Raising Ducks: బాతుల పెంపకం అనేది చాలా అరుదుగా, చాలా తక్కువ మంది రైతులు చేస్తారు. బాతు పెంపకం అనేది కోళ్ల పెంపకం తరువాతే వస్తుంది. చెప్పాలంటే కోళ్ల పెంపకం కంటే బాతు పెంపకం అనేది చాలా తేలిక. ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి చాలా మంది రైతులు బాతు పెంపకం పైనే మొగ్గు చూపుతున్నారు. చేపల పెంపకం, వరిసాగు చేసే రైతులకు బాతుల పెంపకం అనేది అదనపు ఆదాయపు వనరు. సరైన పద్ధతులు పాటించి బాతులని పెంచితే అద్భుతమైన రీతిలో ఆదాయాన్ని పోగు చేసుకోవచ్చు.
బాతు అనేది చాలా కఠినమైన జీవి. అది ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి జీవించగలదు. అందుకే బాతులను పెంచడం అనేది చాలా సులభతరమైన పని. కోళ్లతో పోల్చుకుంటే బాతులకి సంక్రమించే వ్యాధులు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిస్సా, అస్సాం వంటి రాష్ట్రాలు బాతుల పెంపకంలో చాలా ముందడుగులో ఉన్నాయి.
Also Read: Coconut Milk Health Benefits: వైరల్ ఇన్ఫెక్షన్లన్నీ తగ్గించే కొబ్బరి పాలు
బాతులని పెంచడానికే అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఎందుకంటే అవి ఎక్కువగా నీటిలో నివసించే కీటకాలని తింటాయి. ధాన్యపు గింజలు, చిన్న చిన్న చేపలు, కీటకాలు, కప్పలను కూడా తింటాయి. బాతుల కి ప్రత్యేకించి ఆహారం కి ఖర్చు చెయ్యాల్సిన అవసరం లేదు. కాబట్టి వీటిని పెంచడం అనేది చాలా తేలికతో కూడుకున్న పని.
బాతులు దగ్గర దగ్గరగా 40 నుండి 50 గుడ్లు వరకు పెడతాయి. కోళ్లతో పోలిస్తే బాతులే ఎక్కువ గుడ్లు పెడతాయి. అంతేకాకుండా గుడ్ల బరువు కూడా 15 నుండి 20 గ్రాములు ఎక్కువగా ఉంటాయి కూడా. దానికి తోడు బాతు గుడ్లని ఉదయమే పెడతాయి కాబట్టి రైతులకి సేకరించడం అనేది చాలా తేలిక అవుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా బాతులు దుంపలను, వరిలో పెరిగే కీటకాలను, చిన్న చిన్న చేపలను తింటాయి. దీని వలన బాతులు పంట నష్టం జరగకుండా ఉండటంలో సహాయపడతాయి. బాతులకి ఇంటి నుండి పొలం, పొలం నుండి ఇంటికి వెళ్లడం నేర్పించవచ్చు కూడా. అంతే కాకుండా బంతులని పెంచడానికి చాలా తక్కువ స్థలం సరిపోతుంది. కాంపాల్, ఇండియన్ రన్నర్ వంటి బాతు రకాలు గుడ్లని అధికంగా పెడతాయి. ఇంకా కొన్ని రకాల బాతులు రాయల్ కాగువా, ముస్కోబి, పెకింగ్, ఎల్లిస్ బెర్రీ మాంసానికి చాలా ప్రత్యేకం. ఇంకా ఖాకీ కాంప్ బెల్ అనేబాతు సంవత్సరానికి దగ్గర దగ్గరగా 300 వందల గుడ్లని పెడుతుంది.
Also Read: Duck Farming: ఇండియాలో డక్ ఫార్మింగ్ కి ఎందుకంత డిమాండ్?