పశుపోషణ

Smallpox in Goats: మేకలలో వచ్చే మశూచి వ్యాధి/ పాక్స్‌/బొబ్బ రోగం.!

2
Smallpox in Goats
Smallpox in Goats

Smallpox in Goats: వేసవిలో జీవాలకు గ్రాసం కొరతే కాకుండా కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మశూచి లేదా పాక్స్‌ లేదా బొబ్బ రోగం అతి ముఖ్యమైనది. గొర్రెలకు, మేకలకు ఏప్రిల్‌ నెల నుంచి ఆగస్టు వరకు మేకలకు మశూచి వ్యాధి (పాక్స్‌ వైరస్‌) ముప్పు పొంచి ఉంటుంది. కావున  మేకల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండి ముందస్తుగా టీకాలు వేయించడం మంచిది. గాలి ద్వారా వచ్చే ఈ వైరస్‌ వ్యాపించిన మేకలు ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయి. ముఖ్యంగా మేకల పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది.

Smallpox in Goats

Smallpox in Goats

Also Read: Betel Nut Farming: అధునాతన పద్ధతులలో వక్కసాగు.!

మశూచి వ్యాధి లక్షణాలు:
వ్యాధి సోకిన మేకలల్లో వారం రోజుల్లో దాని లక్షణాలు బయటపడతాయి.వ్యాధి సోకిన మేకలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది. చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జనేంద్రియాలు, పాల పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. కళ్ల నుంచి నీరు, నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చీముడు కారుతుంది. శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్యవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు అవుతాయి. చూడి మేకలకు వ్యాధి ప్రబలితే ఈసుకుని పోతాయి.

వ్యాధి వ్యాప్తి చెందే విధానం:

. గాలి ద్వారా మశూచి వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త మేకలు నుంచి మరొక దానికి వ్యాప్తిస్తుంది.దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర తాకే వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్‌ ఊపిరితిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది.

. చర్మంలో ఎక్కడైనా పుండు గాని, తెగిన గాయం గాని ఉంటే సునాయసంగా అక్కడి నుంచి జీవాల శరీరంలోకి ప్రవేశిస్తుంది. మోకాళ్లు, మోచేతుల వద్ద ఉండే పుండ్లు, పక్కులు గట్టడం ద్వారా సంక్రమించే అంటువ్యాధి.

. ప్రధానంగా జీవాల పెదవులు, ముక్కు, పొదుగు చనుమొనలు, డెక్కల వద్ద పొక్కులు లేదా దద్దుర్ల వలె ఉంటే ఈ వ్యాధి సోకినట్లు గుర్తించాలి. దీని బారిన పడిన జీవాలు ఆరోగ్యంగా ఉండవు. త్వరగా ఇతర వ్యాధులబారిన పడుతుంటాయి. తిండి తక్కువ తినడం వల్ల అనారోగ్యంతో మృతిచెందే అవకాశం ఉంటుంది.

. ముఖ్యంగా పాలిచ్చే ఆడమేకల చనుమొనలలో పొక్కులు ఏర్పడి వాటి పిల్లలు పాలు తాగే సమయంలో చాలానొప్పి కలుగజేస్తాయి. అందుకే పిల్లలను పాలు తాగడానికి తల్లి మేకలు అనుమతించవు. కొన్నిసార్లు జీవాలు పొదుగువాపు బారిన పడే ప్రమాదం ఉంటుంది. దీనికోసం టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఖర్చుతో కూడుకున్న పని. ఈ వ్యాధి ఒకటి నుంచి నాలుగు వారాలలో తగ్గుతుంది. కానీ జీవాల రోగ నిరోధక శక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది.

వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు:

. వ్యాధి సోకిన మేకలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. ఇది వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి గనుక మందులు పనిచేయవు. దీని వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. కావున ఇతర వ్యాధులు రాకుండా యాంటి బయోటిక్స్‌ వాడవలెను. ఉపశమనం కోసం మెలొనెక్ష్‌ మందులు వాడవలెను.

. తేలికగా జీర్ణమయ్యే ఆహారం గంజి గాని, బెల్లం పానకము గాని ఇవ్వాలి. లేదంటే బయట మార్కెట్‌లో దొరికే గ్లుకాబూస్ట్‌ వంటి తాపే మందులను వినియోగించాలి.

. ఇది సోకిన మేకలు, గొర్రెలతో ఇతర జీవాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పొక్కుల వద్ద అయోడిన్‌ పూయడం మంచిది. పురుగులు, ఈగలు, కీటకాల బెడద ఉంటే వాటి నివారణకు పుండు పడిన చోట పశువైద్యుల సూచనలతో బోరిక్‌ మరియు గ్లిసరీన్‌ పేస్ట్‌ పలాంటి మందులు చల్లాలి లేదా టాపిక్యుర్‌ లాంటి స్ప్రే లను వాడాలి.

. హోమియోపతి మందు పోక్సోదిన్‌ ఒకసారి మరియు తుజా మందును ఉదయం సాయంత్రం ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

నివారణ చర్యలు:

. వ్యాధి ఉన్న జీవాన్ని కుట్టిన కీటకాలు ఇతర జీవాలకు వ్యాధి వ్యాప్తి చేస్తాయి. ఈ వైరస్‌ మానవులకు కూడా సంక్రమించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. గొర్రెలు, మేకల మంద ఉన్నవాళ్లు ఈ వ్యాధి నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి.

. చేతులకు గ్లౌస్‌ వేసుకుని మందులు వేయాలి. ఒకవేళ ఈ వ్యాధి మనుషులకు సోకితే దీన్ని ఓర్స్‌అంటారు. ఇది చేతులు లేదా వేళ్ల దగ్గర చర్మం పై అంటుపుండ్లను కలుగజేస్తుంది. వీటితో చాలానొప్పి ఉంటుం

. జీవాలలో వ్యాధి నివారణకు స్థానిక పశువుల వైద్యులను సంప్రదించి టీకాలు వేయించాలి. లేదా వారి అనుమతితో టీకాలు వేయాలి. జీవాలలోని వెంట్రుకలు లేని ప్రాంతం తోక కింద కానీ, చెవి లోపల, తొడ లోపల (వెంట్రుకలు లేని భాగం) టీకా వేయాలి.

. గొర్రెలు, మేకల మంద ఉన్న రైతులు జాగ్రత్త పడకుంటే ఇది మళ్లీ మళ్లీ వ్యాప్తిచెందే ప్రమాదం ఉంటుంది. ఈ అంటువ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.

. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో మేకలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.

. కొత్త జీవాలను మందలో చేర్చే ముందు వాటిని కొద్ది రోజులు మందకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి.

. వ్యాధి సోకిన మేకలు వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్లనీయకూడదు.

. వ్యాధి వల్ల చనిపోయిన మేకలు ను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి.

. వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రపరచాలి.

. వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించాలి.
పై విధంగా జీవాల కాపలదారులు సూచనలను పాటించినట్లయితే జీవాలను కోల్పోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు.

డా.జి.రాంబాబు. పశు వైద్యాధికారి, కడప.

Also Read: Heliconia Crop: కొబ్బరి మరియు ఆయిల్‌పామ్‌ తోటల్లో అంతరపంటగా హెలికోనియా.!

Leave Your Comments

Betel Nut Farming: అధునాతన పద్ధతులలో వక్కసాగు.!

Previous article

Trichoderma: నేలకు ఆరోగ్య సంజీవని` ట్రైకోడెర్మా.!

Next article

You may also like