Broiler Management: కోడి పిల్లల గుణ మట్టం (Chick Quality) –
- ఈ పెంపకంలో కోడి పిల్లల తల్లిదండ్రులు ఆరోగ్యంగా వుండాలి. 100 కోడి పిల్లలు 3.8-4 కె.జీ. ‘బరువు తూగాలి.
- ఈ పెంపకంలో అన్ని కోడి పిల్లలు ఒకే రకమైన రంగు, సైజు వుండాలి.
- పుట్టిన పిల్లలు శుభ్రంగా కోడి గుడ్డు నుండి బయటకు రావాలి. తడి లేకుండా వుండాలి మరియు రెక్కలు బాగుగా ఆడుతూ వుండాలి.
- పుట్టిన పిల్లలు చురుకుదనంగా వుండాలి మరియు వీటి శరీరంలో లోపాలు లేకుండా వుండాలి.
- ఈ పుట్టిన పిల్లలకు మారెక్స్ మరియు రానికేట్ వ్యాధులకు గాను టీకాలు వేయాలి.
Also Read: Broiler Chickens: మాంసపు కోళ్ళ పెంపకంలో ఈ విషయాలు గమనించండి.!
ఇండ్ల నిర్మాణంలో కొన్ని సూచనలు:
- ఈ పెంపకంలో ప్రతి కోడికి తగినంత స్థలం కేటాయించాలి.
- ప్రతి కోడిపిల్లకు బ్రూడర్ నందు 32 సె.మీ. లేదా 5 అంగుళాల స్థలం వుండాలి.
- పెరిగిన పెద్ద కోళ్ళకు 1 చదరపు అడుగు స్థలం వుండాలి.
- సరిపడునంత గాలి వచ్చేలా వీలుండాలి.
- కోడి పిల్లల గృహములో 70° ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వుండే విధంగా క్రమాలు వుండాలి.
Poultry House Temperature:
- కోడి పిల్లల పెంపకంలో మొదటి వారం 95 డిగ్రీ ఫారన్హీట్ ఉష్ణోగ్రత వుండుట చాలా ముఖ్యం. రాత్రి వేళలలో 3 వారాల పాటు అంటే బ్రూడింగ్ వ్యవస్థలో తక్కువ కాంతిని ఇచ్చే బల్బు వుండాలి మరియు ఈ క్రింద కనపరచిన
- రీతిలో ఉష్ణోగ్రత వుండేలా క్రమములు తీసుకోవాలి.
వెంటిలేషన్ ఆఫ్ బ్రాయిలర్ హౌస్:
వెంటిలేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమనగా కోళ్ళ గృహములో తగినంత ఆక్సిజన్ వుండాలి. కార్భన్ డై ఆక్సైడ్ లెవల్స్ తక్కువగా వుండాలి మరియు గృహంలో వున్న ధూళి, ధుమ్ము తేమాంశం అమ్మోనియా వాసన బయటకు వెళ్ళేలా క్రయాలు చేపట్టాలి. పెరుగుదలకు తగినంత ఉష్ణోగ్రతను అందించాలి. అవసరమైతే ఎక్స్ ఫ్యానులు ఉపయోగించుటకు క్రమములు తీసుకోవాలి.
రైట్ ఫర్ బ్రాయిలర్స్:
వెలుతురు విషయంలో రకరకాల అభిప్రాయాలు అనుభవమున్న వారు తెలిపారు. ఎక్కువ మంది పెరుగుదల ప్రారంభంలో 15 వాట్స్ బల్బు ప్రతి 200 చదరపు అడుగులు ఫ్లోర్ స్పేస్కు వుండాలని అనుభవం పైన తెలిపినారు. చాలా మంది కోళ్ళ పెంపకపు దారులు బ్రూడర్ నందు 24 గం॥ లైట్ వుండాలని అభిప్రాయ పడ్డారు.
డీ కింగ్:
కెనబాలిజమ్ అరికట్టుటకు మరియు కోళ్ళ దాణా వృధా కాకుండా వుండుటకు డీ బీకింగ్ను పుట్టిన కోడి పిల్లలకు ఎలెక్ట్రికల్ డీ బీకింగ్ చే కత్తరించెదరు.
లింగ నిర్ధారణ:
- ఈ మాంసపు కోళ్ళ పెంపకంలో ఆడ మరియు మగ కోడి పిల్లల ఆహార విషయంలో కొన్ని క్రయాలు పాటిస్తే అధిక లాభాలను పొందుటకు అనుకూలించును. దాణా ముడి పదార్థాల ధరలు ఎక్కువ వుండుట వలన మగ మరియు ఆడ కోడి పిల్లలకు ప్రత్యేకంగా తక్కువ ఖర్చు వచ్చునట్లు దాణా కలుపుకొనవచ్చు.
- పుట్టిన పిల్లలను ఆడ మరియు మగ పిల్లలను వేరు చేసి పెంచాలి. వీటిలో మగ పిల్లలు మార్కేట్లో అమ్ముటకు త్వరగా వచ్చును. తర్వాత ఆడ పిల్లలు 7.8 రోజులు అమ్ముటకు ఆలస్యంగా వచ్చును. మగ పిల్లలు ఆడ పిల్లల కంటే నిర్ణీత వ్యవధి ఎక్కువ తూగును.
ఈ లింగ భేదంలో పెరుగుదల పై కొన్ని ముఖ్యమైన గమనికలు:
- పుట్టిన కోళ్ళలో మగవి 1% ఆడ కోడి పిల్ల కంటే ఎక్కువ బరువు తూగును.
- మగ కోడి పిల్లలు ఆడ కోడి పిల్లల కంటే త్వరగా పెరుగును. నిర్ణీత కాలంలో మగ కోడి పిల్లలు ఎక్కువ బరువు తూగును.
- మార్కెట్లో మగ కోడి పిల్లలు ఆడ కోడి పిల్లల కంటే 9 రోజులు ముందుగా అమ్ముటకు వీలుగా వుండును
- మగ కోడి పిల్లలకు ఎక్కువ మాంసకృత్తులు పెరుగుదలకు అవసరం.
Also Read: Broiler Farming: మాంసవు కోళ్ళ పెంపకంలో గృహవసతి, పోషణ యాజమాన్యం.!