమా వుంటుంది. ప్లీహము 3-4 రెట్లు పరిమాణం పెరిగి వుంటుంది. లింఫ్ గ్రంథులు అన్నీ వాచి, నీరు చేరి రక్తస్రావము కలిగి 3 వుంటుంది.

గమనిక :- గడ్డకట్టని రక్తం, ప్లీహము సైజు పెరిగి వుండటం, కండరాలు బిగుసుకుపోలేకపోవడం (రిగ్గర్ మార్టిన్ లేకపోవడం) ఈ వ్యాధి ప్రత్యేకత.

వ్యాధి నిర్ధారణ :- (1) వ్యాధి చరిత్ర ఆధారంగా (2) ఆకలి మందగించడం, పశువు నీరసంగా ఉండటం, శరీర కండరాలు వణుకుతూ ఉండటం, ఛాతి, మెడ, ఉదరము, ప్రక్కభాగాలలో చర్మం క్రింద నీరు చేరి ఉండటం, చూడి పశువులలో గర్భస్రావము, ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు మొదలయిన వ్యాధి లక్షణాల ద్వారా (3) శరీర అవయవాల అన్నింటిలోను రక్తస్రావము మరియు ఎడిమా ఉండుట, ప్లీహము 3-4 రెట్లు పరిమాణం పెరిగి ఉండుట, లింఫ్ గ్రంథులలో నీరు చేరి, రక్తస్రావాలను కలిగి ఉండుట మొదలయిన వ్యాధి కారక చిహ్నముల ద్వారా (4) ప్రయోగశాలలో పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తాము. రక్త లేదా ఎడిమా ఫ్లూయిడ్ స్మీయర్ను జీమ్సా స్టెయిన్ చేసి, ఈ వ్యాధి కారకమును సూక్ష్మదర్శినిలో గమనించవచ్చును.

చికిత్స :- (1) ఈ వ్యాధి తక్కువ సమయంలో అకస్మికంగా కలిగి, చికిత్స చేయడానికి సమయం లేకుండా చనిపోతాయి. (2) పశువు చికిత్సకు అనుకూలంగా వుంటే ఈ క్రింది ఔషదములను ఇవ్వవచ్చు.

  1. Oxytetracyclin- 7-15mg/kg.bw-I/m, I/v–5-7days Daily
Leave Your Comments

Minister Niranjan Reddy: ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు.!

Previous article

CHEMICAL AND ORGANICE FERTILIZERS: సేంద్రియ మరియు రసాయన ఎరువులను సమర్ధ వంతం గా ఉపయోగించడానికి రైతులకు సూచనలు

Next article

You may also like