Cattle Holiday: ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర అన్ని ప్రైవేట్ సంస్థలు ఆదివారం సెలవు ఇస్తున్నాయి. వారంలో ఒక రోజు సెలవు ఉండటం వల్ల ప్రజలు శారీరకంగా, మానసికంగా అలసిపోకుండా ఉంటారు. ఒక రోజు సెలవులో ఉన్న వ్యక్తులు, తర్వాత రోజు పనిలోకి వచ్చాక పనిని ఉత్త్సహంతో పూర్తి చేస్తారు. ఇప్పటి వరకూ ఆదివారం కేవలం మనుషులకు సెలవు ఉండేది, ఇపుడు జార్ఖండ్ రాష్ట్రంలో జంతువులకు ఒక రోజు సెలవు ఇస్తున్నారు.
జంతువులకు కూడా ఆజ్ తక్ నివేదిక ఇచ్చిన విధానంగా ఆదివారం సెలవు ఇస్తున్నారు. ఆదివారం రోజు పశువులకు మేత మాత్రమే ఇచ్చి, పని చేయనివ్వరు. మనుషుల జంతువులకు కూడా విశ్రాంతి అవసరం అన్ని జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రజల నమ్మకం. అందుకే అక్కడి వాళ్ళ పశువులకి ఆదివారం సెలవు ఇస్తున్నారు.
జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో సంప్రదాయంగా పశువులకి వారంలో ఒక రోజు సెలవు ఇస్తారు. ఈ జిల్లాలో 20 గ్రామాల ప్రజలు 100 సంవత్సరాల నుంచి జంతువులకి సెలవుని ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆదివారం రోజు పశువులకు కావాల్సిన మేత, పచ్చ గడ్డిని ఆహారంగా వేస్తారు.
ఈ సంప్రదాయానికి మూలం 100 సంవత్సరాల ముందు పొలంలో దుక్కి దున్నుతున్న రైతు ఎద్దు చనిపోయింది. ఎద్దు చనిపోవడానికి ఎక్కువగా పని చేసి అలసిపోయినందుకు. దీనితో గ్రామా ప్రజలు అందరూ వారంలో ఒక రోజు పశువులకి విశ్రాంతి ఇవ్వాలి అన్ని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి జార్ఖండ్ ప్రదేశంలో పశువులకి ఆదివారం సెలవు ఇవ్వడం వల్ల తర్వాత రోజు ఉషారుగా పనిచేస్తాయి అన్ని నమ్మకం.