పశుపోషణమన వ్యవసాయం

Turkey Poultry Farming: టర్కీ కోళ్ళ పెంపకం లో పోషక యాజమాన్యం

3

Turkey Poultry Farming: భారతదేశంలో కోళ్ల పెంపకానికి టర్కీ ఆచరణీయమైన ప్రత్యామ్నాయం… టర్కీలను వాణిజ్యపరంగా గుడ్డు మరియు మాంసం ఉత్పత్తికి ఉపయోగించవచ్చు అలాగే ఇంట్లో పెంపుడు జంతువులుగా ఉంచుకోవచ్చు.

Turkey Poultry Farming

Turkey Poultry Farming

దాణా:

దాణా రెండురకాలుగా ఇవ్వవచ్చు. ఒకటి: దంచి ఇవ్వడం, రెండు: గుళికల రూపంలో ఇవ్వడం

  •  దేశవాళీ కోడిపిల్లలతో పోల్చిచూస్తే, టర్కీలకు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజలవణాలు, శక్తిని ఇచ్చే పదార్ధాలు మరింతగా అవసరమవుతాయి
  • శక్తిని ఇచ్చే పదార్ధాలు, మాంసకృత్తులు అవసరమయ్యే పరిమాణం పుంజుకు ఒకరకంగా, పెట్టకు మరొక రకంగా వుంటుంది; అందువల్ల, వాటిని వేరువేరుగా పెంచితే మంచి ఫలితాలు సాధించవచ్చు
  •  దాణా పాత్రలోనే దాణాను వేయాలి; నేలమీద వేయకూడదు
Turkey Chicks Farming

Turkey Chicks Farming

  • ఒకరకమైన దాణాకు బదులు మరొక రకమైన దాణాఇవ్వవలసివస్తే, ఆ మార్పు క్రమేణా జరగాలి
  •  టర్కీలకు శుభ్రమైన నీరు తెంపులేకుండా ఎప్పుడూ అందుబాటులో వుంచాలి
  •  ఎండాకాలంలో మరిన్ని నీటిపాత్రలు పెట్టాలి
  • ఎండాకాలంలో పగటిపూట ఎండ తక్కువగావుండే వేళలలో దాణా మేపాలి
  • కాళ్లు చచ్చుబడిపోకుండా, ఒక్కొక్క టర్కీకి రోజుకు 30 – 40 గ్రాముల వంతున ఆల్చిప్పల పొడిని వేయాలి

Also Read: కోళ్ల పరిశ్రమ లో ఉండవలసిన వసతులు

మొక్కలు,గడ్డి మేపడం

షెడ్లలో పెంచే పద్ధతిలో, టర్కీకి మొత్తం దాణాలో 50 % మొక్కలను, ఆకులను దంచి ఇవ్వవచ్చు. ఏ వయసులో టర్కీకైనా, తాజా జనుము మొక్క మంచి బలవర్ధక ఆహారం.

Turkey Chicks

Turkey Chicks

ఇంతేకాకుండా స్టైలో గడ్డిని, దేశ్‌మంతస్ మొక్కనుకూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపి దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు.

Also Read: కోడి పిల్లల సంరక్షణ విధానం

Leave Your Comments

Drip Irrigation in Sugarcane: బిందుసేద్యం చెరకు రైతుకి వరం

Previous article

Sheep Farming: ఆడ గొర్రెల ఎంపిక విషయం లో తీయాల్సిన జాగ్రత్తలు

Next article

You may also like