పశుపోషణమన వ్యవసాయం

Broilers Importance: మాంసపు కోళ్ళ యొక్క ఆవశ్యకత.!

1
Broilers Importance
Broilers Importance

Broilers Importance: 1993 సంవత్సరం ఈ విషయం పై నేషనల్ కమీషన్ ఆన్ అగ్రికల్చర్ వారు నీటి ఆవశ్యకత పై వివిధ కోణాలలో పరీక్షించి కోడి మాంసం 1985 లో 1,50,000 టన్ల ఉత్పత్తి అయినది. అది 2000A.D. నాటికి 3 లక్షల టన్నుల అవసరమని వారి నివేధికలో కనబర చారు.

Broilers Importance

Broilers Importance

Also Read: Broiler Chicken: బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో తీస్కోవాల్సిన యజమాన్య చర్యలు

బ్రాయిలర్ మాంస ఉత్పత్తిలో 1985 నాటికి సుమారుగా 17.2 మిలియన్ల ఉత్పత్తి అయినది అని 2000 నాటికి 71.5 మిలియన్లు ఉత్పత్తి అవసరమని నివేధిక కనబరిచారు. అయితే మన దేశంలో మాంసపు కోళ్ళ జాతులను అభివృద్ధి చేసినట్లయితే విదేశాల నుండి ఈ జాతులను దిగుమతి చేయుట నివారించవచ్చు. వీటి నుండి మన దేశపు ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచవచ్చు.

బ్రాయిలర్ అంటే ఏమిటి ?

బ్రాయిలర్ను ప్రియర్ అని కూడా పిలిచేవారు. బ్రాయిలర్ కోడి అనగా 8-10 వారాల లోపల వున్న ఆడ మరియు మగ జాతి చిన్న కోడి పిల్లలు. ఇవి నిర్ణీత కాలంలో 1.5 2.0 kg బరువు తూగును. వీటి యొక్క మాంసపు గుణము మృదువుగాను మరియు వివిధ శరీరపు భాగములు కురువుగాను మరియు ఎద భాగం వంచుటకు వీలుగా ఉంటుంది.

మాంసపు కోళ్ళ జాతులు వాటి ఉత్పాదన పద్ధతులు

మాంసపు కోళ్ళ యొక్క తల్లిదండ్రులు 8 వారాల వయస్సులోనే ఎంపిక చేయవలెను. ఈ పెంపకంలో తల్లిదండ్రులు ఎక్కువ బరువు కల్గి వుండి వాటిని బ్రాయిలర్ సంతానోత్పత్తికి ఎంపిక చేస్తారు.

బ్రాయిలర్ సంతానోత్పత్తిలో అడగోళ్ళ ఎంపిక

  • ఆడ కోళ్ళను వైట్రిక్ గుణములు గల వాటి నుండి లేదా వాటి జాతికే చెందిన ఇతర ప్రజాతి గుణములు కల్గిన వాటి నుండి ఎంపిక చేసి ఉత్పత్తి చేయడం అయినది.
  • ఈ ఆడ కోళ్ళకు త్వరితంగా పెరుగుదల గల శక్తి వుండవలెను మరియు సామాన్య పరిమాణంలో గ్రుడ్లను పెట్టుగల గుణములు కలిగి వుండాలి..
  • వాటి యొక్క గ్రుడ్లు ఆశించినంత ఆకారం మరియు రూప నిర్మాణ శైలి కలిగి వుండాలి.

బ్రాయిలర్ మగ కోళ్ళ ఎంపిక

  • ఈ బ్రాయిలర్ల తండ్రి గుణములు తెల్లటి తుకల్ని కలిగి వుండాలి.
  • త్వరితగతి వున్న శక్తి కలిగి వుండాలి మరియు మాంసపు గుణములలో శరీరం యొక్క భాగాలు బాగా పొడవు, వెడల్పు కలిగి వుండవలెను మరియు ఎక్కువ మాంసం ఇచ్చు శక్తి కలిగి వుండాలి.
  • ఈ మాంసపు కోళ్ళ అభివృద్ధి కార్యక్రమాలలో ఆ కోళ్ళ యొక్క వంశపు పరిశోధన మరియు కుటుంబం యొక్క ఎంపిక చాలా అవసరం.ఈ ఎంపిక చేసిన వాటి నుండి ఉత్పత్తి అయిన కోడి పిల్లలు ఆధునిక తెలుపు పాదములు పసుపు రంగుతోను తల్లిదండ్రుల కంటే అతి త్వరగా పెరుగు శక్తి కలిగి వుండును మరియు వాటి మాంసం మృధువుగాను, రుచిగాను ఉంటుంది.

Also Read: Broiler Chicken Farming: బ్రాయిలర్ కోళ్లని పెంచుతున్నారా…? అయితే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి.!

Leave Your Comments

Vana Mahotsavam: వన మహోత్సవం ఎలా జరుపుతారు.!

Previous article

PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!

Next article

You may also like