పశుపోషణ

Trypanosomiasis in Cow: ఆవులలో ట్రిప్ నోసోమియాసిస్ వ్యాధి ఎలా వస్తుంది

1
Trypanosomiasis in Cow
Trypanosomiasis in Cow

Trypanosomiasis in Cow:  ఈ వ్యాధి ట్రిప్నోసోమా ఇవాన్ని అను ఏకకణ పరాన్నజీవి వలన ఒంటెలు, గుర్రాలు మరియు ఆవులు, ఎద్దులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కుక్కలలో కూడా కలుగు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. దీనిని సర్రా/తిక్క రోగం/ కుందేటి వెర్రి అని కూడా అంటారు. ఈ వ్యాధిలో ప్రధానంగా తీవ్రమైన జ్వరం, రక్తహీనత, కండరాల బలహీనత, చర్మపు లీజన్స్ ఉంటాయి.

ట్రిప్నోసోమా ఇవాన్సి (Trypanosoma evansi) రక్తంలో జీవించే ఒక ప్రోటోజోవ పరాన్నజీవి. ఇది దారపు ఉండ ఆకారంలో ఉండి తల మీద కొరడ లాంటి ఉపాంగముతో చలిస్తూ ఉంటుంది. ట్రిపనోసోమా జాతులలో చాలా రకాలు కలవు. అవి టి. బ్రూసి, టి. ఇక్విపారడమ్, టి. కాంగోలెన్సి మొ. రకాలు కలదు.ఈ వ్యాధి ప్రధానంగా ఒంటెలు మరియు గుర్రాలలో అధికంగా కలుగుతుంది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కుక్కలలో కూడా ఈ వ్యాధి ప్రాణాంతకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏనుగులు, గాడిదలు, పిల్లులతో పాటు ఎలుకలు, కుందేళ్ళలో కూడా ఈ వ్యాధి కలుగుతుంది. వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్ని వయస్సుల పశువులలో ఈ వ్యాధి కలుగుతుంది.

వ్యాధి వచ్చు మార్గం:- ఈ వ్యాధి ఎక్కువగా రక్తం పీల్చే ఈగలైన టబానస్ (Tabanus), స్టొమాక్సిస్: (Stomaxys) అనే ఈగలు వ్యాధి గ్రస్థ పశువులను కుట్టి, తిరిగి ఆరోగ్యంగా వున్న పశువులను కుట్టినపుడు ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.

వ్యాధి వ్యాప్తి: ఈ పరాన్నజీవులు స్టామాక్సిస్ మరియు టబాస్ అనే జోరిగల ద్వారా వ్యాధి సోకిన జంతువుల నుండి ఆరోగ్యంగా వున్న జంతువుల రక్తంలోకి ప్రవేశించి రక్తం లోపల అభివృద్ధి చెందుతుంది. ఎర్ర రక్త కణాలు అధికంగా విచ్చిన్నం అగుట వలన రక్తహీనత ఉంటుంది. ఈ వ్యాధి కారక క్రిమి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. మెదడులోకి వెళ్లి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కంటిలోని తెలగుడ్డును పింక్ రంగుగా లేదా ఎరుపు రంగు మారుస్తుంది. కాలేయం లోకి వెళ్ళి గ్లూకోజ్ శాతoను తగ్గిస్తుంది. ఫలితంగా మెదడుకు గ్లూకోజ్ తగ్గుట వలన కండరాలు వణుకు, శరీర బరువు తగ్గుట ప్రధానంగా ఉంటుంది. రక్తంలో లాక్టేట్ శాతం పెరుగుట వలన ఊపిరితిత్తుల సమస్యలుంటాయి.

Also Read: Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo

Trypanosomiasis in Cow

Trypanosomiasis in Cow

లక్షణములు: అధిక జ్వరం (103 105°F) ఉండి, ఆకలి నశించి, పశువులు నీరసంగా ఉంటాయి. తీవ్ర ఉద్రిక్తతతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. నోటి నుండి చొంగ కారడం, పళ్ళు నమలడం, మూర్ఛతో వణకడం వంటి లక్షణాలు ఉంటాయి. పశువులు అటూ ఇటూ తిరుగుతూ తలను గట్టి వస్తువులకు కొట్టుకుంటూ తరము కిందపడుతూ ఉంటాయి.

ఈ లక్షణాలు కనిపిస్తూ, తగ్గిపోతూ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. రక్తహీనత ఉండి కంటిపొర పాలిపోయి ఉంటుంది. కంటి నుండి చిక్కటి శ్లేష్మహిత మరియు చీము కలిసిన ద్రవాలు ఏర్పడి, చివరకు కంటిలో పూత వచ్చి కళ్ళు కనబడకుండా పోతాయి. పాలు ఇచ్చు పశువులలో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. శరీరంలోని పెద్ద పెద్ద కండరాలను బాగా గమనించినట్లైతే అవి వణుకుతుండుటను (ట్రిమర్స్) గమనించవచ్చు.

పశువు బక్క చిక్కిపోయి ఉంటుంది. శరీరంలో నీరు చేరి ఉంటుంది. కొన్ని సందర్భాలలో పశువులలో జాండీస్ లక్షణాలు కూడా గమనించవచ్చు.రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, వ్యాధి లక్షణాలు ఆధారంగా, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ద్వారా, రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గి ఉండుటను గమనించవచ్చు. వ్యాధి కారక క్రిములను రక్త స్మీయర్లో వెట్ ఫీల్మ్ లేదా స్టెయిన్ ద్వారా కాని చూడవచ్చు.

చికిత్స:- Bernil ( Diaminizine aceturate) కె.లో. బరువుకు 8-16 mg చొప్పున 1/m మార్గం ద్వారా ఒక మోతాదును ఇచ్చినట్లైతే ఈ వ్యాధి కారకాన్ని పూర్తిగా నిర్మూలించవ చ్చు.Quinapyranine chloride and sulphate (T evansi) ఔషధమును కి.లో. బరువుకు 5-8mg – చొప్పున S/C మార్గం ద్వారా ఇచ్చినట్లైతే ఈ వ్యాధికి చికిత్సతో పాటు, ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చు.

అంటి పైరెటిక్ ఔషధములను జ్వరం తగ్గించుటకు, అంటి ఇన్ ఫ్లమేటరీ ఔషధాలను శోధమును తగ్గించుటకు ఇవ్వాలి.పశువుల యొక్క స్థితిని బట్టి సెలైన్ ద్రావణములు డి 20, డి 50, అంటోజ్ వంటి ద్రావణములను, విటమిన్స్ మరియు మినరల్స్ వంటి ఇంజక్షన్స్ ఇవ్వాలి.పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు మల మూత్రములను తీసి వేయాలి. దోమలు మరియు ఈగలు రాకుండా నివారించాలి. టి. ఇవాన్ వంటి ఔషదములు వ్యాధి రాకుండా ముందే ఇచ్చినట్లైతే ఈ వ్యాధి 3 నెలల వరకు రాకుండా నివారించవచ్చు.

Also Read: Different Types Tractors: వివిధ రకముల ట్రాక్టర్లు

Leave Your Comments

Mango Ripening: మామిడికాయలు మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడకం అనర్ధo

Previous article

Paddy Crop Protection: వరి పంటలో వచ్చే వివిధ రకాల దోమ రోగాలు మరియు వాటి నివారణ చర్యలు

Next article

You may also like