Broiler Chickens: నాలుగు దశాబ్దాల్లో మన పౌల్ట్రీ రంగం పెరటి కోళ్ళ పెంపకం నుండి పరిశ్రమ స్థాయికి రూపాంతరం చెందింది. ఈ పరివర్తన కోళ్ళ పెంపకంతో పాటు ప్రాసెసింగ్, హ్యాచింగ్, వంటి రంగాలలో ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్య పెట్టుబడుల వలన జరిగింది. మన రైతులు స్వదేశి రకాల పెంపకం నుండి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంకర రకాల పెంపకం వైపు తరలినారు.
Also Read: Broiler Farming: మాంసవు కోళ్ళ పెంపకంలో గృహవసతి, పోషణ యాజమాన్యం.!
నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిల్నాడు 45 శాతం గ్రుడ్ల ఉత్పత్తి చేస్తు న్నాయి. ఇక్కడ తలసరి గ్రుడ్లు వినియోగం 57 గ్రుడ్లు మరియు బ్రాయిలర్ కోళ్ళ మాంసం 0.5 కిలోలతో ఉంది. భారతదేశం యొక్క తూర్పు మరియు మధ్య ప్రాంతాలు గ్రుడ్ల ఉత్పత్తి 20 శాతం ఉండగా, తలసరి వాడకం 18 గ్రుడ్లు మరియు బ్రాయిలర్ కోడి మాంసం 0.13 కిలోలుగా ఉంది.
భారతదేశంలో పౌల్ట్రీ రంగం వృద్ధి పౌల్ట్రీ ఫారమ్ల పెరుగుదల ద్వారా గుర్తించబడినది. ప్రారంభంలో బ్రాయిలర్ కోళ్ళ ఫారాలు బ్యాచ్ కు 200-500 కోడి పిల్లలలో సగటున ఉత్పత్తి చేసింది. కాని ఇప్పుడు 5000 బ్రాయిలర్స్ కన్నా తక్కువ పక్షులతో ఫారాలు అరుదుగా ఉన్నాయి. ప్రతి బ్యాచ్ కు 5000 నుండి 50,000 పక్షులతో ఉన్న యూనిట్లు సర్వ సాధారం అయ్యాయి.
మాంసపు కోళ్ళ పెంపకంలో అర్థం చేసుకోదగిన యదార్థ విషయాలు
- మగ కోడి పిల్లలు నిర్ణీత కాలం ఆడ కోడి పిల్లల కంటే ఎక్కువ సామర్థ్యం, బరువు కల్గి ఉంటుంది.
- ప్రతి వారం కోళ్ళు ఆహారం స్వీకరించటంలో బరువుకు తగినట్లుగా ఉంటుంది.
- సామాన్యంగా నిర్ణీత వయస్సులో ఎక్కువ ఆహారం ఆరగించును. దానికి తగినట్లుగా ఆహారం జీర్ణం చేసుకొనుటకు శక్తి కల్గి ఉంటుంది.
- నిర్ణీత కాలంలో ఆశించినట్లు బరువు పెరిగినచో అది తీసుకొన్న ఆహారం యొక్క గుణం అని అవగాహన చేసుకొనవచ్చును.
- ఆరోగ్యకరమైన కోడి పిల్లలు ఎక్కువ ఆహారంను ఆరగించును. వాటిని జీర్ణం చేసుకొను శక్తి కల్గి వుండును అయితే వ్యాధి గ్రస్తమైన కోళ్ళు ఈ గుణములు కల్గి యుండవు. 5. ఎక్కువ చురుకుదనం కల్గి యుండినచో వాటిలో ఫీడ్ ఎఫిషియన్సీ తగ్గుతుంది.
- కెనబాలిజమ్ వుండినచో వాటిలో ఆహారం ఆరగించుట తక్కువగా వుండును. పెరుగుదల మరియు ఫీడ్ కన్వర్షన్ తగ్గుతుంది.
- కోడి పిల్లల పెంపకంలో ఉష్ణోగ్రత మార్పులు ఉన్నచో ఆహారం ఆరగించు విషయములలో వ్యత్యాసములు కల్గి ఉంటుంది.
- అధిక ఉష్ణోగ్రత వున్నచో కోడి పిల్లలు తక్కువ ఆహారంను స్వీకరించును. దీని వలన జీర్ణ శక్తి తగ్గుతుంది.
- ఈ పెంపకంలోని కోడి పిల్లలు సైజ్లో వ్యత్యాసం వున్నచో వాణిజ్య పరంగా నష్టములు సంభవించును. 10. 2 రోజులు మాంసపు కోళ్ళు వచ్చుటకు ముందు బ్రూడర్ యెక్క ఉష్ణోగ్రత 95 – 110 డిగ్రీల ఉండేలా చూడాలి.
- మాంసపు కోడి పిల్లలకు ఇతర జంతువుల నుండి కాపాడుటకు గాను మరియు తగినంత ఉష్ణోగ్రత ఉండుటకు సాలిడ్ గార్డను బ్రూడర్కు దూరంగా అమర్చాలి.
- కోడి పిల్లలకు చిక్ స్టార్టర్ దాణా కోళ్ళ ట్రేలలో తినుటకు అనుకూలంగా వుంచాలి మరియు కోడి పిల్లలకు పరిశుభ్రమైన నీరు త్రాగుటకు అనుకూలంగా ఉండేలా చూడాలి. 13. తగిన ఉష్ణోగ్రతకు గాను 40 వాట్స్ బల్బును బ్రూడర్ కు అమర్చాలి.
Also Read: Broilers Importance: మాంసపు కోళ్ళ యొక్క ఆవశ్యకత.!