National Livestock Mission Subsidy Scheme: భారతదేశంలో గొర్రెలు, మేకల నుండి లభించే మాంసానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ రంగంలో నూతన వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా మరియు ఉద్యోగ,వ్యాపార అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం వారు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (National Livestock Mission) పథకం ద్వారా భారీ మొత్తంలో సబ్సిడీలను ప్రకటించింది. ఈ పథకం ప్రారంభించి 20 నెలలు గడిచినప్పటికీ, సరయిన అవగాహన లేకపోవడం కారణంగా అతి తక్కువ మంది మాత్రమే ధరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పథకం గూర్చి ఏరువాక పాఠకులకు పూర్తివివరాలు తెలియజేయాలనే సంకల్పంతో ఈ వ్యాసం రాయడం జరిగింది.
ఎప్పటి వరకు ఈ పథకం అమలులో ఉంటుంది?
2021`22 లో మొదలైన ఈ పథకం 2026`27 వరకు అమలులో ఉంటుంది.
ఎవరు అమలుపరుస్తారు?
ప్రతీ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పశుసంవర్థక ఈ పథకంను అమలు చేస్తుంది. రెండవ విడత సబ్సిడీ విడుదల వరకు ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది కూడా.
సబ్సిడీ ఎంత లభిస్తుంది?
మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం లేదా గరిష్టంగా 50 లక్షలకు మించకుండా సబ్సిడీ లభిస్తుంది. 500G25 గొర్రెలు లేదా మేకల యూనిట్ ప్రాజెక్టు వ్యయం కనీసంగా 83 లక్షలు ఉండవచ్చునని సూచించడం జరిగింది. కానీ, స్థానిక ధరలు, పరిస్థితులను బట్టి ఈ వ్యయం కోటి రూపాయలు కూడా దాటవచ్చు. ఈ పధకంలో 100G5, 200G10, 300G15. 400G20 సైజు యూనిట్లు కూడా ఉన్నాయి.100G5 సైజు యూనిట్‌కి 10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉండటం కారణంగా ప్రాజెక్టు వ్యయం దాదాపు కోటిరూపాయలు అవుతుంది. ప్రాజెక్టు వ్యయంలో మిగతా 50 శాతం వాటాను లబ్ధిదారుడు స్వయంగా పెట్టుకోవచ్చును లేదా ఏదైనా జాతీయబ్యాంకు నుండి రుణం ద్వారా సేకరించుకోవచ్చును.
Also Read: Ovine Encephalitis in Sheep: గొర్రెలలో ఒవైన్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!
యూనిట్ సైజు ఎంత?
కనీసంగా 100G5, గరిష్టంగా 500G25 గొర్రెలు లేదా మేకలను ఒక యూనిట్ సైజుగా పరిగణిస్తారు. 200G10, 300G15, 400G20 సైజు యూనిట్‌కి కూడా సబ్సిడీ లభిస్తుంది. కానీ, పునరుత్పత్తి కోసం మాత్రమే జీవాలను పెంచవలసి ఉంటుంది. మగపిల్లల పెంపకానికి ఈ పథకం వర్తించదు.
ధరఖాస్తుదారుల అర్హత:
గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి కలిగిన ఒక వ్యక్తి లేదా సంస్థ లేదా స్వయం సహాయకసంఘాలు ఎవరైనా కూడా ఈ పథకానికి అర్హులే. అంతేకాక జాయింట్ లయబిలిటీ గ్రూప్, ఎఫ్.పి.ఓ …….. లేదా సెక్షన్`8 క్రింద రిజిస్ట్రర్ కాబడిన కంపెనీలు కూడా ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయత, మతం, కులం లాంటివి పరిగణింపబడవు. కానీ, వారికి పశుపోషణలో తగినంత అనుభవం ఉండి ఉండాలి లేదా గొర్రెలు, మేకల పెంపకంపై ఏదైనా గుర్తింపు పొందిన శిక్షణాకేంద్రం నుండి తగిన శిక్షణ పొంది ఉండాలి లేదా సాంకేతిక సలహాదారులుగా అనుభవజ్ఞులైన పశు వైద్యసిబ్బందిని ఫారమ్ నిర్వహణ నిమిత్తం నియమించుకోవాల్సి ఉంటుంది.
