Selection of TUP and RAM: వ్యవసాయం, పశుపోషణ రెండు రంగాలు ఒకదానితో మరొకటి పరస్పర అనుబంధమైనవి , అలాగే ఒకదానిపై మరొకటి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా అధారపడతాయి. అయితే గొర్రెల పెంపకం మిగతా ఆవులు, గేదెల వంటి వాటికంటే కూడా సులభం, ఖర్చు కూడా తక్కువ.ముఖ్యంగా ఇది భూమి లేని నిరుపేదలు, సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఉంటుంది.
తక్కువ వర్షపాతం గల తెలంగాణా, రాయలసీమ, ఇతర మెట్ట ప్రాంతాల్లో లాభదాయకంగా ఉంటుంది. గొర్రెలనుండి మనకు కావాల్సిన మాంసం,ఉన్ని, తోలు, వ్యర్థపు ఎరువులు లభిస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహించడం సంతోషకరం. వీటికి ప్రత్యేకమైన దాణా అంటూ ఇవ్వనవసరం లేకుండా పంట పొలాల్లో వృధాగా పెరిగే గడ్డి , పంట నుండి వచ్చే ఉప ఉత్పత్తులు తిని , బలిష్టంగా ఎదుగుతాయి. వీటి కి ఆవాసం కోసం కావాల్సిన పాకలను కూడా గడ్డి, తాటాకులు, వెదురు కర్రలను ఉపయోగించి , చౌకగా, సులభంగా నిర్మించొచ్చు. చాలా మంది రైతులు చేసే తప్పులు గొర్రెల ఎంపికలో చేస్తారు. సరైన అవావగాహన కొంత నైపుణ్యంతో సరైన పశువులను ఎంపిక చేసి మందను పెంపొందించవచ్చు.
Also Read: గొర్రె పిల్లల సంరక్షణ -మెళకువలు
గొర్రెల ఎంపికలో మెళకువలు(TUP)
గొర్రెల మంద ఎదుగుదలకు ప్రధాన కారణం ఆడగొర్రెగా అభివర్ణించవచ్చు. ఆడ గొర్రె ఎంత బాగుంటే మంద అంత బాగుంటది. అడగొర్రెలను దాని వంశ లక్షణాలు,శరీర నిర్మాణం, సామర్థ్యాలను చూసి ఎంపిక చేస్కోవాలి.ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి .మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్ళులేని గొర్రెలను ఏరివేయాలి. అడ గొర్రెలను సంతలో కాకుండా,రైతుల మందలోనే చూసి కొనాలి. సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ప్రతి అసంవత్సరం ముసలి గొర్రెలను మందనుండి తీసేయాలి.
పొట్టేళ్ల ఎంపికలో మెళకువలు(RAM):
పొట్టేళ్ల శరీర సౌష్టవం(అడ్డు, పొడుగు) బాగా ఉండి, బలమైన కళ్ళు, చక్కని గిట్టలు కలిగి , పొడవు,బరువు,ఎత్తు సరిగ్గా ఉండి, చురుగ్గా ఉన్న పొట్టేలుని ఎంచుకోవాలి.పొట్టేలు ఎంత నాణ్యంగా ఉంటె దాని నుండి వచ్చే సంతానం అంత బాగుంటుంది. పురుషాంగంలో ఎలాంటి లోపం లేకుండా, సామర్థ్యం కలిగిన, గుణాత్మకమైన వీర్యం ఉండాలి.
పొట్టేళ్లని మందపై వాడడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాల వయసు గలదై ఉండాలి. కవల పిల్లల నుండి వచ్చిన పొట్టేలు అయితే మంచిది. మందలో ప్రతి 30 అడగొర్రెలను,ఒక మగపొట్టేలు ఉంటే పునరుత్పత్తి సరిగ్గా ఉంటుంది. తరాల నుండి వచ్చే వ్యాధులు లేకుండా చూసుకోవాలి. పొట్టేళ్లని పక్క మంద లేదా పక్క గ్రామం , ప్రభుత్వ ఫారం నుండి తెచ్చుకోవాలి.ఆర్టిఫిషల్ ఇంసెమినషన్ ఉంటె ఇంకా మంచిది.జీవాల ఎంపికలో మంచి వెటర్నరీ డాక్టర్ సహాయం తీసుకోవడం ఉత్తమం.
Also Read: ఆడ గొర్రెల ఎంపిక విషయం లో తీయాల్సిన జాగ్రత్తలు