Litter Management in Poultry: కోళ్ల పెంపకం, దేశీయంగా లేదా వాణిజ్యపరంగా పక్షులను పెంచడం, ప్రధానంగా మాంసం మరియు గుడ్ల కోసం కానీ ఈకల కోసం కూడా. కోళ్లు, టర్కీలు, బాతులు మరియు పెద్దబాతులు ప్రాథమిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, అయితే గినియా ఫౌల్ మరియు స్క్వాబ్‌లు (యువ పావురాలు) ప్రధానంగా స్థానిక ఆసక్తిని కలిగి ఉంటాయి. పౌల్ట్రీ పెంపకం ఇది వ్యవసాయ యుగం నుండి ఉద్భవించింది. గుడ్ల కోసం పెంచే కోళ్లను పొరలుగా పిలుస్తారు, మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్‌లు అంటారు.
Also Read:
ఈ పద్ధతి యందు ఒక గదిలో 250 కోళ్ళను పెట్టి పెంచుట క్షేమము. ఈ డీప్ లిట్టర్ పద్ధతి యందుడై ఆర్గానిక్ పదార్థాలు అయిన ఎండుగడ్డి (2-3 అంగుళాలు) వరకు కత్తిరించవలెను. రంపపు పొడి, ఎండిన ఆకులు, వేర శనగ పొట్టు, Broken up maize- stalks and cobs, the Bark of trees, paddy Husk. మొదలగునవి వాడుకలో ఉన్నాయి.
- ఈ పదార్థాలను కోళ్ళు వుంచు గదిలో 6 అంగుళాలు ఎత్తు వరకు వెయ్యాలి.
- నేలపై పై చెప్పబడిన పదార్ధములు పరిచెదరు. దాని పైన కోళ్ళను వుంచి పెంచెదరు.
- ఈ పద్ధతినే డీప్ లిట్టర్ పద్ధతి అని పిలిచెదరు.
- వీటి పైన కోళ్ళు రాత్రి పగలు నివసించును.
- వాటి మల ముత్రములు లిట్టర్ పై పడి కలిసి పోవును.
- కోళ్ళు గీకుట ప్రక్రియ వలన డీప్ లిట్టర్ నందు మల ముత్రము కలియుటకు సహకరించును.
- ఇందులో సూక్ష్మజీవుల ప్రక్రియ ఆరంభించును.
- ఇది రెండు నెలల లోపల మంచి ఎరువుగా మారును. ముఖ్యంగా డీప్ లిట్టర్ను ఎల్లవేళల పొడిగా వుంచునట్లు కార్యక్రమములు చేపట్టాలి. 6 నెలల తర్వాత ఈ డీప్ లిట్టర్ బిల్ట్ అప్స్ లిట్టర్ గా మారును.
- ఇవి 12 నెలల తర్వాత పూర్తి లిట్టర్గా తయారగును.
- దాని పైన అవసరమున్నచో తగినంత లిట్టర్ పదార్ధములను వేసి వాడవచ్చును.
- ఈ డీప్ లిట్టర్ సిస్టమున్న వాతావరణం పొడిగా వున్న సమయాల్లో ప్రారంభించాలి.
- ప్రతి కొత్త బ్యాచ్కు లిట్టర్ను మార్చాలి.
డీప్ లిట్టర్ యొక్క ప్రయోజనాలు :
- ఈ పద్ధతిలో కోళ్ళకు రక్షణ వుండును.
- ఈ రక్షణకుగాను, కోళ్ళను డేగలు మరియు ఇతర జంతువుల నుండి కాపాడుటకు కార్యక్రమములు చేపట్టాలి.
- లిట్టర్ ద్వారా కోళ్ళకు కొంత ఆహారం లభించును.
- ఈ లిట్టర్ నుంచి విలువైన సహజ ఎరువు వచ్చును. ఉదా :- 35 గ్రుడ్లు పెట్టు కోళ్ళ నుండి ఒక సంవత్సరమునకు విలువైన ఒక టన్ ఎరువు లభించును.
- ఈ డీప్ లిట్టర్ ఎరువు పశువుల ఎరువు కంటే 3 రేట్లు పోషక విలువలతో అధికంగా వుంటాయి. ఈ పద్ధతిలో కోళ్ళను అధిక వేడి నుండి కాపాడగలిగే శక్తి వున్నది. ఎట్లనగా డీప్ లిట్టర్ ఇన్నలేటింగ్ ఎజెంట్ గా పని చేయయును.
- ఈ డీప్ లిట్టర్ పద్ధతిని మార్చ్, ఏప్రిల్ నెలల యందు ప్రారంభించవచ్చును.
- ఈ పద్ధతి ద్వారా కోళ్ళకు Biz, B. విటమినులు లభ్యమగును.
- ఈ పద్ధతి ద్వారా కోళ్ళ గృహములో తేమను అదుపులో పెట్టవచ్చును. ఈ పద్ధతి ద్వారా కోళ్ళలో పరాన్న జీవుల బాధ వుండదు.
- వాతావరణంలో మార్పులు వున్నచో ఈ పద్ధతి ద్వారా వాటి బారి నుండి కోళ్ళను కాపాడును.
Also Read: