పశుపోషణరైతులు

Protect Crop From Wild Pigs: అడవి పందులు పొలంలోకి రాకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.!

3
Wild Pigs
Wild Pigs

Protect Crop From Wild Pigs: అడవి పందుల్లో వాసనను పసి గట్టే గుణం ఎక్కువ. అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాలలో పైర్లను అడవి పందులలో ప్రాత కాలం లేదా సాయంత్రం, రాత్రి వేళల్లో గుంపులుగా వచ్చి నష్టం కలిగిస్తాయి. మొక్కజొన్నలో 23-47% వేరుశెనగలో 20-28%, చెరకులో 18-36%, వరిలో 11-30%, జొన్నలో 10-20% దాక నష్టం కలిగిస్తాయి. పండ్లు, కూరగాయలు తోటలను వదలవు. ఇవి తినే కన్నా తొక్కి ఎక్కువగా నష్ట పరుస్తాయి.

వీటి సమస్యను అధిగమించేందుకు కంచెలుగా పంట పొలం గట్ల వెంట 3 వరుసల్లో ఇనుప ముళ్ళు తీగ కంచే /చైన్ లింక్, జి. ఐ తీగ కంచె ఏర్పాటు చేసి పందులు దూరకుండా చేయాలి. వేరుశెనగ చుట్టు కుసుమ, మొక్క జొన్న, చుట్టూ ఆముదం 4-5 సాళ్ళ చొప్పున వేయాలి. పొలం చుట్టూ కంచేగా ముళ్ళుగల వాక్కయ, రేగి, ఆగేవ్ , గచ్చ పోదలు నాటాలి. శబ్దం చేసేందుకు ఎల్. పి. జి. గ్యాస్ తో పని చేసే ఎక్స్ పెల్ పరికరం కూడా అందుబాటులోకి వచ్చింది.

Also Read: Swine Fever in Pigs: పందులలో జ్వరం ఎలా వస్తుంది.!

Protect Crop From Wild Pigs

Protect Crop From Wild Pigs

రసాయన పద్ధతులలో ఎలా నివారణ చేయాలి?
కిలో ఇసుకలో 200 గ్రా. ఫారెట్,/ థిమ్మెట్ గుళికలు కలిపి చిన్న చిన్న రంధ్రాలున్న గుడ్డ సంచుల్లో మూటలుగా కాట్టి పంట చుట్టూ అక్కడక్కడ కర్రలను కడితే వీటి వాసనకు పందులు రావు. పంట పొలం చుట్టూ కుళ్ళిన కోడి గుడ్ల ద్రావణం 20 మీ. లీ. అడుగు వెడల్పులో తడినేలపై 10 రోజులకొకసారి పిచికారీ చేయాలి. కిరోసిన్ ద్రావణంలో ముంచిన బట్ట నవారును పంట చుట్టూ 3 వరుసల్లో కట్టాలి. కొబ్బరి తాడును గంధకం + పంది కొవ్వు నూనె మిశ్రమం పూసి పంట చుట్టూ 3 వరుసల్లో కట్టాలి.10 రోజులకొకసారి తడుకు ఎకోడాన్ అనే మిశ్రమాన్ని పిచికారీ చేయాలి .

సంప్రదాయ పద్ధతులలో ఎలా నివారించలో తెలుసుకుందాం.!
పంట పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పు చదును చేసి, తడిపి ఊరా పందుల పెంట మిశ్రమాన్ని వారం వ్యవధిలో పిచికారీ చేస్తే అడవి పందులు రావు. పంట పొలం చుట్టూ గోడల మాదిరి పాత చీరలు కట్టాలి. ఊరా పందుల పేడ పిడకలుగా చేసి , కుండాలో ఉంచి పొగ బెట్టాలి. రాత్రి వేళల్లో టపాకాయలు కాల్చి శబ్దలు చేసి పారద్రోలాలి. పక్షుల వల్ల పంట నష్టాన్ని అధిగమించవచ్చు. పంట పై ఒక అడుగు ఎత్తులో మెరిసే రిబ్బన్లు కట్టడం. అలాగే వేప గింజల కాషాయం వంటి పద్ధతులను ఉపయోగించి అడవి పందుల బెడద నుండి తప్పించుకోవచ్చు.

Also Read: Transmissible Gastro Enteritis in Pigs: పందులలో ట్రాన్సిమిసబుల్ గ్యాస్ట్రా ఏంటి రైటిస్ వ్యాధి కి ఇలా చికిత్స చెయ్యండి.!

Leave Your Comments

Tomato Pest Management: టమాటో పంటను ఆశించు తెగుళ్ళు వాటి నివారణ.!

Previous article

Watershed Management: నీటి పరీవాహక ప్రాంతం అంటే ఏంటి దానికి అనుకూలించే అంశాల గురించి తెలుసుకుందాం.!

Next article

You may also like