Rinderpest Disease in Buffaloes: ఈ వ్యాధి సారమిక్స్లో విరిడే కుటుంబానికి చెందిన మార్బిల్లి వైరస్ వలన ఆవులు, గేదెలలో కలుగు అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో వెక్రాటిక్ సాఫ్టుటైటిస్, గ్యాస్ట్రో ఎంటిరైటిస్ వంటి ఇబ్బందులతో తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు కలిగి పశువులు చనిపోవుట జరుగుతుంటుంది. అధిక సంఖ్యలో లింపోసైట్స్ కణాల విచ్చిన్నం అయి, లింపోసినియా స్థితి కలుగుట ఈ వ్యాధి ప్రత్యేకత.
వ్యాధి లక్షణాలు:
తీవ్రమైన జ్వరం ఉంటుంది,(104-106 °F). పశువులు పారుకుంటూ, నీరసపడిపోయి ఉంటుంది. పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. గాలికుంటు వ్యాధి మాదిరిగానే నోటి చిగుళ్ళులో అల్సర్లు ఉంటాయి. కంటి నుండి నీరు, నోటి నుండి కారుతూ ఉంటుంది. కాంతిని చూస్తే భయపడుతుంది. దీనినే “ఫోటోఫోభియా” అని అంటారు. రక్త పరీక్ష చేసినట్లయితే “ల్యూకోపీనియా” ఉండును.ఈ వ్యాధిలో నోటిలో పుండ్లు, జ్వరం, డయేరియా, న్యూమోనియా ప్రధాన లక్షణాలు ఉంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:- నోటిలో పుండ్లు (Ulcers) ఏర్పడి ఉంటాయి. చిన్న ప్రేగుల మీద రక్తపు చారలు (Hemorrhages) ఉంటాయి. పెద్ద ప్రేగులను గమనించట్లయితే జీబ్రా మార్కింగ్స్” వలే రక్తపు వారలు వుండును. ఊపిరితిత్తులలో బ్రాంకోన్యూమోనియా ఉంటుంది.

Rinderpest Disease in Buffaloes
Also Read: Ranikhet Disease in Poultry: కోళ్లలో కొక్కెర తెగులు ఎలా వస్తుంది.!
వ్యాధి నిర్ధారణ:- పైన చెప్పిన వ్యాధి చరిత్ర, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ఈ క్రింది ప్రయోగశాలలోని పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. హిమబాలాజికల్ పరీక్షలు.. అనిమల్ ఇూక్యూలేషన్ పరీక్షలు, CEF.T, AGID, HAT, HIT, ELISA పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స:-
వ్యాధి కారకాన్ని తగ్గించుటకు చేయు చికిత్స :- ఈ వ్యాధి వైరస్ మూలంగా కలుగుతుంది. కావున ఈ వ్యాధికి ఎటువంటి ప్రత్యేకమైన చికిత్స లేదు.
వ్యాధి లక్షణాలకు చేయు చికిత్స:- విరోచనాలను తగ్గించుటకు అంటీ డయేరియల్ ఔషధాలను, జ్వరమును తగ్గించుటకు అంటి పైరెటిక్ ఔషధములను, శోధమును తగ్గించుటకు అంటిఇన్ ఫ్లమేటరీ ఔషధాలను ఇవ్వాలి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించుటకు క్లోరంఫెనికాల్, క్లోరోటెట్రాసైక్లిన్ వంటి ఆంటిబయోటిక్స్ లేదా ఇతర ఏదేని ఒక అంటి బయోటిక్ ఔషదములు ఇవ్వవలసి ఉంటుంది.
వ్యాధి నుండి త్వరగా కోలుకొనుటకు చేయు చికిత్స:- ఎక్కువ మోతాదులో సెలైన్ ద్రావణములను సిరల ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. విటమిన్స్ మరియు మినరల్స్ ఇంజక్షన్లు ఇవ్వాలి. పశువులకు సమతుల్యమైన ఆహారం, సులభంగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు ఇవ్వాలి. పశువులకు తగినంత విశ్రాంతిని ఇవ్వవలసి ఉంటుంది.
నివారణ:- మొదట వ్యాధి గ్రస్త పశువును మంద నుండి వేరుచేయాలి. పశువుల పాకలోని మలమూత్రాలను ఎప్పటికప్పుడు తీసివేసి, పాకసు డిస్ఇన్ఫరెంట్స్ ద్రావణం తో శుభ్రం చేయాలి. రిండర్ పెస్ట్ వ్యాధి టీకాను 1 మి.లీ చొప్పున చర్మం క్రింద ఇచ్చినట్లైతే ఈ వ్యాధి పశువులలో రాకుండా నివారించవచ్చు.
Also Read: Turkey Poultry Farming: లాభ సాటిగా టర్కీ కోళ్ళ పెంపకం.!