Precautions for Bringing Baby Chicks Home: కోళ్ల పెంపకం, దేశీయంగా లేదా వాణిజ్యపరంగా పక్షులను పెంచడం, ప్రధానంగా మాంసం మరియు గుడ్ల కోసం కానీ ఈకల కోసం కూడా. కోళ్లు, టర్కీలు, బాతులు మరియు పెద్దబాతులు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, అయితే గినియా ఫౌల్ మరియు స్క్వాబ్‌లు (యువ పావురాలు) ప్రధానంగా స్థానిక ఆసక్తిని కలిగి ఉంటాయి. పౌల్ట్రీ పెంపకం ఇది వ్యవసాయ యుగం నుండి ఉద్భవించింది. గుడ్ల కోసం పెంచే కోళ్లను పొరలుగా పిలుస్తారు, మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్‌లు అంటారు.
Also Read: Nutrient Deficiency in Chicks: కోడి పిల్లలలో పోషక లోప నివారణ
పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వరకు గల పెంపకాన్ని పిల్లదశ అంటారు.ఈ దశలో పిలలు సున్నితంగా తక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి.కనుక వాటి పెంపకంలో తగిన శ్రద్ధ వహించాలి మరియు నిర్వహించాలి.
కోడి పిల్లలు తెచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కోళ్ళ పెరుగుదలకు, ఆరోగ్యముగా పెంచడానికి ముంచి లాభాలను అట్టించుటకు ఫారమ్ నిర్వహణ, కోడిపిల్లలు రాకమునుపే చాలా ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
- చిక్స్ (కోడి పిల్లలు) రాక ముందే 10 రోజుల మునుపే షెడ్లోని భూజు. ధుమ్ము, ధూళిని తినివేసి సున్నపు పూత పూయాలి.
- బ్రూడర్స్, మేత, నీటి తొట్టేలు, ఇతర పరికరముల్ కడిగి క్రిమి సంహారక మందులతో శుభ్రపరచాలి.
- వరి పొట్టు లేదా రంపపు పొట్టుతో 4 అంగుళాలు మందంతో లిట్టర్ను ఏర్పాటు చేయాలి.
- వరిపొట్టును పిల్లలు తినకుండా లిట్టర్ పైన కాగితాలు పరచాలి.
- మేత, నీటి తొట్టెలు, అంచుల చుట్టూ బండి చక్రమువలే ఒక దాని తర్వాత మరొకటి అమర్చవలెను.
- మొక్కజొన్న ముక్కలను కాగితంపైన పల్చగా చల్లాలి.
- బ్రూడర్ చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తుగా అట్టగానీ, తీగ కానీ రక్షణ దడిగా Chick guard అమర్చవలెను.
- ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ తిరగడానికి మేతకు, నీటికి కావలసిన స్థలం. వెలుతురు. వ్యాధుల నుండి రక్షణ కలిగించడానికి గల చర్యలు పాటించి కోళ్ళ నిర్వహణ చేపట్టవలెయును.
- చిన్న కోడి పిల్లలు తొలి దశలో పరిసర ఉష్ణోగ్రత మార్పుకు తట్టుకుని పెరిగే శక్తి కలిగి ఉండవు. అందువలన వాటి శరీర ఉష్ణోగ్రతను అదుపు చేయుటకు కృత్రిమ వేడిని కల్పించుట దానిని బోర్డింగ్ అని అంటారు.
- బ్రూడర్ క్రింద 200 – 300ల కోడి పిల్లలను పెంచవచ్చును.
- ఒక రోజు కోడి పిల్లలు ఫారమ్ లోనికి వచ్చిన వెంటనే పేపర్ పైన Crushed Maizeను 2 – 3 రోజులు వేయాలి. ఎందుకనగా కోడి పిల్లలకు మేత తొట్టెలో దాణాను తీసుకొనుట అలవాటు లేదా మరియు శక్తి చాలదు.
- కోడి పిల్లలు ఫారమ్ లోకి వచ్చిన తర్వాత అవి ప్రయాణపు ఒత్తిడిని. కొత్త ప్రదేశం, కొత్త వాతావరణానికి తట్టుకొను శక్తి ఉండదు. ఈ కారణంగా వాటికి ఆహారం బదులు నీటిలో ఎలెక్ట్రోలైట్స్ షుగర్ సొల్యూషన్ కలిపి ఇవ్వాలి.
- వాటి పెరుగుదలను బట్టి తగినంత నీటి తొట్టెలను, మేత తొట్టెలను ఏర్పాటు చేయాలి.
Also Read: Benefits of Eating Chicken: కోడి మాంసం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు