Punganur Cow: భారతదేశం ఆవులకి చాలా ప్రత్యేకమైన దేశం. ఇక్కడి ప్రజలు ఆవులని గోమాతగా పూజిస్తారు. ఆవులో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికి వరకు మనం చాలా ఆవులని చూసి ఉంటాము. పుంగనూరు జాతి ఆవులు ఈ మధ్య కాలంలో చాలా ప్రత్యేక స్తానని సంపాదించుకున్నాయి. ఈ ఆవుల ప్రత్యేకల వల్ల చాలా మంది రైతులు పుంగనూరు ఆవులని పెంచుతున్నారు. ఈ ఆవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రలో ఎక్కువగా పెంచుతున్నారు.
పుంగనూరు ఆవులు చాలా తక్కువ ఎత్తు పేరుతాయి. ఈ ఆవులు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే పేరుతాయి. అందువల్ల ఈ ఆవులు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఆవు పాలు అని ఆవుల పాల కంటే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి.
Also Read: Low Cost Farm Shed: పొలంలో షెడ్ తక్కువ ఖర్చుతో ఎలా ఏర్పాటు చేసుకోవాలి..
ఈ ఆవులు తిన్న ఆహారం జీర్ణించుకోవడానికి చాలా సమయం పడుతుంది. తిన్న ఆహారంలో ఉన్న పోషక విలువలు మొత్తం శరీరంలోకి తీసుకుంటాయి. శరీరం నుంచి ఆ పోషక విలువలు అని పాలలోకి పంపిస్తాయి. అందువల్ల ఈ జాతి ఆవుల పాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.
తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడాని ఇంటస్టిన్ ట్రాన్సిట్ డ్రైవ్ అంటారు. ఇంటస్టిన్ ట్రాన్సిట్ డ్రైవ్ ఉన్న ఆవులు ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉంటాయి. వీటి పాలు తాగడం వల్ల కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. దాని వల్ల ఈ ఆవులని రైతులు పెంచడానికి ఇష్టపడుతున్నారు.
Also Read: Rambutan Fruit: మృదువైన ముళ్ళతో కనిపించే పండు రాంభూటన్.!