Milk Production: రైతులు ఆవులు, గేదెలు పెంచడం ఈ మధ్య కాలంలో చాలా తగ్గించారు. పాల వినియోగం చాలా వరకు పెరిగింది కానీ పాల ఉత్పత్తి రోజు రోజుకి తగ్గుతుంది. వ్యవసాయం భూములని రియల్ ఎస్టేట్ పేరుతో అమ్ముకొని ఇల్లు, లేదా ఇతర వ్యాపారాల కోసం వాడుకుంటున్నాము. దీని వల్ల వ్యవసాయ భూమి తగ్గిపోయి, పశు సంపదను కూడా తగ్గించారు. మహబూబ్ నగర్ జిల్లాలో , గొల్లపల్లి గ్రామంలో శివలింగం గారు ముర్రాహ్ జాతి గేదెలని పెంచుతున్నారు.
గతంలో ఈ రైతు దాధాపు ముర్రాహ్ జాతి గేదెలు 70 వరకు పెంచేవారు. ఈ గేదెలు ఎక్కువగా దేవరకద్ర పశువుల సంతలో రైతులు అమ్ముతారు. గత సంవత్సరం దేవరకద్ర పశువుల సంతలో నుంచి శివలింగం గారు రెండు ముర్రాహ్ జాతి గేదెలను కొనుగోలు చేసి పెంచుతున్నారు. ఒక ముర్రాహ్ జాతి గేదెకి 75 నుంచి 80 వేల రూపాయల ఖర్చు అవుతుంది.
Also Read: Punganur Cow: ఈ కొత్త రకం ఆవుల పాలలో ఎక్కువ పోషక విలువలు..
ఈ గేదెలు ప్రతి రోజు 8 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఒక లీటర్ పాలు 80 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కేవలం 4 గేదెలు మాత్రమే ఉన్నాయి. పశువులని చూసుకోవడానికి కూలీలు ఎవరు లేకపోవడంతో , పశువుల సంఖ్య తగ్గించారు. పశువులు పెంచడంలో మంచి ఆదాయం ఉన్న కూడా వాటిని చూసుకోవడానికి సరైన సమయం, కూలీలు లేకపోవడం ముఖ్య కారణం.
ఈ గేదెలకి కేవలం గడ్డి మాత్రమే ఇస్తున్నారు. ఎలాంటి ధాన , ఇతర ఆహారాలు ఇవ్వడం లేదు. వీటి నుంచి ప్రతి నెల 15 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ గేదెల నుంచి ఇంటి ఖర్చుల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు ఈ రైతులు. పాల వినియోగం ఎక్కువ ఉన్న వాటిని పోషించే వాళ్ళు లేకపోవడం వల్ల పాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది.
Also Read: Low Cost Farm Shed: పొలంలో షెడ్ తక్కువ ఖర్చుతో ఎలా ఏర్పాటు చేసుకోవాలి..