Mastitis Disease in Cows: పాడి రైతులకు పాలు జీవన ఆధారం. పాల ఉత్పత్తి పాడి పశువు యెక్క జాతి మీద ఆధారపడి ఉంటుంది. మంచి పాల దిగుబడి గల పాడి పశువుకు ఒకసారి పొదుగువాపు వచ్చినట్లైతే, పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతుల పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోటయేకాక, పొదుగు వాపు చికిత్సకు చాలా ధనం ఖర్చు చేయ్యవలసి ఉంటుంది. అందుకే పొదుగు వాపు వ్యాధిని పాడి రైతుల మొదటి శత్రువు అని అభివర్ణిస్తుంటారు. పొదుగు కణజాలం యొక్క అస్వస్థత వలన పాల రంగు, రుచి, వాసన మారిపోయే పరిస్థితిని పొదుగువాపు లేదా Mastitis అని అంటారు.
వ్యాధి కారకము:- పొదుగువాపు వ్యాధి చాలా రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు మరియు శీలింధ్రాల వలన కలుగుతుంటుంది. వాటిలో ముఖ్యమైనవి.
పొదుగు వాపు రావాడానికి గల కారణాలు:-
పశువుల చుట్టు ప్రక్కల అపరిశుభ్రత గల పరిస్థితులు ఉండటం వలన, పాలు పితికే వ్యక్తి చేతులు శుభ్రంగా లేక పోవుట వలన,పాలు పిండు పరికరములను శుభ్రంగా కడగకపోవడం వలన, పాలు పిండే విధానం సరిగా తెలియకపోవడం వలన, ఈగల ద్వారా, పాలు పూర్తిగా పిండి వేయకుండా పొదుగులో మిగిల్చివేయటం వలన, పొదుగుకు గాయాలు, పొదుగు మీదా గడ్డలు వంటివి ఉన్న పరిస్థితులలో, అపరిశుభ్రమైన నీటిని పొదుగు కడగడానికి ఉపయోగించుట వలన వస్తుంది.
వ్యాధి బారిన పడు పశువులు:- ఈ వ్యాధి ఎక్కువగా విదేశీ, సంకరజాతి, అధిక పాల దిగుబడి గల జంతువులైన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలలో ఎక్కువగా వస్తుంటుంది. అన్ని కాలములలో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చినప్పటికీ, వర్షాకాలంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Also Read: Heat Detection in Buffaloes: గేదెలలో మూగ ఎద లక్షణాలను ఎలా గుర్తించాలి.!
వ్యాధి వచ్చు మార్గం:-
(1) పాలు పిండిన తర్వాత చన్నుల రంధ్రాలు మూసుకోవడానికి అనగా సాధారణ స్థితిలోనికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో క్రిములు పొదుగులోనికి ప్రవేశించటం ద్వారా,
(2) పొదుగు గాయాలు ద్వారా,
(3) వివిధ రకాల సెప్టిసీమియా వ్యాధులలో రక్తం ద్వారా క్రిములు పొదుగులోకి చేరుట ద్వారా కూడా ఈ వ్యాధి కలుగుతుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- పైన ఉదాహరించిన వ్యాధి కారకాలు చను రంధ్రం ద్వారా టీట్ కెనల్లోకి ప్రవేశించి, అక్కడ నుండి చన్నులోకి వెళ్ళి, అక్కడి నుండి పొదుగునాళాల ద్వారా పొదుగు కణజాలాలలోకి చేరి, ఆ కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా పొదుగు వాచి, నొప్పిగా వుంటుంది. కావున ఈ వ్యాధిని పొదుగు వాపు అని అంటారు. కొంత కాలానికి పొదుగు కణజాలంలోని కణాలు పూర్తిగా విచ్చిన్నమై, వాటి స్థానంలో ఫైబ్రస్ కణజాలం (Fibrous Tissue) వచ్చి చేరుతుంది. దీని వలన పాల గ్రంథి పరిమాణం చిన్నదిగా మారుతుంది. ఈ దశలో పొదుగు కణాలు పూర్తిగా పాడైపోయి గట్టిగా తయారవుతుంది. కొన్ని సందర్భాలాలో పొదుగు కణజాలం ఊడి క్రింది పడి పోవచ్చు.
వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధి లక్షణాలను 5 రకాలుగా విభజించవచ్చు.
అవి:
(1) అతి తీవ్రపు వ్యాధి
(2) తీవ్రపు వ్యాధి
(3) సాధారణమైన పొదుగు వాపు వ్యాధి
(4) దీర్ఘకాలిక పొదుగు వాపు వ్యాధి
(5) జబ్బు లక్షణాలు బయటకు చూపించని పొదుగు వాపు వ్యాధి.
Also Read: Actinomycosis Disease in Cows: ఆవులలో వచ్చే దవడవాపు వ్యాధియాజమాన్యం.!