పశుపోషణమన వ్యవసాయం

Poultry Feeding: కోళ్ళ మేతలోని పోషక పదార్థాల ఉపయోగాలు.!

1
Poultry Feeding
Poultry Feeding

Poultry Feeding: కోళ్ళ పెంపకములో కోళ్ళ యొక్క మేపు ఒక భాగం. కోళ్ళ పెంపకములో కోళ్ళ దాణా యొక్క ఖర్చు 70 శాతం ఉండును. నీరు ప్రతి జీవికి జీవించటానికి మరియు ఇతర జీవన ప్రక్రియలకు అత్యవసరం.

Poultry Feeding

Poultry Feeding

Also Read: Poultry farming: కడక్ నాథ్, అసిల్, బస జాతి కోళ్ల లక్షణాలు మరియు ఉపయోగాలు

నీరు: గినంత అందించకపోతో అవి మరణించును, కోళ్ళ శరీరంలో 55% – 75% నీరు, 20% ప్రోటిన్స్.. 5% మినరల్సవ ఎండును. ఈ నీటి అంశం కోళ్ళ యొక్క అంశం, వయస్సు, సెక్స్ మీద ఆధారపడి వుంటుంది. కనుక కోళ్ళకుని రంతరంగా నీరు అత్యవసరం. ఒక కోడి రోజుకు 250 మి.లీ. నీరు త్రాగుతుంది.

ఖనిజ లవణాలు: కోళ్ళ శరీరం మరియు గుడ్లు చాలా శాతం ఖనిజ లవణాలతో తయారై వుండును వీటిలో కోడి శరీరం 4% ఖనిజ లవణాలను మరియు కోడిగుడ్డు 1% ఖనిజ లవణాలను కలిగి వుండును. ఖనిజ లవణాలు కోళ్ళ పెరుగుదలకు, గుడ్ల ఉత్పత్తికి, చిన్న మోతాదులో అత్యవసరం ముఖ్యంగా కోళ్ళకు కాల్షియం. ఫాస్ఫరస్, సోడియం, పోటాషియం, మెగ్నీషియం, అయోడిన్, ఐరన్, కాపర్, మాంగనీస్, మాలిబ్డినమ్, జింక్, సిలినియం, క్లోరిన్, సల్ఫర్, మున్నగునవి కోళ్ళ పెరుగుదలకు మరియు గుడ్ల ఉత్పాదనకు అత్యవసరం.

పై కనబరచిన ఖనిజ లవణాలు కోళ్ళకు సప్లిమెంట్స్ ద్వారా మేపులో కలిపి వాడెదరు. అవి ఏమనగా లైమ్ స్టోన్. బోన్మీల్, సోడియం క్లోరైడ్, డై కాల్షియం ఫాస్ఫేట్, పొటాషియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్. పై చెప్పిన ఖనిజ లవణాలు కోళ్ళ మేపులో లోపించిన క్రింది అనర్థాలు సంభవించును.

కాల్షియం

ఉపయోగాలు:

కాల్షియం అనునది ఎముకలు నిర్మాణానికి మరియు గుడ్డు యొక్క పెంకు నిర్మాణానికి తోడ్పడును.
రక్తం గడ్డ కట్టుటకు తోడ్పడును.
గుండె యొక్క రిథమ్ సరిగ్గా కొట్టుకొనుటకు సహాయపడును.

లోపాలు:
పెరుగుదల తగ్గును.
2 గుడ్ల ఉత్పాదన తగ్గును.
పలుచని పొర కల్గి యుండును
4 సాఫ్ట్ బోన్స్ ( పలుచని ఎముకలు) ఏర్పడును.
పొదిగే తత్వం తగ్గును.

ఫాస్ఫరస్:

ఉపయోగాలు:

ఫాస్పరస్ అనునది గ్రుడ్ల ఉత్పాదనకు తోడ్పడును.
ఎముకలు నిర్మాణానికి తోడ్పడును.
పిండి పదార్థాల ఉపయోగంకు ఫాస్ఫరస్ సహకరించును.

లోపాలు:

పెరుగుదల తగ్గును.
బలహీనమైన ఎముకలు తయారుగును.
ఫలదీకరణ తత్వం తగ్గును.

మాంగనీస్:

ఉపయోగాలు:

ఎముకల నిర్మాణానికి తోడ్పడును.
గుడ్లు పొదుగుటకు తోడ్పడును.
ఫాస్ఫరస్ ఉపయోగంనకు మాంగనీస్ సహకరించును. I

లోపాలు:

పెరోసెస్ కల్గును.
పలుచని పొర ఏర్పడును.
గుడ్లు పెట్టే వాటిలో గ్రుడ్ల ఉత్పాదన తగ్గును.
పొదిగే సామర్ధ్యం తగ్గును.
పిండాభివృద్ధి సరిగ్గా అభివృద్ధి జరగదు.

మాంగనీస్:

ఉపయోగాలు:
ఎముకల నిర్మాణానికి తోడ్పడును.
గుడ్లు పొదుగుటకు తోడ్పడును.
ఫాస్ఫరస్ ఉపయోగంనకు మాంగనీస్ సహకరించును.

లోపాలు:

పెరోసిస్ కల్గును.
పలుచని పొర ఏర్పడును.
గుడ్లు పెట్టే వాటిలో గ్రుడ్ల ఉత్పాదన తగ్గును.
పొదిగే సామర్ధ్యం తగ్గును
పిండాభివృద్ధి సరిగ్గా అభివృద్ధి జరగదు.

Also Read: Poultry Farming: కోడి పిల్లల పెంపకం లో మెళుకువలు

Leave Your Comments

Identification of Animals: ఆవులను, గేదెలను గుర్తించు వివిధ పద్దతులు.!

Previous article

Weed Management: మినుము,పెసర పంటలలో సమగ్ర కలుపు యాజమాన్యం.!

Next article

You may also like