Osmanabad farmers భారతదేశం వ్యవసాయ ఆధారితం దేశం. చాలామంది రైతులు సాగునే నమ్ముకుని జీవిస్తున్నారు. కొంతమంది దీనికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీటిపైనే ఆధారపడి వారి బతుకుదెరువు ఉంటుంది. ఉస్మానాబాద్ మేక పాలతో కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అదేంటి అసలు మేక పాలు ఎవ్వరూ తాగారు కదా, అసలు మేక పాల వాసన, అరుగుదల ఉండదు కదా అనుకుంటున్నారా? అదేమో గాని మేకలందు ఉస్మానాబాద్ మేకలు వేరయా అంటున్నారు ఆ జాతి మేకలను పోషించే రైతులు. Osmanabadi Goat Milk Soap
అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా వాసులకు మాత్రం మేక పాలే జీవనాధారంగా మారాయి. ఇప్పుడు అక్కడి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటోంది ఈ రకం జాతి మేక పాలు మాత్రమే. నిజానికి ఉస్మానాబాద్ మేకలు మన దేశంలో చాలా ఫెమస్ అనే చెప్పాలి. ఎక్కువ ప్రోటీన్స్, తక్కువ కొవ్వు పదార్ధం ఉండే ఈ మేకలు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా వాసులకు వరంగా మారాయి. పైగా ఒకే ఈతలో నాలుగైదు పిల్లలు పుడతాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ జాతి మేకలు ఉస్మానాబాద్ జిల్లా రైతులు దాదాపుగా 250 కుటుంబాలు మేక పాలతోనే జీవనోపాధి పొందుతున్నారు.
Osmanabad farmers ఉస్మానాబాదీ మేక పాలతో వారు సబ్బులను తయారు చేస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని 25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు సబ్బుల తయారీపై ఆధారపడి జీవిస్తున్నాయి. విటమిన్ ఏ, ఈ, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఈ మేక పాలు..చర్మ వ్యాధులను నయం చేస్తాయని శివార్ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్ హెగనా అంటున్నారు. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు తాము రూ. 300 చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. ఇక సబ్బుల తయారీలో పనిచేస్తున్నందుకు గానూ, ప్రతిరోజు రైతులు కూడా రూ. 150లు సంపాదిస్తారని ఆయన వివరించారు. 1400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా సంస్థ సీఈవో వెల్లడించారు. Agriculture Daily News