పశుపోషణ

సీమపందుల పెంపకంతో మంచి ఆదాయం..!

1
Pig Farming Benefits

Pig Farming Benefits

Pig Farming Benefits రైతు రాజుగా మారాలంటే వ్యవసాయంలో ఆర్ధిక కోణం వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆర్ధికంగా ఎదగడం కష్టమే. ప్రస్తుతం రైతులు వ్యవసాయంతో పాటు ఆర్ధికంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అవును ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులు తమకు ఇష్టమైన వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ సాగుతో ఒక్కోసారి పంటలు సరిగ్గా పండక పోవడం, మెరుగైన పంట దిగుబడి వచ్చినా.. పండించిన పంటకు మార్కెట్ లో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే చిన్న రైతులతో పాటు నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తూ.. అండగా నిలుస్తోంది సీమ పందుల పెంపకం. Pig Farming Benefits

Pig Farming Benefits

Pig Farming పూర్వం రైతులు సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే పందులను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పద్దతి మారింది. పందుల పెంపకంకు కొంత టెక్నాలజీని జోడించాడంతో ఇప్పుడు అది ఆర్ధికంగా బలోపేతం చేస్తుంది. దీంతో ఆదాయం కూడా చాలా పెరిగింది. కోళ్లు, మేకల తరహాలో సీమ పందుల పెంపకం ఎంతోమందికి ఉపాధినిస్తోంది. ఇక ఒక్కో ఈతలో ఎకువ పిల్లలను పెట్టటం వల్ల సంతాన వృద్ధి వేగంగా ఉంటుంది. సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువే ఉంటుంది. పందుల్లో 60 నుంచి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. వీటి కొవ్వును కోళ్ల దాణా, సబ్బుల తయారీ, రంగులు, రసాయనాల్లో వినియోగిస్తున్నారు. 7 నుంచి 8 నెలలకే వీటిని మార్కెట్ చేయవచ్చు. More Money With Pig Farming

Pig Farming Benefits

మౌళిక వసతుల అవసరం ఉంటుంది సీమపందుల పెంపకానికి.. గాలి, వెలుతురు బాగా వున్న చోట షెడ్లు నిర్మించాలి. పుట్టిన పిల్లలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సీమ పందుల పెంపకం ఖర్చులో ఎకువభాగం వాటి మేపుకే అవుతుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టి, దాణా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. పూర్తిగా దాణాపై ఆధారపడితే పెంపకం లాభసాటిగా వుండదు. మేపును బట్టి ఒకో సీమపంది రోజుకు 400-500గ్రాములు పెరుగుతుంది. 3కిలోల దాణాకు ఒక కిలో శరీర బరువు పెరుగుదల వుంటుంది. ఏడాదికి 130 సీమ పందులపై రూ.3 లక్షలకు పైగా నికర లాభం పొందవచ్చు. Pig Farming In India

Leave Your Comments

అగ్రి బిజినెస్ ఐడియాలు

Previous article

రెండ్రోజులకు రైతుల ఖాతాలో రూ.1799.99 కోట్లు జమ

Next article

You may also like