గొర్రెలు, మేకలను ఏ పద్ధతిలో పెంచాలి?
ఈ పథకం నుండి లబ్ధిపొందాలనుకునే వారు సాంప్రదాయ మేపుపద్ధతిలో కాకుండా జీరోగ్రేజింగ్ పద్ధతిలో (సాంద్రపద్ధతి/ స్టాల్ ఫీడిరగ్) జీవాల పెంపకం చేయాల్సి ఉంటుంది.
ఏ జాతి గొర్రెలు, మేకలను పెంచాలి?
కేంద్రప్రభుత్వంచే గుర్తించబడిన 44 గొర్రె జాతులు లేదా 38 మేకజాతులలో ఏ జాతినైనా కూడా పెంచవచ్చును. ఇది ధరఖాస్తుదారుని ఇష్టం. ఏ జాతులను పెంచాలనుకుంటున్నారో వాటినే ప్రాజెక్టు రిపోర్టులో కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
ఎంత భూమి కావాలి?
500G25 సైజు యూనిట్ జీవాల వసతి ఏర్పాటు కోసం కనీసంగా అర ఎకరం భూమి అవసరంఉంటుంది. ఈ భూమి స్వంత భూమి అయితే మంచిది. లీజు భూమి అయినా కూడా అంగీకరిస్తారు మరియు జీవాల మేపుకు కావాల్సిన పశుగ్రాసాలను స్వయంగా పండిరచుకోవాలనుకుంటే 5 నుండి 10 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. అయితే పశుగ్రాసాల సాగుకోసం కూడా స్వంత భూమి ఉండాల్సిన అవసరం లేదు. లీజుకు కూడా తీసుకోవచ్చు. లేదా జీవాలకు కావాల్సిన మేతను ఇతరుల నుండి సేకరించుకోగలిగిన వీలుంటే, జీవాల వసతికి మినహా ఎటువంటి భూమి ఉండాల్సిన అవసరం లేదు.
ఎలా ధరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకంపై ఆసక్తి కలిగినవారు www.nlm.udyamimitra.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఎవర్నీ కలవాల్సిన అవసరం లేదు.
ధరఖాస్తు ఫీజు వివరములు:
ఎలాంటి ధరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
1. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ………….. మరియు ప్రాజెక్టు వయబిలిటీ రిపోర్టు
2. ధరఖాస్తుదారుని పాన్‌కార్డ్, ఆధార్‌కార్డు, అడ్రస్‌ప్రూఫ్
3. ధరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
4. ఏ బ్యాంకు నుండి లోన్ పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంకు అకౌంట్ వివరాలు మరియు క్యాన్సిల్ చేయబడిన బ్యాంకు చెక్.
5. బ్యాంకు నుండి నిర్ణీత నమూనాలో తీసుకున్న లోను అంగీకార పత్రము.
6. బ్యాంకు లోను కాకుండా ధరఖాస్తుదారుడే స్వయంగా ప్రాజెక్టు వ్యయంలో మిగతా 50 శాతం భరించాలనుకుంటే అందుకు సంబంధించి బ్యాంకు వారి గ్యారంటి పత్రం
7. గత ఆరునెలల బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్
8. జీవాల పెంపకంపై అనుభవము ఉంది అని తెలిపే సర్టిఫికేట్ (స్థానిక పశువైద్యాధికారి నుండి పొందాలి) లేదా గొర్రెల మేకల పెంపకంపై శిక్షణ పొందినట్లయితే అందుకు సంబంధించిన సర్టిఫికేట్
9. ఏ ప్రాంతంలో ఫారమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతం యొక్క ఫొటో మరియు జిపిఎస్ లోకేషన్
10. సొంత భూమి పత్రాలు (పట్టేదారు పాసుపుస్తకం) లేదా లీజుభూమి అగ్రిమెంటు పత్రాలు
11. ఒక వ్యక్తిగా కాకుండా ఒక గ్రూపుగా లేదా స్వయం సహాయక బృందాలుగా ధరఖాస్తు చేయాలనుకుంటే అందరి సభ్యుల ఆధార్‌కార్డు, ఫోన్‌నెంబరు, చిరునామా, పాన్‌కార్డు కావాలి.
