Swine Fever in Pigs: ఇది పందులలో వచ్చే అతి తీవ్రమైన, ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వ్యాధిని మొట్ట మొదట 1833 వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్ వారు గుర్తించారు. తరువాత 1862వ సంవత్సరంలో ఈ వ్యాధికి గల మూల కారణాన్ని కనుగొన్నారు. ఈ వ్యాధి వచ్చినట్లైతే Morbidity 100%, Mortality కూడా 100% వరకు ఉంటుంది. భారతదేశంలో ఈ వ్యాధిని మొట్టమొదట 1951 వ సంవత్సరంలో కనుగొన్నారు. 1981 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోని పందులలో ఈ వ్యాధి ప్రబలి చాలా ప్రాణ నష్టం జరిగినది.
ఈ వ్యాధి టోగా విరిడి కుటుంబానికి చెందిన పెస్ట్ వైరస్ వలన పందులలో కలుగుతుంది. ఇది Single standard, RNA, Enveloped virus. ఇది సుమారు 30-40 nm పరిమాణం కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువ వేడిని మరియు రసాయనాలను తట్టుకోగలదు. ఈ వైరస్ టోఫైస్ వైరల్ డయేరియా వైరస్ను పోలి ఉంటుంది. సాల్మోనెల్లా కలరా సూయిస్ బ్యాక్టీరియా మరియు ఈ వైరస్ పరస్పరం ఒకదాని మీద మరోకటి ఆధారపడి ఈ వ్యాధిని మరింత ఉద్రుత్తం చేస్తాయి.పంది పిల్లలలో ఈ వ్యాధి అత్యంత తీవ్రంగాను, పెద్ద వాటిలో దీర్ఘకాలికంగానూ ఉంటుంది.
వ్యాధికి గురి అయిన పందులు లేదా క్యారియర్ పందుల నుండి వచ్చే ఎక్స్క్రీషన్స్, సెక్రీషన్స్ మరియు ఈసుకుపోయిన పిండం, గర్భకోశం నుండి వెలువడు ద్రవాలతో కలుషితం అయిన ఆహారాన్ని ఆరోగ్యవంతమైన పందులు తీసుకోవడం ద్వారా కానీ, గాలిని పీల్చడం ద్వారా కానీ లేదా వ్యాధితో ఉన్న పందిని నేరుగా తాకడం వలన కానీ ఈ వ్యాధి ఇతర పందులకు వ్యాపిస్తుంటుంది. అంతే కాకుండా వ్యాధి కారక పందుల నుండి వెలువడు ఎక్స్ప్రెషన్స్, సెక్రీషన్తో కలుషితం అయిన పక్షులు, మనుషులు, క్షేత్ర పరికరాలు మొదలగు వాటి ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- వైరస్ తో కలుషితం అయిన ఆహారాన్ని తీసుకోవడం వలన కానీ లేదా గాలిని పీల్చుకోవడం వలన కానీ లేదా నేరుగా వ్యాధితో ఉన్న పందులను తాకడం వలన కానీ ఈ వైరస్ దగ్గరలో వుండే టాన్సిల్స్ మరియు లింఫ్ గ్రంథులకు వేరి, లింపోసైన్స్ను నాశనం చేసి రక్తంలో కలిసి, రక్తం ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు చర్మం, కాలేయం, ప్లీహం, మూత్రపిండాలు, గర్భాశయం, మెదడు, జీర్ణాశయం, ఊపిరితిత్తులలో చేరి వాటిని నాశనం చేస్తుంది. ఈ వైరస్ ముఖ్యంగా రక్తనాళంలోని ఎండోథీలియంను విచ్ఛిన్నం చేయుట ద్వారా రక్తనాళాలలో థ్రాంబోసిస్, ఇంపాక్షన్, కంజెషన్ను కలుగ చేయుట ద్వారా పై అవయములలో వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో సాల్మోనెల్లా కలరా సూయిస్ మరియు పాశ్చురెల్లా సూయిసెప్టికా వంటి సెకండరీ బ్యాక్టీరియాలు చేరి ఈ వ్యాధిని మరింత తీవ్రం చేయుట ద్వారా వందులు చనిపోతుంటాయి.