Animal Husbandry Techniques: జీవాల కొట్టాలను చాలా వెలుతురు, గాలి ఉండే ప్రదేశాలలో కట్టించుకోవాలి. కొట్టాల పొడవున తూర్పు పడమర దిశలో నిర్మించుకోవాలి. కొట్టాల బయట కొంచెం ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. కొట్టాల్లో దాణా, నీటి తోట్లను నిర్మించుకోవాలి. కొట్టాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి. జీవాలను కొట్టాల నుండి పశు గ్రాసం మేయటానికి తీసుకోని వెళ్లిన వెంటనే ఊడ్చేసి ఆ ఎరువును ఒక నిర్ధిష్ట ప్రదేశంలో కొట్టానికి దూరంగా ఎప్పుడు ఒకే చోట వేయాలి.
జీవాల ఎంపిక:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కావున మాంసాహారంను ఉత్పత్తి చేసే జీవాల జాతులను ఎంపిక చేసుకోవాలి. దక్కని, బళ్లారి, చుడి కట్టిన 2 సంవత్సరాల లోపు ఉండే జీవాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అలాగే జాతి లక్షణాలు ఉండే జీవాలను ఎంపిక చేసుకోవాలి. జీవాలు దృఢంగా, ఆరోగ్యం గా, అంటువ్యాధులు లేకుండా, దంతాల అమరిక, పొదుగు గడ్డలు లేకుండా, కళ్ళు సరిగా ఉండేవి ఎంపిక చేసుకోవాలి. జీవాలను సంతలో కంటే మంద దగ్గరకి వెళ్లి కొనుక్కోవడం మంచిది.
జీవాలకు అవసరమైయ్యే పశు గ్రాసాలు అనగా స్టైల్లోహేమాటా, కౌపి, లూసేర్న్, హెడ్జ్ లూసేర్న్, మొదలగునవి పెంచడానికి అనువైన స్థలంను ఎంచుకోవాలి. కొత్తగా ప్రారంభించేవారు చిన్న మంద 50 ఎంపిక చేసుకోవడం మంచిది. పాత జీవాల పెంపకదారులు కొత్త జీవాలను ఎంపిక చేసుకోవడం మంచిది. కొత్త జీవాల మందను వేరుగా ఒక మూడు నేలలు ఉంచి ఏ రోగాలు లేవు అని తెలిసిన తర్వాత కలపాలి. ఎక్కువగా జీవాలను పెంచడానికి పాక్షిక సాంప్రపద్దతి ఉపయోగించాలి. అనగా 6 గంటలు పచ్చిక బయళ్ళు, బంజారు భూమిలో మేపుతారు.
Also Read: Dairy Animals: పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Animal Husbandry Techniques
మిగిలిన సమయం దాణా, పశుగ్రాసాన్ని వేస్తారు. దీనివల్ల జీవాల లెక్కింపు, టీకాలు వేయడం , మందులు త్రాగించడం చేయవచ్చును. జీవాలకు వ్యాయామం అగును. పశు వైద్య సౌకర్యం మందకి దగ్గరగా ఉండే విధంగా చూసుకోవాలి. తెలంగాణ లో ఇప్పుడు ఇస్తున్న జీవాలతో పాటు పాత జీవాలకు ఇన్సూరెన్స్ కలిపిస్తున్నారు.కావున జీవాల పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
పిల్లలకు 10 రోజుల వయస్సు నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల మందును త్రాగించాలి. పిల్లలను చాలి , వర్షం, ఎండ, కుక్కల నుండి కాపాడాలి. పరన్నా జీవుల బెడద నుండి కాపాడటానికి కొట్టాలను బ్ల్యూటాక్స్, నియోసిడాల్ లాంటి మందును 0.5% ద్రావన్నాని పిచికారీ చేయాలి. కొట్టాలను ఎప్పుడు పొడిగా ఉంచాలి. గొర్రె పిల్లలు ఒక నేల తరువాత నుండి పశుగ్రాసాన్ని కొరకడం , నీరు త్రాగడం ప్రారంభిస్తాయి.
గొర్రె పిల్లలను తల్లుల నుండి మూడు మసాలు రాగానే వేరు చేయాలి. అప్పుడు జీవాలు త్వరగా ఏదకు వచ్చును.గొర్రె పిల్లలను గుర్తించడానికి వాటి చెవులకు ట్యాగ్స్ ను వేయాలి. నాలుగు మసాల నుండి గొర్రె పిల్లలకు వ్యాధి నిరోధకత టీకాలు వేయాలి. మూడు మసాల నుండి మాగ జీవాలకు ఎక్కువగా కొవ్వు, ప్రోటీన్ లు ఉండే మిశ్రమాన్నిచ్చి, పెరుగుదలకు పెంచి మాంసాన్ని అమ్మి వేయాలి. గొర్రె మందలలో ఒక మేకను పెంచుకోవాలి. ఎందుకంటే మేకనే ముందు ఉండి దారి చూపిస్తుంది.
Also Read: Pregnant Animal Management: చూడి పశువుల యాజమాన్యం.!