Listeriosis Disease in Goats: ఇది లిస్టీరియా మోనోసైటోజెన్స్ (Listeria monocytogens) అను Gm+ve బ్యాక్టీరియా వలన నెమరు వేయు జంతువులు (మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు) మరియు నెమరు వేయని పందులు, కుక్కలు, పిల్లులతో పాటు మనుషులలో కూడా కలిగే ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధిలో మెదడు వాపు లక్షణాలు, సెప్టిసీమియా లక్షణాలతో పాటు పశువులు ఈసుకుపోవడం జరుగుతుంది.
Also Read: Smallpox in Goats: మేకలలో వచ్చే మశూచి వ్యాధి/ పాక్స్/బొబ్బ రోగం.!
వ్యాధి కారకం:-
(1) లిస్టీరియా మోనోసైటోజెన్స్ వలన కలుగుతుంది.
(2) ఇది ఒక Gm+ve బ్యాక్టీరియా.
(3) ఇవి ప్రాణాంతకమైన Exotoxin విషపదార్థాలను విడుదల చేయును.
(4) వీటి పెరుగుదలకు గాలి అవసరం.
(5) ఈ బ్యాక్టీరియాలు తెల్లరక్తకణాలైన మోనోసైట్ కణాలలో వ్రుద్ధి చెందుతాయి. అందుకే ఈ బ్యాక్టీ రియాను మోనోసైటోసిస్ అని అంటారు.
వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధి లక్షణాలను ఈ క్రింది విధముగా వివరించవచ్చును.
(A) మెదడు వాపు లక్షణాలు:–
(1) కళ్ళు గుండ్రంగా తిప్పుతుంటాయి. అరుస్తూ పరిగెడుతూ వుంటాయి. కళ్ళు సరిగ్గా కనిపించక ఎదురుగా వుండే గోడలను డీ కొంటు వుంటాయి. కంటి పొర శోధం వలన కంటి నుండి నీరు, నోటి నుండి చొంగ కారుతుంది. I
(2) సెప్టిసీమియా లక్షణాలు:- ఆకలి వుండదు, ఆహారం తీసుకోవు, నీరసంగా వుంటాయి. బక్క చిక్కి వుంటాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి వుంటుంది. నెమరు వేయవు. అర్రలు పొట్ట కదలికలు తక్కువగా వుంటాయి.
(3) గర్భస్రావము లక్షణాలు:- 7 నెలలకు పై బడిన చూడి పశువులు ఈసుకుపోతాయి. ఫలితంగా ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
(B)వ్యాధి వచ్చు మార్గం:-
(1) వ్యాధి కారక క్రిమితో కలుషితమైన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకున్నపుడు
(2) శరీర గాయాల ద్వారా
(3) దూడలకు పాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
Listeriosis Disease in Goats:- మేకల లో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:-
(1) బ్యాక్టీరియాతో కలుషితం అయిన ఆహారం, పాలు నోటి ద్వారా తీసుకోవడం వలన బ్యాక్టీరియాలు పొట్ట ప్రేగుల్లోకి చేరి, అక్కడ నుండి రక్తంలో చేరి, రక్తంలో వుండే మోనోసైట్స్ కణాలలో వ్రుద్ధి చెంది, సెప్టిసీమియాగా మారి, కాలేయం, గుండె, ప్లీహము, మూత్ర పిండాలు మరియు లింఫ్ గ్రంథులలో చేరి వాటిని పాడుచేస్తాయి.
(2) రక్తం ద్వారా ఈ బ్యాక్టీరియాలు పిండంతో ఉన్న గర్భంలోకి చేరి ఈసుకుపోయేటట్లు చేస్తాయి. (7 నెలల పై బడిన చూడి పశువులలో)
(3) శరీర గాయాల ద్వారా లేదా నోటి గాయాల ద్వారా ఈ బ్యాక్టీరియా రక్తంలోకి చేరి, అక్కడ నుండి మెదడుకు పోయి మెదడు వాపును కలుగ జేస్తుంది.
Also Read: Goat Farming: మేకలలో ‘న్యుమోనియా’ కలవరం