పశుపోషణరైతులు

Success Stories: ఆదర్శ రైతు విజయ గౌరీ సక్సెస్ స్టోరీ

2
Farmer Success Stories

Success Stories: నా పేరు విజయ గౌరీ. మాది విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, రాజుపేట గ్రామం. పాడి ఆవులను సాకుతూ మేము ఆర్ధికంగా నిలదొక్కుకున్నాం. కానీ గతంలో మేము ఆర్ధికంగా చితికిపోయాము. నా భర్త పేరు రామారావు. మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త రామారావు రాజకీయాల్లో తిరిగేవారు. అయితే ఉన్న డబ్బంతా రాజకీయాల్లో ఖర్చు చేయడంతో మా కుటుంబం కష్టాలపాలైంది. దీంతో మాకున్న మూడు ఎకరాల భూమిని కూడా అమ్మాల్సి వచ్చింది. అయితే మాది వ్యవసాయ కుటుంబం కావడంతో వ్యవసాయం, పశువుల పెంపకం (Dairy Farming) పై నాకు అవగాహనా ఉండటంతో పాడి పశువుల పెంపకం చేపట్టాను. కష్టాల్లో ఉన్న నా కుటుంబాన్ని ఆర్ధికంగా నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ముందడుగు వేశాను.

Animal Farming

Animal Farming

ఏడేళ్ల క్రితం నేను పశు క్రాంతి పథకం ద్వారా విశాఖ డెయిరీ సహకారంతో చెన్నై నుంచి మూడు ఆవులతో పాడి పరిశ్రమ మొదలు పెట్టాను. నా భర్త రామారావు సహకారం తీసుకుని పలు జాతుల ఆవులను కొనుగోలు చేశాం. 5 జెర్సీ, 2 హెచ్‌.ఎఫ్‌. ఆవులతోపాటు 4 ఒంగోలు, 2 సాహివాల్, 1 పుంగనూరు తదితర దేశీ జాతి ఆవులను కొనుగోలు చేశాం. మొత్తం 16 ఆవులు, 2 పెయ్యలను జాగ్రత్తగా పోషిస్తున్నాం. వ్యవసాయ శాఖ, విశాఖ డెయిరీ, పశుసంవర్ధక శాఖల సహకారంతో కో–4 గడ్డిని ఎకరంలో పెంచుతున్నాం. మిగతా ఎకరంలో వరి పండిస్తున్నాం. పశువులకు ఆరోగ్యకరమైన మేతను, దాణాని అందిస్తూ పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం.

Also Read: బిగ్ బాస్కెట్, రిలయన్స్ ,మెట్రోతో ఒప్పందం

Animal Farming

Animal Farming

పాడి పరిశ్రమలో అనేక లాభాలున్నాయి. నచ్చిన పని చేసుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకున్నాం. రోజుకు 80 నుంచి 100 లీటర్ల పాలను విశాఖ డెయిరీ కేంద్రానికి ఎగుమతి చేస్తున్నాం. దీంతో 15 రోజులకొకసారి డబ్బు చేతికొస్తుంది. అందులో సగం ఆదాయం పశువుల పోషణ, మరియు వాటి ఆరోగ్యం, బాగోగుల కోసం ఖర్చు పెడుతున్నాం. అప్పుడప్పుడూ రోజుకు 120 నుంచి 150 లీటర్ల పాలు పోసిన రోజులున్నాయి. ఇక పాడి పశువుల ద్వారా పాలు మాత్రమే కాకుండా పశువుల పేడతో లాభాలు పొందుతున్నాం. పశువుల పేడతోనే గోబర్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. నా భర్త, నేను ఉదయాన్నే 3.30 గంటలకు లేచి పశువులను శుభ్రం చేసి, పాలు తీస్తాం. పశువులను, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం, పాలు తీయడం, డైరీకి పాలు అందించడం, కొన్నిపాలు గ్రామంలో అమ్మడం, పశువుల మేత/దాణా వేయటం, అవసరమైన ఆవులకు మందులు వేయడం.. ఇదే మా దినచర్య. తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడాది పొడవునా ఇదే మా జీవనం. ఆవులే మాకు ఆధారం. డెయిరీలో లీటరు పాల ధర రూ. 28 రూపాయలు. బయట అమ్మితే రూ. 30 నుంచి 35లు వస్తాయి.

Farmer Success Stories

Vijaya Gouri

కాగా.. విజయ గౌరీ పెద్దగా చదువుకోలేదు. కానీ ప్రతి అంశాన్ని చాలా ఆసక్తిగా నేర్చుకుంటూ కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని లాభాల వైపుకు మళ్లించింది. దీంతో ఆ కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకుంది. ప్రస్తుతం రామారావు విశాఖ డెయిరీ పాలకేంద్రం కార్యదర్శిగా, నీటిసంఘం అధ్యక్షులుగా పని చేస్తున్నారు. విజయ గౌరీ, రామారావు కుమారుడు నాగేంద్రకుమార్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి యశోదను తిరుపతిలో ఇంజనీరింగ్‌ చదివిస్తున్నారు.

Also Read: టెక్కీ టూ అభినవ్ కిసాన్ పురస్కారం.. సక్సెస్ స్టోరీ

Leave Your Comments

Unseasonal Rains: అకాల వర్షాలతో మిర్చి రైతుల ఆందోళన

Previous article

Aqua Culture: చేపల పెంపకాన్ని మొదలు పెట్టే ముందు వీటిని ఒక్కసారి గమనించండి.!

Next article

You may also like