Poultry Farm Shed: ఎవరైనా కొత్తగా షెడ్డు నిర్మించడానికి ముందు షెడ్ తగ్గ కొలతలతో ఒక ఇంజనీరు సహాయముతో ప్రింట్ తీసుకోవలసి యుంటుంది. ఫారమ్ ఎక్కడైన చెట్లు ఉండే ప్రదేశంలో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించుకోవాలి. మంచి వాతావరణం ఉంటే పశువులకు ఏ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
షెడ్ నిర్మాణం క్రింది విధంగా ఉండాలి. పశువులు నిలబడే స్థలం వెడల్పు 1.05 -1.2 మీటర్లు ఉండాలి. పశువుల మేత తొట్టె 60 సెం.మీ వెడల్పు ఉండాలి.మేత తొట్టి నేల నుండి 60 సెం.మీ ఎత్తులో ఉండేలా చూడాలి.
షెడ్ తూర్పు – పడమరల వైపుగా కట్టవలెను. పశువులు నిలబడే స్థలం పొడవు 1.5-1.7 మీటర్లు ఉండాలి. I పశువులు తిరుగు, నిలబడు స్థలము ఎక్కువగా ఉండాలి. 20-30 సెం.మీ వెడల్పు మూత్రము కాలువను వాలుతో నిర్మించాలి. సెంట్రల్ పాసెజ్ 1.5 మీటర్లు ఉండవలెను.

Poultry Farm Shed
Also Read: Turkey Poultry Farming: లాభ సాటిగా టర్కీ కోళ్ళ పెంపకం.!
పశువుల పెంచు వివిధ పద్ధతులు:-
1. Range System:- ఈ పద్ధతిలో పశువులను కట్టి వేయకుండా గడ్డి మైదానాలలో వదిలి వేస్తారు.
2. Loose Housing System:- ఈ పద్ధతిలో కూడా పశువులను కట్టి వేయకుండా గడ్డి మైదానాలలో వదిలి వేస్తారు. ఈ మైదానం చుట్టూ ఒక కాంపౌండు లాంటి కంచెను లేక కాంపౌండు గోడను నిర్మాణం చేస్తారు. అందులో దాణా తొట్లు అమరుస్తారు. పాలు పిండే సమయంలో మాత్రమే వీటిని కట్టేసి పాలు పిండుతారు. వర్షానికి మరియు రాత్రి పూట మంచు నుండి రక్షణ కొరకు పై కప్పును ఏర్పాటు చేస్తారు. ఎండ నుండి రక్షించుటకు నీడ నిచ్చు చెట్లను పెంచుతారు.
3. Confinent System:- ఈ పద్ధతిలో పశువులను ఎల్లప్పుడు కట్టివేసి యాజమాన్యం వహిస్తారు. ఇందులో ఈ క్రింది రకాలు కలవు.
a. Single Storey System:- సాధారణంగా ఆవులను గ్రౌండ్ ఫ్లోర్ నందు వుంచుదురు. వీటికి కావలసిన మందులను ఈ ప్రదేశంలోనే ఉంచుతారు.ఇందులో పశువుల సంఖ్యను బట్టి ఒక వరుస పద్ధతి (Single row system) మరియు రెండు వరుసల పద్ధతి (Double row system) అను రెండు పద్ధతులు కలవు. షెడ్లో ఒకే వరుసలో ఆవులను కట్టి వుంచిన యెడల దానిని సింగిల్ రో సిస్టమ్ అని, రెండు వైపులా కట్టి ఉంచిన యెడల దానిని డబుల్ రో సిస్టమ్ అని అంటారు. డబుల్ రో సిస్టమ్లో ఆవులను కట్టి వుంచు అమరికను బట్టి ” Face to Face” లేదా ” Tail to Tail ” అను పద్ధతులు కలవు.
b. Double Storey System:- ఈ పద్ధతిలో గ్రౌండ్ ఫ్లోర్ పైన పశువులను కట్టి, మిద్దెపైన ఫీడ్ మరియు మందులను ఉంచుతారు.
c. Basement System:- పెద్ద పెద్ద గడ్డి మైదానాలలో మరియు కొండ చరియలలో పెద్ద పెద్ద రాళ్ళకు స్థూపాలను లేదా దిమ్మెలకు ఆవులను కట్టి పెంచుతారు.
Round barn System:- ఈ పద్ధతిలో సైలో టవర్ చుట్టూ పశువులను కట్టి ఉంచుతారు. అవసరమైనప్పుడు సైలో టవర్ నుండి పశుగ్రాసాన్ని తీసి పశువులకు మేతగా వేస్తారు.
Also Read: Disease in Turkey Rearing: టర్కీ కోళ్ల లో వచ్చే వ్యాధులు.!