Backyard Poultry Farming: ఇటీవల కాలంలో సాంప్రదాయ పంటలతో విసిగి పోయిన రైతులు అనుబంద రంగాల వైపు మళ్లిస్తున్నారు. ఈనేపద్యంలో గ్రామీణ రైతులు, నిరుద్యోగులు, మహిళలు పెరటి కోళ్ళ పెంపకం పై మక్కువ చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా ఉండటంతో ఆదిశగా అనుబంద రైతులు ఆలోచన చేస్తున్నారు. కొంచెం స్ధలం, ఉంటే చాలు పెరటి కోళ్ళ పెంపకంను లాభసాటి అదాయ వనరుగా మార్చుకోవచ్చు. అయితే ఇందుకోసం మేలు జాతి కోళ్ళను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
పెరటి కోళ్ళ పెంపకం చేయాలనుకునే వారు ముందుగా ఏజాతి కోళ్ళను పెంచుకోవాలో నిర్ణయించుకోవాలి. మేలు జాతి కోళ్ళలో వనరాజా, గిరిరాజా, స్వర్ణధార, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, కడక్ నాధ్ వంటి రకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి మాంసం గ్రుడ్లుకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రమాదకరమైన వ్యాధులను సైతం ఈ కోళ్లు తట్టుకుంటాయి.
వనరాజా కోళ్ళు వీటిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ వారు రూపొందించారు. పెరట్లో పెంపకానికి అనువైన రకంగా చెప్పవచ్చు. అధిక సంఖ్యలో గ్రుడ్లు, మాంసాన్నిస్తాయి. రోగనిరోధక శక్తిని ఎక్కువగా తట్టుకుంటాయి. 10 నుండి 12 వారాల వయస్సులోనే పుంజులు మంచి బరువుకు వస్తాయి. 5నెలల వయసుకు 2.5కిలోల బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని ఇస్తాయి.
Also Read: వానకాలంలో గొర్రెల సంరక్షణ.!
గిరిరాజా కోళ్ళు ఈజాతి కోళ్ళను బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. 3కిలోల నుండి 5 కిలోల బరువు పెరుగుతాయి. ప్రతి ఏటా 140 నుండి 170 గ్రుడ్ల వరకు పెడతాయి. దేశీయ కోళ్ళ కన్నా రెండు రెట్లు అధిక బరువును కలిగి ఉంటాయి. 2 నెలల్లోనే ఏకంగా 3 కేజిలకు పైగా ఈ కోడి బరువు పెరుగుతుంది.
రాజశ్రీ కోళ్ళు ఈజాతి కోళ్ళను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు. దీనికి కూడా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 8 వారాల వయస్సులోనే 500 గ్రాముల బరువు పెరుగుతాయి. ఇరవై వారాల వ్యవధిలో 1.50 కిలోలకు పైగా బరువు ఉంటాయి. 160 రోజుల వ్యవధిలోనే గ్రుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. ఈకోళ్లకు ఇంక్యుబేటర్ సహాయంతో గ్రుడ్లను పొదిగించుకోవాల్సి ఉంటుంది. శ్రీనిధి కోళ్ళు ఈజాతికోళ్ళు గోధుమ రంగు వర్ణాన్ని కలిగి ఉంటాయి.
నాటుకోడి గ్రుడ్లకు సమానంగా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఏడాదికి 140 నుండి 160 గ్రుడ్లను పెడతాయి. కడక్ నాథ్ కోళ్ళు మధ్యప్రదేశ్ లో పుట్టిన ఈకలమాశి కోడిని కడకనాథ్ గా పిలుస్తారు. మాంసం నల్లగా ఉంటుంది. నాటుకోడితో పోలిస్తే కడక్ నాథ్ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఆరుమాసాల వయస్సు నుండే గ్రుడ్లు పెట్టటం ప్రారంభిస్తుంది. గ్రుడ్లకు, మాంసానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
గ్రామప్రియ కోళ్ళు అన్ని వాతావరణాల్లో ఈకోళ్ళు పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామప్రియ కోళ్ళు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. గ్రుడ్లు గోధుమ వర్ణన్ని కలిగి ఉంటాయి. ఆరునెలల వయస్సు నాటికి రెండున్నర కేజీల బరువు పెరుగుతుంది. సంవత్సన్నర కాలంలో 250 గ్రుడ్లు పెడుతుంది. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవు. స్వర్ణధార కోళ్ళు అధిక శరీర బరువును కలిగి ఉంటాయి. సంవత్సరానికి 190 వరకు గ్రుడ్లను పెడతాయి.
గ్రుడ్ల ఉత్పత్తి కోసం ఎక్కవ స్వర్ణధార కోళ్ళను ఎంపిక చేసుకుంటారు. వీటిని పెంచాలనుకునే వారు అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపట్టాలి. వీటికి అనుకూలమైన వాతావరణంను కలిపించాలి వేడి లేకుండా షెడ్లను నిర్మించుకోవాలి. తగినంత దాణాతోపాటు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు ఇవ్వాలి. పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను సాధించటం సాధ్యమౌతుంది.
Also Read: పంటను తినేస్తున్ననులి పురుగులు.!