Quail Bird Rearing: వీటి పెంపకం కోళ్ళ పెంపకానికి ప్రత్యామ్నాయంగా మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో చేపట్టారు.
క్వయిల్ పక్షుల ముఖ్య విషయాలు:
సంవత్సరానికి మూడు మంది నాలుగు బ్యాచ్ల వరకు పొందవచ్చు. ఆరు వారాల వయస్సులో గ్రుడ్లు పెట్టడం ప్రారంభించి, ఏడో వారంలో గ్రుడ్లు పెట్టడం అధికమవుతుంది. ఆడ క్వయిల్ బరువు 150×200 గామ్రులు, మగ క్వయిల్ బరువు 140-170 గామ్రుల బరువు ఉంటుంది. గ్రుడ్లు పొదిగే కాలం చాలా తక్కువ, వీటి పెంపకానికి తక్కువ స్థలం, తక్కువ డబ్బు అవుతుంది.
క్వయిల్ రకాలు:
జపాన్ క్వయిల్ కు చెందిన ఫారో ఇంగ్లీష్ వైయిట్ టుకిడో బ్రిటీష్ రేంజ్ మంచూరియన్ గోల్డెన్ మెదలైన తెగల నుండి కేంద్ర కోళ్ళ పరిశోధనా స్థలం రెండు ముఖ్యమైన రకాలను అభివృద్ధి పరిచింది.
· మాంస సంబంధమైనవి.
· అధిక గ్రుడ్లు అందివ్వగలవి.
గ్రుడ్లు పెట్టగల వాటిలో మరలా రెండు రకాలు కలవు. తెల్లటి గ్రుడ్లు పెట్టే రకం. మచ్చల గ్రుడ్లు పెట్టే రకం.
క్వయిల్ పెంపకం లాభదాయకం:
తొందరగా ఎదుగుతుంది. తొందరగా గ్రుడ్ల ఉత్పత్తి మొదలగుతుంది. గ్రుడ్ల ఉత్పాదన ఎక్కువ ఉంటుంది. ఒకటి 260 గ్రుడ్లను పెట్టును. ఒక కోడిని పెంచటానికి ఉపయోగించే స్థలంలో సుమారు 8 నుండి 10 క్వయిల్స్ను పెంచటానికి సరిపోతుంది.తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ గ్రుడ్లు పెట్టును.ప్రయోగశాలలో ప్రయోగాలకు క్వయిల్లను వాడడం చాలా సులభం కోళ్ళ కంటే చాలా తక్కువ ఖర్చవుతుంది. విలువైన మాంసకృతులను నీటి నుంచి పొందవచ్చు. ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా తక్కువ (17 – 18 రోజులు) 9) ఇన్ రెడ్ బ్రూడింగ్ పద్ధతి.
Also Read: Quail Rearing: కౌంజు పిట్టలపెంపకం లో కొన్ని సూచనలు.!
డీప్ లిట్టర్ పద్ధతి:
లిట్టర్ను రంపపు పొట్టు, వరి పొట్టు, వేరుశెనగ పొట్టు మొ) నేల పై పరుస్తారు. లిట్టర్ పై వంకీలు కలిగిన కాగాతా న్ని లేదా గోనె సంచులు పరుస్తారు. దీని వలన క్వయిల్లు జారిపోకుండా నిలబడగలుగుతాయి. బ్రూడర్ గృహ ంయొక్క ఉష్ణోగ్రత, బ్రూడింగ్ నకు కావలసిన ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కృత్రిమ వేడిని అందించవలసిన అవసరముండదు. ఈ విధానాన్ని కోల్డ్ బ్రూడింగ్ అంటారు.
డీప్ లిట్టర్ పద్ధతిలో 1250 పిల్లలను పెంచుటకు 10 ×10 అడుగుల కొలతలు గల గదులు అవసరం. దాణా స్థలం ప్రతి క్వయిలికి 3 సె.మీ చొప్పున కేటాయించాలి, నీటి తొట్టి స్థలం 2 సెం.మీ చొప్పున కేటాయించాలి. 4 సె.మీ మందంతో లిట్టర్ను పరచాలి. ప్రతి గదిలోను 40 వాట్స్ బల్బును అమర్చాలి.
బ్రూడింగ్:
బ్యాటరీ బ్రూడర్ల లోను లేదా డీప్ లిట్టర్ పద్దతి యందు పెంచవచ్చు. బ్రూడింగ్ ఉష్ణోగ్రత మొదటి వారములో 37 డిగ్రీల సె.గ్ర ఉష్ణోగ్రతకు తగ్గిస్తూ రావాలి. 2) తరువాత ప్రతి వారం 3 డిగ్రీల సి.గ్రీ ఉష్ణోగ్రతకు తగ్గిస్తూ రావాలి.గ్రుడ్ల ఉత్పాదన 6 వారాలకే మొదలగుతుంది. సంవత్సరానికి సగటున 250 260 గ్రుడ్లను ఉత్పత్తి చేస్తుంది.
లింగ బేధం గుర్తించుట:
ఆడ, మగ కవయిల్ల తేడా మూడు వారాల వయస్సులో గుర్తించడానికి వీలవుతుంది. నాలుగు వారాల వయస్సులో వీటి తేడా గుర్తించడం మరింత సులభతరం మగ కౌంజు పిట్ట మెడ క్రింద భాగంలో గోధుమ రంగు ఈకలు ఉంటాయి. కాని ఆడ క్వయిల్లో అదే భాగంలోని ఈకలు నల్లని మచ్చలు ఉంటాయి.
Also Read: Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!