Winter Poultry Care: చలికాలంలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలను సమగ్రంగా పాటిస్తే అనేక సమస్యలను అధిగమించవచ్చు. చలిగాలులు మంచు కురవడం వల్ల సాయంత్రం రాత్రివేళల్లో కోళ్ళషెడ్లలో తేమ ఆధికమై ఆవిరి కాకుండా ఉండటం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు. లిట్టర్ లో తేమ శాతం పెరగడం వల్ల పరాణ జీవుల బెడద, శీలింద్ర వ్యాధుల సమస్యలు అధికమవుతాయి ఈఅనర్ధాలు వల్ల కోళ్లు ఒత్తిడికి లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి దీంతో సి ఆర్ సి ఆర్ డి ఐ బి, కొక్కెర రోగం, బ్రూడర్ రోగం వంటి కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయి. ఈవ్యాధుల వల్ల కోళ్లల్లో అధిక మరణాలు సంభవిస్తాయి.
చలిగాలులు తీవ్రతకు లేయర్ కోళ్లు, బాయిలర్ కోళ్లు మరీ ముఖ్యంగా కోడి పిల్లలు త్వరగా అస్వస్థతకు గురవుతాయి. కనుక వాటికి సరైన వెలుతురు కల్పించాలి. కోడి పిల్లలకు మొదటివారం 95 డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత ఇస్తూ ప్రతివారం ఐదు డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత తగ్గిస్తూ ఉండాలి. అయితే ఈఉష్ణోగ్రత తగ్గింపు అనేది వాతావరణ ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉండాలి. లేయర్ బాయిలర్ కోళ్లకు కూడా సరైన ఉష్ణోగ్రత కల్పించాలి ఎందుకంటే శీతాకాలం రాత్రి వేళల్లో ఎక్కువ సమయం, పగలు తక్కువ సమయం ఉండటం వల్ల సరైన ఉష్ణోగ్రతను కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Also Read: తీపి జొన్న సాగు తో రెట్టింపు ఆదాయం.!
దాణా నిల్వలో మెళకువలు
చలికాలంలో కోళ్లకు దాణా చాలా అవసరం. బస్తాలకు తేమ తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. రెండు వరుసల మధ్య కనీసం రెండు అడుగుల ఖాళీ ఉంచుకోవాలి. బస్తాలను గోడలకు నేలకు తగలకుండా పేర్చుకోవాలి. బాగా ఎండి పొడిగా ఉన్న ముడి సరుకులు మాత్రమే నిల్వ చేయాలి. తేమ 9 శాతం కంటే ఎక్కువగా ఉంటే శీతాకాలంలో దాణ ముడి సరుకులను క్రమం తప్పకుండా పరీక్షించాలి. మూడు వారాలకు మించి నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను ముడి సరుకులను చల్లబడిన తర్వాతే గోదాములో నిల్వ చేయాలి. లేదంటే దానం ఉంచిన బస్తాల పై తేమ పేర్కొని బూజు పడుతుంది.
నేల మీద పరిచే వరిపొట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొట్టులో తేమ పెరగకుండా ఏడు నుంచి 11 కిలోల పొడి సున్నం లేదా సూపర్ ఫాస్ఫెట్ ను 100 చదరపు అడుగుల లిట్టర్ కు కలుపుతూ వారానికి రెండు మూడు సార్లు లిట్టర్ ను కలియబెట్టాలి. ఇలా చేయడం వల్ల లిట్టర్ లో తేమ శాతం తగ్గి కోడి పిల్లలకు వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు. ఈవిధంగా చలికాలంలో కోళ్ల పెంపకంలో శ్రద్ధ తీసుకుంటే రోగాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు
Also Read: ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా మధ్య కుదిరిన ఒప్పందం.!