పశుపోషణ

American chickens Types and Characteristics: అమెరికన్ కోళ్ళ రకాలు మరియు వాటి లక్షణాలు.!

2
American chickens
American chickens

American chickens Types and Characteristics: వీటి చర్మం పసుపు రంగులో ఉంటుంది. వీటి చెవి తమ్మెలు ఎరుపు రంగులో ఉంటాయి. వీటి గుడ్ల పెంకు బ్రౌన్ రంగులో ఉంటాయి. వీటి పిక్కల దగ్గర ఈకలు ఉండవు.

ప్లైమౌత్క్ (PLYMOUTH ROCK): ఈ జాతి కోళ్ళ స్వస్థలం అమెరికా.ఈ జాతిలో 7 వెరైటీస్ కలవు
జాతి లక్షణాలు: ఈ జాతి కోళ్ళ శరీరం పొడవుగా మంచి గంభీరత కలిగి ఉంటుంది. ఈ జాతి కోళ్ళ ఈకలు, రెక్కలు గ్రేయిష్ వైట్ (greyish white) రంగులో ఉంటాయి . సింగిల్ కూంబ్ కలిగి ఉంటుంది.
ఉపయోగాలు (UTILITY): మంచి కండలతో ద్రుడముగా ఉంటాయి.మాంసపు కోళ్ళ పెంపకానికి పేరు గాంచినది. మంచి గ్రుడ్లు పెట్టు సామర్థ్యము కలిగి ఉంటాయి. గ్రుడ్లు పెంకు బ్రౌన్ రంగు కలిగి యుండును. పుంజు 4.5 కె.జీలు, పెట్ట 3.5 కే.జీల బరువు కలిగి ఉంటాయి.

రోడ్ ఐలాండ్ రెడ్ ( RHODE ISLAND RED): ఈ జాతి కోళ్ళు ఇంగ్లాండ్లోని రోడ్ ఐలాండ్ రెడ్ నందు మలై గమ్ (Malay game) మరియు లెగ్ హార్న్ (Iegion) మరియు ఎసియాటిక్ స్టాక్ (Asiatic stock) సంకరం వల్ల ఆవిర్భవించిoది.
జాతి లక్షణాలు: ఈ జాతి కోళ్ళ శరీరం పొడవుగా చతురస్రంగా ఉంటాయి.ఛాతి వెడల్పుగా లోతుగా ఉంటుంది. ఈ జాతి కోళ్ళ ఈకలు, రెక్కలు గోల్డెన్ బ్రౌన్ (golden brown) రంగులో ఉంటాయి. వీటి వీపు వెడల్పుగా సమముగా ఉంటుంది. ఈ జాతి కోళ్ళు లావుగా, ధ్రుడంగా కనిపిస్తాయి.శరీరపు రంగు రిచ్ బ్రౌన్ రంగులో ఉండును. వీటిలో సింగిల్ రోజ్ కూంబ్ రకం చాలా ప్రసిద్ధి చెందినది.కాళ్ళు పాదాలు ముదురు పసుపు రంగుతో ఉంటాయి.
ఉపయోగాలు (UTILITY): ఈ జాతి కోళ్ళు గ్రుడ్లు మరియు మాంస ఉత్పాదనకు పేరు గాంచినది. మాంసము రుచి యందు పేరు గాంచినది. పొదుగు గుణములు కలిగి ఉంది.ఇతర విదేశీ జాతుల కోళ్ళ కంటే ముంచి రోగ నిరోధక శక్తి కలిగి ఉంది.పుంజులు సగటున 3.8 కే.జీలు మరియు పెట్టలు సగటున 2.9 కేజీల బరువు కలిగియున్నవి.

Also Read: Infectious Anaemia in Chicken: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ అనిమియాను ఇలా నివారించండి.!

American chickens Types and Characteristics

న్యూహ్యంప్ షైర్ (NEW HAMPSHIRE): ఈ జాతి అమెరికా యందు న్యూహ్యంపైర్ ప్రదేశంలో అభివ్రుద్ధి పరచడమైoది. ఈ జాతి RIR కోళ్ళు నుండి అభివ్రుద్ధి పరచడమైoది.
జాతి లక్షణాలు: ఈ జాతి కోళ్ళ ఈకలు, రెక్కలు చెస్ట్నట్ రెడ్ (chest not red) రంగులో ఉంటాయి. సింగిల్ కూంబ్ ఉంటుంది.ఈ జాతి పెట్టలలో లోయర్ సెక్ పెథర్స్ ఉంటాయి. వీటి శరీరం RIR జాతి కోళ్ళ కంటే తక్కువ చతురస్రంగా ఉంటాయి.
ఉపయోగాలు (UTILITY): ఈ జాతి కోళ్ళు గ్రుడ్లు మరియు మాంస ఉత్పాదనకు ఉపయోగపడుతాయి.వీటి గుడ్ల పెంకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ జాతి కోళ్ళు త్వరగా పెరుగుతుంది. ఈకలు కూడా త్వరగా వస్తాయి.పుంజులు సగటున 3.8 కేజీలు మరియు పెట్టలు సగటున 2.7 కేజీల బరువు తూగుతుంది.

వైయిన్ట్ WYAN DOTE): ఈ జాతి అమెరికాకు చెందినది. ఈ జాతిలో Wllite, buff, silver laced, golden laced, partridge. silver penciled, Columbian, black varieties కలవు.
జాతి లక్షణాలు: ఈ జాతి కోళ్ళ శరీరం గుండ్రంగా మరియు పొట్టిగా ఉంటుంది. ఈ జాతి కోళ్ళ కూంబ్ రోజ్ కలర్లో మరియు వీటి వీపు పొట్టిగా ఉంటుంది. వీటి శరీరం పసుపు రంగులో ఉంటుంది.
ఉపయోగాలు (UTILITY): ఈ జాతి కోళ్ళు గ్రుడ్లకు మరియు మాంసమునకు ప్రసిద్ధి చెందినవి.

Also Read: Infectious Laryngotracheitis in Chickens: కోళ్ళలో ఇన్ఫెక్ష్యూయస్ లారింజియో ట్రెకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది

Leave Your Comments

Precautions to Prevent Diabetes: డయాబెటిస్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండిలా.!

Previous article

Grapes Hormonal Control: ద్రాక్షలో హార్మోన్లు ఎప్పుడు వాడాలి.!

Next article

You may also like