ఆన్‌లైన్ ధరఖాస్తు విధానం:
1. పైన తెలిపిన అన్నీ డాక్యుమెంట్లు సేకరించుకొని అన్నింటిని JP+ ఫార్మెట్‌లో
(1 వీదీ లోపు) స్కాన్ చేసి పెట్టుకోవాలి
2. ధరఖాస్తు ఫారమ్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని నింపి పెట్టుకున్నట్లయితే దానిని చూసుకుంటూ ఆన్‌లైన్‌లో ధరఖాస్తు ఫారమ్ నింపడం సులువుగా ఉంటుంది.
3. www.nlm.udyamimitra.in లో ఎంటర్‌ప్రెన్యూయర్ గా లాగిన్ అయినట్లయితే స్వంత మొబైల్ నెంబర్‌కు ఒక ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ధరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
4. ధరఖాస్తులో అడిగిన ప్రతీ కాలమ్‌ను నింపుకుంటూ అవసరమైన చోట సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
5. ధరఖాస్తు ఫారమ్ నింపడం పూర్తయిన తరువాత సబ్మిట్ చేయాలి.
6. సబ్మిట్ చేసిన పిదప అంతా సరిగా ఉన్నట్లయితే మొబైల్‌నెంబర్‌పై మరియు ఈ మెయిల్ ద్వారా,
మీ ధరఖాస్తు సమర్పించబడిరది, అనే సంక్షిప్త సమాచారం లభిస్తుంది.
7. సబ్మిట్ చేసిన ధరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
8. ధరఖాస్తు స్టేటస్‌ను అదే పోర్టల్ ద్వారా తెలుసుకోవడం కూడా చాలా సులువు.
9. మరింత లేదా ఏదైనా ఇతర సమాచారం కావాలనుకుంటే www.nlm.udyamimitra.in ద్వారా నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ అధికారులను ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ధరఖాస్తు చేసిన తరువాత సబ్సిడీ రావడానికి ఎంత కాలం పడుతుంది?
ధరఖాస్తును అన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన దశ నుండి మొదలుకొని సబ్సిడీ విడుదల దశ వరకు మొత్తం
6 దశలు ఉంటాయి. అన్ని దశలు దాటి సబ్సిడీ విడుదల కావడానికి సాధారణంగా 2 నుండి 6 నెలల సమయం పట్టవచ్చు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం సబ్సిడీని (గరిష్టంగా 50 లక్షలు) రెండు విడతలుగా విడుదల చేస్తారు. 500G25 యూనిట్‌కి ధరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రాజెక్టు మొదటిదశలో 50 శాతం (25 లక్షలు) మరియు ప్రాజెక్టు చివరి దశలో మిగతా 50శాతం (25 లక్షలు) అందజేస్తారు.
గమనిక: ఈ పథకం ద్వారా వాణిజ్యసరళిలో గొర్రెల, మేకల పెంపకం చేసినప్పటికీ, జీవాల పెంపకం వ్యవసాయ అనుబంధ రంగం కాబట్టి గొర్రెలు, మేకల షెడ్డు నిర్మాణం కోసం భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయించాల్సిన అవసరం లేదు. అలాగే ఇందుకు సంబంధిత గ్రామపంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు కూడా పొందాల్సిన అవసరం లేదు.
500G25 గొర్రెలు లేదా మేకల ప్రాజెక్టు రిపోర్టును ఈ వ్యాస రచయిత నుండి ఉచితంగా పొందవచ్చును. వాట్సప్ ద్వారా మాత్రమే సంప్రదించాల్సిన నెంబరు: 8500404016
Also Read: Listeriosis Disease in Goats: మేకలలో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం.!
Also Watch: